Total Pageviews

Wednesday, 20 June 2012

తీయని జ్ఙాపకం!!!

అందమైన ప్రకృతిని చూస్తె కమ్మని గతమే గుర్తొస్తుంది కొందరికి !!!

అందులో అనుభవాలనే శిఖరాలనుండి పొంగుకొస్తున్న సన్నని జలపాతమే

ఉండుండీ ఉరికొచ్చే గతం తాలూకు తీయని జ్ఙాపకం!!!

స్వేఛ్చ

Though I gave freedom to you to express your opinion

It doesn't mean that

I need to agree with your opinion.......!!!!!!
******************************************
నా విషయములో నీవు నీ అభిప్రాయము చెప్పటానికి నేను నీకు స్వేఛ్చ ఇచ్చినంత మాత్రాన ,

నేను నీ అభిప్రాయానితో ఎకీభవిస్తానని అనుకోవద్దు మిత్రమా !!!!

సినిమా

సినిమా:::::

వాతావరణం ప్రశాంతంగా ఉంటె దారి వెంట నడక మొదలెట్టా !!!

పువ్వుపువ్వునీ ముచ్చటగా పలకరిస్తూ, నాట్యం చేసె సీతాకోకచిలకలూ .....

ఆ చెట్టుకు ఈ చెట్టుకు వంతెన వేస్తూ ఘుమ్మని రాగాలు తీస్తూ తిరిగే గండుతుమ్మెదలూ .....

అపుడపుడూ నిర్భయంగా పరిగెత్తుకొచ్చి ఏదోటి దక్కించుకున్నాక పారిపోయేపిట్టలూ ......

నాకు చూపించాయి ఓ అద్భుతమైన సినిమా,ఆహ్లాదకరమైన సినిమా !!!


 

Tree House


Want to build a Tree House ..?? Don't worry it comes with Instructions......

But

Don't worry if you make mistakes while building your career ..
Because Life don't come with instructions.....

భాషరాని మనసు

భాషరాని మనసు మూగదయినప్పుడు...

ఇహ కనులే చొరవ తీసుకొని అన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పాలి ...!!!!


When the Heart becomes dumb

Then

The Eyes should take initiative to answer all the questions !!!

Time to leave.......

When the main person who made you smile

Becomes

The main reason for all your tears....

Then it is time for you to leave.......

 

అందమైన ప్రకృతి

ప్రేమ, వాత్సల్యం....అభిమానం, అనురాగం.....

ఆప్యాయతా ,ఆత్మీయతా......కరుణా ,దయ....

వంటి ఆభరణాలు కూర్చుకుని ఉన్న ప్రతీ ఒక్క మనిషి అందరి కళ్ళకు

అందమైన ప్రకృతిలా కనబడతారు !!!

గుండె గుడి

నిర్మలమైన మనస్సుమాలతో అలంకరించబడుతూ,

నిశ్చలమైన బుధ్ది జ్యోతితో దర్శించబడుతూ,

నిశ్శబ్దమైన హృదయ గానంతో కీర్తించబడుతూ

నిజమైన భక్తుని గుండె గుడిలోనే స్వామి ప్రశాంతంగా ఉండేది !!!

Your Message !!!

Your way is your message to the whole world....

Make sure it is inspiring !!!!


 

తెలివి

తెలివంటే నాదే కదా! అని మురిసిపోతుంటాము గానీ.....

'అది నీ సొత్తేం కాదు' అని , మనకు గుర్తుచేసినట్లుంది...

ఎదుటివారి తెలివికి ప్రకటితమైనప్పుడల్లా........

గొప్పింటి గుమ్మ-గుడిసెలోని అమ్మ

పట్టుచీరకై అలిగెను గొప్పింటి గుమ్మ .....

పట్టెడన్నంకోసం నలిగెను గుడిసెలోని అమ్మ .....

Friendship

If friendship is your WEAKEST point......

THEN

You are the STRONGEST person in the world.....

Kabhi kabhi

Kabhi kabhi Udaas rehta hun par unse naaraaz nahin....

Woh Dil mein toh hey par mere paas nahin.....

Jhooth kahun toh sab kuch hey mere paas....

"AUR"

Sach kahun toh unke siwa kuch bhi nahin mere pass....!!!

Philosophy


Philosophy Sharing Time:::
********************

When a Bird is alive ..... it eats Ants..,

When the bird is dead....Ants eats the Bird..!!

