Total Pageviews

Saturday, 6 October 2012

సమస్య


నీ సమస్యలకు రకరకాల సమాధానాలు చెప్పే కొన్ని వందల నోళ్ళ కంటే ...

సమస్యను జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ఒకేఒక చెవి మేలు ..

న్యాయవ్యవస్త



న్యాయవ్యవస్త బాగాలేదు ఎలా మార్చాలి అని తీవ్రంగా ఆలోచించి తల బద్దలు కొట్టుకుంటున్నావా...??

ముందు నీవు నీ చుట్టూ ఉన్న పరిస్తితులలో అందరితో న్యాయంగా ఉండు .... న్యాయవ్యవస్త దానంతట అదే బాగుపడుతుంది ....

Thursday, 4 October 2012

వినాయక చవితి



కాణిపాక స్వయంభు వరసిద్ది వినాయక మంత్రం
***************************

""వక్రతుండ మహా కాయ సూర్యకోటి సమప్రభ
నిర్విగ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా !


సర్వ విగ్న హరం దేవం సర్వవిగ్న వివర్జితం
సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకం !

ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం
పాశాంకుశధారం దేవంధ్యాయే కాణిపాక వరసిద్ది వినాయకం !"""

మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు .....

పండగ ముగిసే వేళైంది


పండగ ముగిసే వేళైంది . ఇక

మంచితనం ముద్దబంతుల్ని పదిమందితో పంచుకో..

ఆశల చలిమంటలను మనసు నిండుగా నింపుకో..


చెలిమి చెరుకు తీపిదనం తరగని ధనమని తెలుసుకో..

నమ్మిన నేస్తం నీడలో నీ అడుగుజాడల చిరునామా చూసుకో -...

నీవు భక్తితో చేసుకొన్నవినాయక చవితి పండగ ముంగిట్లోని కాంతులు
ఏడాది పాటు తోడుంటాయని తలచుకో ....,

రాబోయే రోజులన్నీ రమ్యమైన రంగవల్లుల రహదారులుగా తీర్చి దిద్దుకో ....

శుభరాత్రి మిత్రమా !!!!

దిశ తప్పిన ప్రయాణం



మధుర గాయాల వేణువునై,కోటిరాగాల జననినై జీవిస్తున్నానని వెదురు....

వేయితలలను సైతం వినయంగా వంచి వేలాదిజీవుల ఆకలితీరుస్తున్నానని వరిపైరు.......

సంతోషంగా తనువుచాలిస్తున్నాయి !!!!.


కానీ మిత్రులారా .....

గమ్యం వుండీ గమనం లేక....
విజ్ఞానంవుండీ జ్ఞానంలేక... మనిషులై వుండీ మానవత్వంలేక
నేటి తరం దిశ తప్పి ప్రయాణిస్తున్నారు ...

శుభోదయం మిత్రమా !!!!

గతం,భవిష్యత్తు ,వర్తమానం



గతం నీకు పాఠం చెబుతుంది ... భవిష్యత్తు ఆ పాఠం పై పరీక్ష పెడుతుంది ..
కాబట్టి వర్తమానం లో నేర్చుకున్న పాఠం చదువుకో !!

శుభ సాయంత్రం మిత్రమా !!!

అందమైన ప్రక్రుతి




చాలా సంపాదించాను ,చాలా అందంగా ఉన్నాను.. నాకు చాలామంది ఫాన్స్ ఉన్నారు అని సంతోషపడుతున్నారా...?? పడితే పదండి కాని ఏనాడైనా వీటిలో తక్కువ ఎక్కువలైతే మాత్రం చింతించకండి .....

ఎందుకంటే మిత్రులారా ...

నీవు నిలుచున్న భూమి దగ్గర కొన్ని కోట్ల మంది ఆరాధించే అందమైన ప్రక్రుతి , బంగారు లోహ సంపద ఉన్నా కూడా నిలకడగా ఉండి మౌనంగా వెలుతురుని , చీకటిని సమానంగా భరిస్తుంది ...

శుభరాత్రి మిత్రమా !!

Roller Coaster

అబద్ధము




అబద్ధము చెప్తే నీవు ఎప్పుడూ కూడా ఎవరికి ఏమి చెప్పావో గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది ...

అదే నిజం చెబితే నీవు ఎవరు, ఎప్పుడు అడిగినా ఒకటే చెప్తావు ..ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు .

కాబట్టి మిత్రులారా ..

మీరు బెదురు చూపులతో , భయముతో వణికే స్వరముతో మాట్లాడినా నిజం మాట్లాడడమే మంచిది .

