Wednesday, 20 June 2012

బాలిక భావనల వెల్లువ


తను ఉంటున్న బాలికల శరణాలయం నుంచి దత్తతగా తెచ్చుకొన్న అమ్మతో , తనను శరణాలయం నుంచి వేరు చేసిందనే ఒక అపార్థం చేసున్న బాలిక తరువాత నిజాన్ని తెలుసుకొని తన మనసులోకి తెచ్చుకొన్న భావనలే ఇవి ... నీ చిరునవ్వుల చిరు జల్లు నను కడిగేసిందిగా......
ఇక క్షమాపణల వారధి ఎందుకు అమ్మ మన మధ్య !!!

నువు పలికిన చిన్న తల్లి అన్న నాపేరు....
చెప్పేసింది నీ మనసులో నా స్తానాన్ని....
చెరిపేసింది నీపై ఉన్న ఇన్నాళ్ళ కోపాన్ని!!!!!

అది కోపం కాదు... అలుక.....
నువు బ్రతిమాలుతుంటే బాగుంటుంది మరి !!!!

నా కోసం నువు పడే ఆరాటం చూస్తుంటే ..ఆనందంగా వుంది
నా కోసం ఒకరున్నారని గొప్పగా చెప్పాలనిపిస్తుంది....!!!!!!

No comments:

Post a Comment