Circumstances can change at anytime....,

You may be Powerful today....

But remember Time is more Powerful than You..!!

So Be good And Do Good !!!!

సమాజ సేవ


 

సమాజ సేవ చేయాలనుకుంటున్నారా ......???

సభలూ సదస్సులూ,ప్రసంగాలూ ప్రబోధాలూ

ఎన్నిచేసి ఏంలాభం?కొయ్యగుఱ్రపు స్వారీ!

ఇంచైనా కదలని ఆశయం !!!!!

ఎక్కండి అసలైన అశ్వాన్ని,దూసుకెళ్లండి సమస్యల వనంలోకి

వెతికిపట్టండి పరిష్కార ఫలాల్ని !!!!

Opportunities


చూపులకు చెరువంతా నీరు ఉన్నా ......నీకు దొరికేది మాత్రము దోసింత .....

అవకాశాలు నీ చుట్టూ కనబడుతున్న .....నీకు దొరికేవి కావలసినవి మాత్రమే ...

Though you can see river full of water ,you can get only the amount that you can hold....

Though you see number of opportunities around, you can grab only few...

కనుపాప ...


కన్ను తెరిస్తే జననం ...కన్ను మూస్తే మరణం .....

రెప్పపాటు కాలమే ఈ జీవితం ....

------------బుద్ధ భగవానుడు

Journey

Don't be afraid of going slowly...............

Be afraid only of standing still.

Life is not a race...... it is a pleasant journey......

అందమైన శిల్పం...



అందమైన నగ తయారు చేయాలంటే బంగారాన్ని వేడి చేయాల్సి వస్తుంది .....

రాగి తీగని చేయాలంటే రాగిని సుత్తితో కొట్టాల్సి వస్తుంది .....

బండ రాయిని చేక్కితేనే అందమైన శిల్పంగా మారుతుంది .....

కాబట్టి మిత్రులారా ...

జీవితం ఎన్ని బాధలు ,ఒడిదుడుకులు ఇస్తే అంత ఉన్నతంగా ఉంటారు ,మంచి మనిషిగా మారతారు ....

ఒక్కసారి చరిత్ర పుటలను తిరగ వేయండి ....

ఉన్నత వ్యక్తులుగా గుర్తించబడ్డ వారి జీవితాలు ముందు రాళ్ళు ,రప్పల వెంట నడచినవే ....

అందుకే అంటారేమో ""Each Successful Story Has A Painful Beginning"" అని ...

అంతుచిక్కని అద్భుతాలు!!!


విశాల వినీల ఆకాశం .....

గంభీరాకార మహాసాగరం ....

ఠంచనుగా వచ్చెళ్లిపోయే సూర్యచంద్రులూ ......

నిధులెన్నో దాచుకున్న నేలా .....

లేకుంటే ఏంటన్నది ఊహించలేని నిప్పూ ,నీరూ, ఉప్పూ .....

అన్నాదులను పండిచి ఇచ్చే మట్టీ ....

ప్రవహించే నీరూ పడిలేచే కెరటం ....

కదిలే మేఘం కురిసే వర్షం .....

అగుపిస్తూ ఉన్నా ...అంతుచిక్కని అద్భుతాలు !!!!!!!!!!!!!!

Changes

Weather changes according to season

and only few like those changes .....................

People are like weather and they change with time.

So don't worry if few people don't like you.........


అబ్బురాలు!!!

మౌనంగా పెరిగే మొక్కా...

ముచ్చటగా వికసించే పువ్వూ....

వెలుగుతూ ఎగిరే మిణుగురూ....

గుంభనంగా గూడు కట్టే పక్షీ...

మట్టిముద్ద దొర్లించుకెళ్లే పురుగూ...

పలికే చిలకా ...పాడే కోయిలా...

పండే చేనూ.... పండ్లిచ్చే చెట్టూ...

అనునిత్యం గోచరించు అబ్బురాలు !!!!!

The Road to success

The Road to success is

always either a CONFUSION or UNDER CONSTRUCTION....

You yourself is a good vehicle and driver.

If you have

A spare called DETERMINATION...

An engine called PERSEVERANCE.....

An Insurance called FAITH......

Then

You will make it!!!!

 

ఆశయం..

ఆశయం ఆకాశమంత , సాధన సాగరమంత ఉండి.......

