ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.
ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. ఈ క్షేత్రములో లక్ష్మీ నృసింహుడితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.
పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.
గంపలవాడ
గంపలవాడ ధర్మపురిలోని ఒక వాడ, ఈ వాడ దేవాలయ సమూహానికి దగ్గరగా ఉండును. గంపలవాడకు ఈ పేరెలా వచ్చిందంటే 1970వ దశకంలో తెనుగు వారు (పళ్ళు అమ్మేవారు) ఇక్కడ ఎక్కువగా నివసించేవారు, వీరు గంపలలో పండ్లను తీసుకెళ్ళేవారు, గంప అనగా వెదురుతో చేసిన బుట్ట. మరియు కుమ్మరి వాళ్ళు కూడ మట్టి పాత్రలను ఇదే విధంగా తీసుకెళ్ళేవారు. అందుకనే గంపలవాడ అనే పేరు వచ్చింది. గంపలవాడను అంతకముందు మఠంగడ్డ అనేవారు. ఎందుకంటే పూర్వము ఋషులు, మునులు, ఈగడ్డ పైననే తపస్సు, పూజలు, చేసారని ప్రతీతి. ఇప్పటికి అదే కోవలో శ్రీశ్రీశ్రీ సచ్ఛిదానంద సరస్వతి స్వామివారు మఠంగడ్డ పరిసర ప్రాంతంలోనే శ్రీ మఠం స్తాపించారు, గంపలవాడలో ముఖ్యంగా చీర్ల వంశీయులు నివసిస్తున్నారు.
ధర్మపురి క్షేత్రం లోని గోదావరి తీరాన బ్రహ్మకుండం, బ్రహ్మ పుష్కరిణి వంటి కుండా లున్నాయి. అవే గాకుండా సత్యవతీ కుండం, యమకుండం, చింతామణి సరోవరం, వరా హతీర్థం, రాజతీర్థమనే కుండాలున్నాయి. వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెబు తారు. ధర్మపురి ఈశాన్యభా గంలో గౌతమ మహర్షి తపస్సు చేసి శివలింగ ప్రతిష్ట చేశాడట. ఈ ఆలయం ప్రస్తుతం గౌతమేశ్వ రాలయంగా ప్రసిద్ధి చెందింది. భద్రానది గోదా వరిలో సంగమం చెందుతున్న చోట, రమణీ య ప్రకృతి సోయగాల మధ్య విరాజిల్లుతున్న ఆలయద్వారబంధంపై పద్మాస్థితయైన లక్ష్మీ దేవిని రెండుపక్కలా ఏనుగులు అభి షేకిస్తున్న శిల్పం ఇప్పటికీ చెక్కు చెద రకుండా ఉంది.
ఇక్కడ దత్తాత్రేయ మహర్షి ఆశ్ర మం స్థాపించి విదర్భ రాజుకు జ్ఞాన బోధ చేశాడట. ఈ ఆశ్రమ ప్రాంతం లోనే బలవర్మ రాజు కుమారుడైన ధ ర్మవర్మ తపస్సు చేసి నరసింహస్వా మిని సేవించి, తన పేరున ఊరిని ధర్మపురిగా మార్చాడని చెబుతారు. ధర్మపురి క్షేత్రంలో ఆలయాంతర్భాగంలో రెండు నృసింహ మందిరాలున్నాయి. ఒక ఆర్చామూర్తి శిలామూర్తిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగనరసింహస్వా మి (పాత నరసింహస్వామి) ప్రధాన ఆలయం కాగా, వేరొక మూర్తి దారు (కట్టె)తో చేయబడి న మూర్తి. మహ్మదీయుల దండయాత్రల సమ యంలో శిలావిగ్రహాన్ని దాచి కట్టె విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా చెబుతారు. ఇక్కడ శ్రీవేం టేశ్వర స్వామి, శ్రీరామలింగేశ్వర స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలు ఉపా లయాలుగా ఉన్నాయి.
బ్రహ్మ తపస్సు ఫలితంగా స్వామి ఇక్కడ నివసిస్తున్నాడనేందుకు ప్రతీకగా పాత నరసిం హస్వామి ఆలయంలోని ముఖమండపంలో బ్రహ్మదేవుడి విగ్రహం ప్రతిష్టించబడింది. య ముడు కూడా ఇక్కడి పుష్కరిణిలో స్నానమాడి న తరువాత పాపాల నుంచి విముక్తుడయ్యా డని తెలిపేందుకు పాత నరసింహస్వామి ఆల య ప్రవేశద్వారం వద్ద యముని విగ్రహం కూడా ప్రతిష్టించబడింది.ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో స్వా మి వారికి ఏటా ఫాల్గున శుద్ధ ఏకాదశి మొద లు బహుళ షష్ఠి వరకు 13 రోజులు బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగుతాయి.
రైలు మార్గంలో వచ్చే వారు హైదరాబాద్- చెనై్న-ఢిల్లీ మార్గంలో మంచిర్యాల రైల్వేస్టేషన్ లో దిగి రోడ్డు మార్గంలో ధర్మపురి చేరుకోవ చ్చు. రోడ్డు మార్గంలో వచ్చే వారు మొదట (హైదరాబాద్ నుంచి) కరీంనగర్ చేరుకొని, అక్కడి నుంచి జగిత్యాల, అక్కడి నుంచి ధర్మపురి చేరుకోవచ్చు.

No comments:
Post a Comment