Total Pageviews

41,924

Tuesday, 5 June 2012

"బండెనక బండి గట్టి పదహారు బండ్లు కట్టి ఎ బండిలో పోతవ్ కొడుకో ".............
అని పాట పాడాలనిపిస్తుంది ఈ ఫోటో చూసిన వారెవరికైనా .

పాట సంగతి అటుంచి ...

పూర్వకాలంలో రవాణా సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదు కాబట్టి. ఇదిగో ఇలా , ఏ పుణ్య క్షేత్రం వెళ్ళాలన్న ఊరు మొత్తం కలిసి బండిలో వరుస కట్టి వెళ్ళేవారు. అక్కడక్కడ మజిలీలు చేస్తూ , చెట్టు నీడన వంటలు వండుతూ దాదాపు వారం పదిరోజులు ప్రయాణించి గుళ్ళు, గోపురాలు దర్శించుకోనేవారు .....

కాని ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి ... దేవుడి దర్శనానికి కూడా తత్కాల్ express facility ..
పూర్వ కాలాన్ని తలుచు కోవాలంటే ఇలాంటి ఫోటోలు ,టీవీ లో డాక్యు మెంటరీలు చూడడమే తప్ప వేరే దారి లేదు...

ఎంతో దూరం ప్రయాణించి ఉదయాన్నే ఇలాంటి గుళ్ళు చేరుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది.

ప్రొద్దునే సుప్రభాత పాటలతో దైవదర్శనం ... ప్రయాణ బడలిక మాయం...

1 comment:

  1. స్వర్గానికి దారితెలియక
    తికమక పడుతున్న వేళ !!
    పుష్ప సోఫానాలమర్చి ..
    కవన శృజనకై ..
    ఆహ్హానిస్తున్న ..మీకు..
    అక్షరాభివందనాలు.!!!

    ReplyDelete