చుక్కలను లక్ష్యం చేసుకొన్నప్పుడే .... నీవు చంద్రుని చేరుకోగలవు !!!

Negativity

Entire water of sea can't sink a ship...Unless it gets inside the ship

Similarly

Negativity of world can't put you down.... Unless you allow it to get

inside you.

ఓ నా గమ్యమా.....

ఓ నా గమ్యమా..........

తీరంలో నిలబడిన నీవు కనపడుతూనే ఉన్నావు...........

పయనం నీవైపే అయినా ఎందుకో..ఈదినకొద్దీ పెరుగుతోంది దూరం !

ఈదిఈది అలసిన మనసు ఆలోచనలో పడింది...

కారణమేమయి ఉంటుందని...??

స్థిమితపడి చూస్తే తెలిసొచ్చింది అత్యాశ కారణమని...ఉన్నదానితో సరిపుచ్చుకొమ్మని !!!!!

స్నేహం

అలలు లేని కడలికి కళ లేదు.......

పరిమళము లేని పువ్వుకు చోటు లేదు .....

వెలుగు లేని సుర్యునికి విలువ లేదు....

అందం లేని పున్నమికి ఆకర్షణ లేదు.....

స్నేహం లేని జీవితానికి అర్దం అసలే లేదు......

Better Future

Pain makes you stronger......

Tears makes you braver.......

Heartbreak makes you wiser......

So thank the past for a better future......


 

Only Friend

Making too many friends in this world is not a MIRACLE...

The miracle is to make

An ONLY FRIEND who will stand by you when whole world against you....

Life


Life is a DREAM for the WISE ...

Life is a GAME for the FOOL...

Life is a COMEDY for the RICH....

Life is a TRAGEDY for the POOR....

moment

If you got HAPPY moments then PRAISE GOD.....

If you got Difficult moments then SEEK GOD......

If you got QUIET moments then WORSHIP GOD....

If you got SAD moments then TRUST GOD ......

BUT Every moment THANK TO GOD as you are still alive....

Because

"This moment you are breathing but in this same moment

someone is taking their last breath somewhere else in this world."

ఎవరా నలుగురు..?


నలుగురు నవ్వుతారు ......నలుగురు ఏమనుకొంటారు ......

నలుగురితో నారాయణ అని అనాలి .....నలుగురు వింటారు ........

నలుగురితో నడువు .....నలుగురికి మేలు చేయి ....

ఈ నలుగురి గురించి నలువైపులా విని విని విసుగు చెంది........

ఆ నలుగురు ఎక్కడున్నారో అని నాలుగు దిక్కులు వెదికాను.....

చివరకు కాట్లో తెలిసినది ఆ నలుగురు ఎవరో కాదు మనలను కాటికి మోసుకొని వేల్లెవాల్లని ...

అపరిచితులమే

నీవు నాకు కనిపించక ముందు నాకు నీవెవరివో..

నేను నీకు కనిపించినతరువాత నీకు నేనెవరినో ...

ఆలోచించిన తరువాత తెలిసినది ....

మనము ఒకరికొకరు అపరిచితులమే అని !!!!

ఆశ

 

జీవితంలో పెద్దవి, చిన్నవి ఆశలనేకం.

అందులో తీరినవీ, తీరనివీ, తీరాలని ఆశపడేవీ కొన్ని అయితే.....

మరో జన్మలోనైనా తీరితే చాలు అని ఆరాట పడేవీ మరి కొన్ని ...

ఇలా ఎన్నెన్నో ఆశలతో జీవితం సాగిపొతుంది.

అందులో కొన్ని దగ్గరే ఉన్నా వాటిని గుర్తించక

అవి పోయాక వాటి కోసం తపన పడుతూ,

కాలం ఒక్క సారి వెనక్కెళితే మళ్ళీ వాటిని తనివితీరా ఆశ్వాదించాలని ఆరాటపడే క్షణాలు ప్రతి ఒక్కరి

జీవితంలో కొన్నైనా తప్పదు.

అలా ఆరాటాలుగా మిగిలిపోయేవే అడియాశలైన "చిన్ని ఆశ"లు

నీలోకి నీ పయనం

ఆకాశం నుండి చూస్తే గాని భూమి తిరగదు !!

విత్తు రూపం పోతే గాని మొక్క మొలవదు !!!

ఏదీ కుదురు కాదని తెలియాలంటే ఆలోచనల్లో ఎదగాలి !!!

