Total Pageviews

Monday 28 May 2012

నా ప్రశ్నలు

 
కోడి కూసింది ...ఉదయాన్నే తెలుగు పేపర్ వచ్చింది ......
ఈ రోజు నిన్నటి రోజు నుంచి మనుషులందరినీ దిగుమతి చేసుకుంది ....

అందరికీ ఏమీ చెప్పకుండానే పనులు చేయిస్తున్నది .......
కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాను ...
న్యూస్ చదువుతున్న నాకు అన్ని ప్రశ్నలే కనబడుతున్నాయి ...
న్యూస్ లో సందేహాల మధ్యనే కరుగుతున్న జీవితాలు......

కాని నా ప్రశ్నలన్నీ అమాయకమైనవే ......జవాబులే దిక్కుతోచని స్తితిలో ఉన్నాయ్...

షట్టర్లుగా తెరుచుకుంటున్న రోజుల్లోకి దిగుమతవుతున్న మనిషి,
బళ్లమీద, టీకొట్టుల మీద, వర్కు షాపుల్లో, రోడ్ల మీద, పొలాల్లో
మనిషిని చీత్కరిస్తున్న ఈ సందిగ్ధకాల మెక్కడిది?

గొంతు స్వేచ్చగా పెగల్చనీయని మతప్రమేయాలు, భూమిని సరిహద్దుల మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేసిన రాజ్యాలు, గాలి పీల్చినంత సులభంగా చంపగాలిగే క్రౌర్యం.. చుట్టూ అల్లుకుంటున్న ఈ యంత్రపుగూడు ఎక్కడిది?

మిత్రులారా ...

ఈ కాలానికి చిరునామా లేదు........
ఇది ప్రశ్నల్లోంచి ప్రశ్నల్లోకే పయనిస్తున్నది.......

No comments:

Post a Comment