శుభోదయం మిత్రమా !!!

ఎక్కు పెట్టిన బాణం



ఎక్కు పెట్టిన బాణం ఎంత వెనక్కు వెళితే ......వదలగానే అంత ముందుకు వెళ్లి లక్షాన్ని చేదిస్తుంది ....

కాబట్టి

మీ జీవితము సమస్యలతో వెనక్కు వెళ్ళినట్లు అనిపిస్తే ... త్వరలోనే మీరేదో గొప్ప పని లాంచ్ చేయబోతున్నారని అర్థం ...

శుభ రాత్రి మిత్రమా !!!

ఉచిత సలహాలు



మనలో కొంతమంది అడగ కుండానే ఉచిత సలహాలు , నీతులు చెబుతుంటారు ...

మరీ ఎక్కువగా ఊ . స (ఉచిత సలహా ) లు ఇవ్వకుండా మీకు మీరే మాట్లాడే ముందు మీ మాటలు ఈ మూడు ద్వారాల నుంచి ప్రయాణించేట్లు చూడండి ..

1 ) చెప్పే మాట మంచిదేనా ..??

2 ) ఆ మాట నిజమేనా ...??
3 ) మాట చెప్పడం ఇపుడు అవసరమేనా ..???

మీ మాట వీటినుంచి ప్రయాణించేటప్పుడు ద్వారం ఆకుపచ్చ లైట్ కాకుండా ఎర్ర లైట్ వెలిగిస్తే మాత్రం మాట్లాడకండి ...

శుభోదయం మిత్రమా !!!

PS :: (మనము ఏదైనా షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు లేకపోతే విమానము ఎక్కేటప్పుడు సురక్షా ద్వారము ద్వారా వెళ్ళమని చెప్తారు ... మెటల్ డిటెక్టర్ తో చెక్ చేస్తారు గ్రీన్ లైట్ ఉంటె పంపుతారు ఎర్ర లైట్ వెలిగితే రెండోసారి తనిఖి చేస్తారు ... అదే విధముగా మాటలను ఈ పైన చెప్పిన గేట్స్ నుంచి పంపమని నా అర్థం ..)

Positive Thinking


Don't ever think that you are the VICTIM of your past ...

Think positively and replace VICTIM with SURVIVOR ..!!!!!

మారని జ్ఞాపకాలు




కాలంతో పాటు మనుషులు మారుతారు ... ఒక్క మారనివి అంటే జ్ఞాపకాలు మాత్రమే..

కాబట్టి కొంత మంది మారే మనుషులతో ఉండడం కంటే మారని వారి జ్ఞాపకాలతో ఉండడమే ఉత్తమమని అనుకొంటారు ...

అందుకే వారు అంటుంటారేమో ..""" తుమ్హారే యాదోన్ కే సాహారే మై పూరి జిందగీ కాట్ లూంగా " అని ..

శుభరాత్రి మిత్రమా !!!

ఏది గొప్ప ..?




కోట్లాది రూపాయలను సంపాదించడం గొప్ప కాదు ....
కోట్లాది మంది మనసులను దోచుకోవడం గొప్ప .....

శుభ రాత్రి మిత్రమా !!!

నా కోసం వెతికాను ... మీరు దొరికారు ....



నా కోసం వెతికాను ... మీరు దొరికారు ....

శుభ సాయంత్రం మిత్రమా !!!

నిర్మొహమాటం

 

నీవు నిర్మొహమాటంగా , మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నావంటే ఈ ప్రపంచం నీకు ఇవాల్సిన వారి కంటే ఎక్కువ మంది శత్రువులనే ఇస్తుంది ...

కాని తక్కువ సంఖ్యలో నిన్ను నిన్నుగా మెచ్చిన స్నేహితులను మాత్రం పరిచయం చేస్తుంది ...

శుభరాత్రి మిత్రమా !!

మేకలా కాదు పులిలా బ్రతుకు ...


ఈ ప్రపంచములో బ్రతకాలనుకుంటే మేకలా కాదు పులిలా బ్రతుకు ...

ఎందుకంటే

ఎప్పటికైనా బలి ఇచ్చేది మేకనే కాని పులిని మాత్రం కాదు ...

శుభ సాయంత్రం మిత్రమా !!!

జీవితంలో వచ్చే కష్టాలు


మనిషికి జీవితంలో వచ్చే కష్టాలు మనిషిని అంతం చేయడానికి రావు ....అవి మనిషిలో దాగున్న ప్రతిభను లోకానికి పరిచయం చేయడానికి మాత్రమే వస్తాయి ..