విజయ తీరం చేరాలంటే నీలోనికి నువ్వు నడవాలి !!!!

గెలుపు-ఓటమి

గెలిచినవాడికి తెలుసు శిఖరం ఎత్తెంతో....!!!!

ఓడినవాడికి తెలుసు అగాధం లోతెంతో....!!!

తిరిగిరాని ప్రయాణం

 


తిరిగిరాని ప్రయాణం
***************

కాలం సాగిపోతోంది....కాదు కాదు పరిగెడుతోంది.......

రైలు బండి స్పీడులో దూసుకెళుతోంది.....ఎక్కడికి ప్రయాణం? ఏమో!

గమ్యం తెలీని ప్రయాణం!!!

వెనక్కి వెళ్తున్నవేమీ మళ్లీ రావా?.....అలక్ష్యంతో అందుకోని ఆత్మీయులు

వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాల్లా....

నిర్లక్ష్యంతో వదిలేసిన బంధాలు... మళ్లీ తిరిగిరాని స్టేషన్లలా.. అనిపిస్తున్నాయి ఇప్పుడు

గమ్యం చేరాక తిరిగి ఇంకోసారి ఈ బండి వెనక్కి వెళితే బాగుణ్ణు

ఈసారి శ్రధ్ధగా.. బుధ్ధిగా..జాగ్రత్తగా..జాగరూకతగా....

ఇష్టంగా..అర్ధవంతంగా..వళ్లు దగ్గరపెట్టుకుని కళ్లింత చేసుకుని....

ప్రయాణం మళ్లీ మొదలెడతా!

కలువ-చంద్రుడు

చంద్రుడు- కలువ
-----------------
చంద్రుని చల్లని తరకల జల్లులలో జలకమాడి

వెన్నెల నురగల వెల్లువలో మునకలాడి

పరిమళించు కలువ అందిలా

"కొలవలేనంత దూరం నింగికి నేలకు మధ్య

కలవలేనంత దూరం నీకూ నాకూ మధ్య

అయినా నిను చూస్తూనే ఉన్నా, పరవశిస్తూనే ఉన్నా"


ఒక వృద్దురాలి ఆవేదన



వృద్ధ ఆశ్రమములోని ఒక వృద్దురాలి ఆవేదన ;;;

తల తాకట్టు పెట్టి చదివించి సమాజానికి ఉపయోగ పడేలా పిల్లలను చదివించినాము....రెక్కలు వచ్చిన పిల్లల్లు ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోయారు ...

ముసలాయన బతికున్నప్పుడు వుండేది విలువ ..... కాని ఇప్పుడు నన్ను చూసేవాల్లె లేరు ...నా మాట వినేవాల్లె లేరు. అసలు నా ప్రాణానికి విలువే లేదు .
నాయకులోస్తారు నా దగ్గరికి వోట్లు అడగడానికి ... అడిగిన వారందరికీ ఓట్లు వేస్తున్నాను ...
అప్పుడప్పుడు ...పండగలప్పుడు కొంత మంది దయాత్ములు తినుబండారాలు తెస్తారు ... అన్ని తింటాను ...
కాని ఒక్క చేదు రుచి తప్ప నాకు మిగతా రుచులను గుర్తించే శక్తే పోయింది .....

ఎందుకంటే

కలిసిరాని కాలానికి తెలుసు . . . .గ్రహపాటేమంటుందో
వెనక్కి పిలవని పాపాని కి తెలుసు . . . పొరపాటేమంటుందో
కూరుకు పోయిన గొంతుకి తెలుసు . . . తడబాటేమంటుందో
విడిపోయే మనసుకి తెలుసు . . . .ఎడబాటేమంటుందో .

కనీసం ఈ సంవత్సరమైన నాకు పరలోకానికి వెళ్లేందుకు వీసా వస్తుందో ..???

శుభోదయం

చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోని ఎక్కండి....

శుభోదయం మిత్రమా !!!

రహదారి


 
ఇది ఒక రహదారి ...నీవే నడవాలి ఈ దారిలో ....

ఎవరైనా నీతో పాటు ఇదే దారిలో నడుస్తుండవచ్చు ....

కాని ఎవరూ నీ కొరకు నడవరు .......

ఇక రహదారిలో నడక మొదలెట్టి వెళ్ళాల్సిన స్తానానికి వేడతారో...

లేక అసలు నడకనే మొదలు పెట్టారో మీ ఇష్టం ....

