Total Pageviews

Wednesday 20 June 2012

ఒక వృద్దురాలి ఆవేదన



వృద్ధ ఆశ్రమములోని ఒక వృద్దురాలి ఆవేదన ;;;

తల తాకట్టు పెట్టి చదివించి సమాజానికి ఉపయోగ పడేలా పిల్లలను చదివించినాము....రెక్కలు వచ్చిన పిల్లల్లు ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోయారు ...

ముసలాయన బతికున్నప్పుడు వుండేది విలువ ..... కాని ఇప్పుడు నన్ను చూసేవాల్లె లేరు ...నా మాట వినేవాల్లె లేరు. అసలు నా ప్రాణానికి విలువే లేదు .
నాయకులోస్తారు నా దగ్గరికి వోట్లు అడగడానికి ... అడిగిన వారందరికీ ఓట్లు వేస్తున్నాను ...
అప్పుడప్పుడు ...పండగలప్పుడు కొంత మంది దయాత్ములు తినుబండారాలు తెస్తారు ... అన్ని తింటాను ...
కాని ఒక్క చేదు రుచి తప్ప నాకు మిగతా రుచులను గుర్తించే శక్తే పోయింది .....

ఎందుకంటే

కలిసిరాని కాలానికి తెలుసు . . . .గ్రహపాటేమంటుందో
వెనక్కి పిలవని పాపాని కి తెలుసు . . . పొరపాటేమంటుందో
కూరుకు పోయిన గొంతుకి తెలుసు . . . తడబాటేమంటుందో
విడిపోయే మనసుకి తెలుసు . . . .ఎడబాటేమంటుందో .

కనీసం ఈ సంవత్సరమైన నాకు పరలోకానికి వెళ్లేందుకు వీసా వస్తుందో ..???

No comments:

Post a Comment