కాబట్టి మిత్రులారా ...

మీరు మీకు వచ్చిన కష్టాలను మీ ప్రతిభతో పరిష్కరించి ..... మిమల్ని handle చేయడం కూడా కష్టమని కష్టాలకు తేల్చి చెప్పండి ....

శుభరాత్రి మిత్రమా !!!

రుచి

 

రుచి బాలేదని తిన్న తిండి పై ఫిర్యాదు చేసేముందు ఈ ప్రపంచములో ఏంతో మందికి అసలు తినే అదృష్టమే రాసి పెట్టి లేదని గుర్తుంచుకోండి .....

మది కోరిన బహుమతి

ఎలా మాట్లాడాలి /వినాలి ..?



ఎవరైనా మాట్లాడుతుంటే వారు అలా మాట్లాడుతూ ఉండేలా విను ....

నీవే కనుక మాట్లాడుతుంటే వినేవాళ్ళు అలా వింటూ ఉండేలా మాట్లాడు .....

శుభరాత్రి మిత్రమా !!!

అనుకున్న గమ్యం



మీరు అనుకున్న గమ్యానికి చేరలేకపోవచ్చు కాని మీరు వెళ్ళాల్సిన గమ్యానికి మాత్రం తప్పకుండా చేరతారు

శుభోదయం మిత్రమా !!!

ఏమికావాలో కోరుకో


నీకు ఏమికావాలో వాటి కొరకు " ప్రార్థన " చేయి ....

నీకు ఏమి అవసరమో వాటి కొరకు " పని "చేయి .....

కాని మిత్రమా ....


నీ దగ్గర ఉన్న వాటితోనే "పండగ" చేయి ......

శుభరాత్రి మిత్రమా !!!

నిన్నటి నుంచి దిగుమతి


ముడి సరకులా ఉన్న మనల్ని మనం నిన్నటి నుంచి దిగుమతి చేసుకొని ఈ రోజు "మరింత జ్ఞానం" అనే నాణ్యతను చేర్చి రేపటికి ఎగుమతి చేయాలి .

కాబట్టి మిత్రులారా ...

ఈ రోజు కూడా జ్ఞానం అనే నాణ్యతను మనకు మనంగా చేకూర్చుకోవాలని , వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూర్యుని మొదటి కిరణం సాక్షిగా ఆశిస్తూ...

శుభోదయం మిత్రమా !!!

My photo editings ......






పిట్టలా కాదు గ్రద్దలా బ్రతుకు..


పిట్ట వర్షం పడితే షెల్టర్ కొరకు చూస్తుంది... కాని గ్రద్ద మాత్రం మబ్బుల మీదుగా ఎగిరి అసలు తనపై వర్షమే పడకుండా చూసుకుంటుంది ...

సమస్యలు కూడా వర్షం లాంటివే...

కాబట్టి మిత్రమా ...


పిట్టలా కాదు గ్రద్దలా బ్రతుకు...

My hindi Sher/shayari




















సూర్యాస్తమయాలు

OCTOBER 2 , 2012

నేటి బాలలే రేపటి పౌరులు



భారత దేశం పల్లెల్లో ప్రాణాలు పెట్టుకొని జీవిస్తుంది అని మహాత్మా గాంధిజీ అన్నారు ...

నేటి బాలలే రేపటి పౌరులు ...
రేపటి పౌరులే మున్ముందు దేశాన్నేలే నేతలు .!!!

పల్లెల్లోని బాలలు తమ బాల్యాన్ని నష్టపోకుండా ఉండేటట్లు ప్రయత్నం చేద్దాం !

కోపగించే హక్కు

కలలోని కృష్ణ పరమాత్మ

సాయం

నచ్చిన పని

గొంతెమ్మ కోరికలు

రంగుల రాట్నం

Tuesday, 2 October 2012

ఎవరా నలుగురు ...??


నలుగురు నవ్వుతారు ......నలుగురు ఏమనుకొంటారు ......

నలుగురితో నారాయణ అని అనాలి .....నలుగురు వింటారు ........

నలుగురితో నడువు .....నలుగురికి మేలు చేయి ....

ఈ నలుగురి గురించి నలువైపులా విని విని విసుగు చెంది........
ఆ నలుగురు ఎక్కడున్నారో అని నాలుగు దిక్కులు వెదికాను.....
చివరకు కాట్లో తెలిసినది ఆ నలుగురు ఎవరో కాదు మనలను కాటికి మోసుకొని వేల్లెవాల్లని ... —