పల్లెటూరి ప్రజలం


మేమంతా అమాయక పల్లెటూరి ప్రజలం ...ప్రక్రుతి తోటే మా కూని రాగాలు ...

చల్లని గాలిలో స్నేహితులమంతా ముచ్చటిస్తాము......

అలుపు తీర్చే ఈ చిరు గాలి సుడిగాలైతే చిగురుటాకులా వణికి పోతాము .....

కానీ..

ఈ సుడిగాలి జడివాన కురిపిస్తే ఆ ధారల్లో తడిసి మురిసిపోతాము గానీ ఎండుటాకులా దూరంగా ఎగిరిపోము ........

విజయము -గాలిపటం

 

విజయము అనేది ఒక గాలిపటం వంటిది .. కష్టము అనేది దారం వంటిది . విమర్శలనేవి ఎదురుగాలి వంటివి.

నీవు దారము కట్టి గాలిపటాన్ని ఎగురవేస్తే ఎదురుగాలిలో ఎగురుతుంది లేకపోతె నేలపైనే చతికిలబడుతుంది...
ఆ గాలిపటము నీ దగ్గర ఎంత దారం ఉంటె అంత పైవరకు మాత్రమె వెళ్ళగలదు ..
నీ దగ్గర ఎంతో దారం ఉన్నా ఎదురుగాలి లేకపోతె ఎగరదు ...

కాబట్టి మిత్రులారా ...

విమర్శలను తప్పుగా తీసుకోకండి .శ్రమించండి ... విమర్శలు ఎప్పుడు కూడా మీ విజయానికి తోడ్పడతాయని గుర్తుంచుకోండి ...

వర్షం కురిస్తే ....



వర్షం కురిస్తే ....

వాన వాన వల్లప్ప అని సంతోషముతో ఆడుకొనే బాల్యం ......

వాన వానా వెల్లువాయే అని డాన్సు చేసే యువతా ....

ఆవో ఝూమే గాయే ..... అని సంతోషముతో చిందులు వేసే రైతన్నా ....

నాట్యం చేసే నెమలి ....

ఇలా పశు ,పక్షాదులను , మనుషుల మనసులను ప్రక్షాళన చేసి

ఆనందింపచేసే ఈ వానకి చలించని దున్నలా ఉన్న ఈ సమాజాన్ని

, నేటి రాజకీయ నాయకుల మనసులను కూడా ప్రక్షాళన చేసే శక్తి ఉంటె ఎంత బాగుండునో .......

Friends

 
రాలిన పూలని దారిలోనే వదిలేయాలి.....
పరిమళాల్ని మాత్రం తోడుగా తీసుకెళ్లాలి......

పలకరించే వానినందరినీ పరిహరించుకోవాలి ......
స్నేహితులని మాత్రం కలకాలం నిలుపుకోవాలి!!!!

బస్సు ప్రయాణం

ఒకప్పుడు బస్సు ప్రయాణం అంటే స్వర్గానికి నిచ్చెన వేసి నిచ్చెన ఎక్కుతున్నట్లుగా ఉండేది ...

పక్కన కూర్చున్న అపరిచితురాలైన అమ్మమ్మ తను తెచ్చుకొన్న చింతకాయ పచ్చడి , రొట్టెలలో రుచి చూడమంటూ కొంత ఇచ్చి తను మిగిలినది తిని ,తన గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చు కొంటుంటే ఎంతో ఆనందంగా ఉండేది ....
కిటికీలోంచి చూస్తుంటే కనబడే డే to డే సందర్భాలే ఒక సహజ సినిమా చూసినంత సంతోషాన్ని కలిగించేవి .....

ఇక బస్సు అరఘంట ఆగుతుంది టీ తాగేవాళ్లు టిఫిన్ చేసే వాళ్ళు తాగచ్చు తినచ్చు అని కండెక్టర్ అరిస్తే వెంటనే బటానీలవాడు , మిరపకాయ బజ్జీలు ,వడలు అమ్మేవారు బస్సు లోకి ప్రత్యక్షం అయ్యేవారు ...

ఇక అప్పటికల్ల సుపరిచితమైన అమ్మమ్మ తో ఈ వన్ని కొని షేర్ చేసే చిన్న చిన్న సంతోషాలు ఉండేవి ..

కాని ఇప్పుడో......

పక్క వాళ్ళతో మాట్లాడే చాన్సే లేదు.. ఎవరికీ వారు mp3 ప్లేయర్ లేక ఐపాడ్ ,లేక laptop లో తలదూర్చి తమకు తామే ఎంజాయ్ చేస్తున్నారు .
సొంత చుట్టాలతో కలిసి వెళ్ళినా బస్సు లో బోర్ కొడుతుందని ఈవన్ని తెచ్చుకొనే రోజులు వచ్చేసాయి.

ఇక ఏమి చేస్తాం ...??? గతం తాలూకు జ్ఞాపకాలను అడపా దడపా పండక్కి చేసిన అప్పడాలను నేమరువేసుకోన్నట్టుగా నేమరువేయాల్సిందే through ఈ networks ద్వారా ...!!!

బాలలం మేమొక్కటే


ఎల్లలెరుగని వాళ్లము ....కల్లలెరుగని వాళ్లము ...
బాలలం మేమొక్కటే ....లోకమూ మాకొక్కటే .....

అన్నం పప్పు చారూ కూరా శాఖాహారం తినువారైతే
గుడ్డు చేప కోడీ కూరా మాంసాహారం తినువారైతే ...

తిండేదైనా , తీరెదైనా తినగోరే ఆ రుచులేవైనా ......
బాలలం మేమొక్కటే ....లోకమూ మాకొక్కటే .....!!!!!!!!

( నా గతంలో ఎప్పుడో నేను పాడిన పాట)


తప్పును సరిదిద్దు

వేరే దారి లేక క్షణం క్షణం మరణించే కంటే ఒకేసారి వచ్చే మరణం మిన్న .......

దిశ తెలియక పిలవని అతిధిగా వెళ్ళటం కంటే ,దిశ తెలిసన సొంత గృహానికి వెళ్ళడం మిన్న ...

రెండు నావలలో ప్రయాణించి ఏదో క్షణంలో నీట మునిగేకన్న ...
ఒకే ఒక నావలో ప్రయాణించి తీరం చేరడం మిన్న ......

మిత్రులారా .....

దీన్నే అంటారు తప్పును సరిదిద్దుకొని .. జీవితాన్ని సవరించడమని .....

క్షణం

ఒకసారి అక్బర్ బీర్బల్ తో అన్నాడట ......

బీర్బల్ ఏదైనా ఒక మాట రాయవయ్య .... ఆ మాటతో దుఃఖంలో ఉన్నవాడు సంతోషంగా ,

సంతోషముతో ఉన్నవాడు దుఃఖంగా ఉంటాడు అని......

అప్పుడు బీర్బల్ " ఈ క్షణం గడచిపోయింది " అని రాసాడట .....

అప్పుడు సంతోషంగా ఉన్నవాడు అయ్యో అప్పుడే నా సంతోషకరమైన సమయంలో ఒక క్షణం అయిపోయిందా అని బాధపడితే ....

హమ్మయ్య నా బాధలో ఒక క్షణం తగ్గింది అని సంతోషపడ్డాదట బాధలో ఉన్నవాడు ....

కాబట్టి మిత్రులారా .......

ప్రతి క్షణం విలువైనది ... ఎంత సంతోషముగా ఉంటె అంత మంచిది ....

ఒక వ్యాపారి ఆవేదన






వరదలొచ్చి ఉన్న కొబ్బరిచేట్లన్ని కొట్టుకొని పోయాయి.
మిగిలిన నలుగురు స్నేహితులతో , ఉన్న ఎనిమిది కొబ్బరికాయలతో ఊరు వదిలి వెళ్ళే పరిస్తితులోచ్చాయి ..

బాధతో గోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా భావాల రూపం లో
గుండె లోనే బంధించేస్తూ ఇంకా ఎంత కాలమిలా..?

మనసుకి స్నేహం మత్తు నిచ్చి,నిద్రపుచ్చుతూ,మాటలకు మౌనం భాషనేర్పి
నవ్వుకుంటూ ఇంకా ఎంతకాలమిలా..?

ఆగని కాలంకేసి భారంగా చూస్తూ,భారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూ
చూస్తూ..చూస్తూ..కొబ్బరి కాయల బిజినెస్ దూరం చేసుకుంటూ
ఇంకా ఎంత కాలమిలా..?

నా ప్రశ్నలకు బదులేది ...??? ఇంకో బిజినెస్ చేద్దామంటే మోదలేది....???