కాలేజీ లైఫ్ చివరి రోజు ఎక్కడివాళ్లు అక్కడ అందరికి వీడుకోలు చెప్పి తమ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు ...
నాకు హాయ్ చెప్పడం ఇష్టం కాని bye చెప్పడం కాదు.. కాని ఈ రోజు ఏకంగా కాలేజీ జీవితానికి good bye చెప్పాల్సిన రోజు ...
అప్పటి వరకు బాధ అంటే తెలీదు.అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప.....
కన్నీళ్ళు అంటే తెలీదు. నవ్వి నవ్వి కనులు నిండడం తప్ప.......
కష్టాలంటే తెలీదు.నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప....
విడిపోవడం అంటే తెలీదు. కలసి స్నేహితులతో నడవడం తప్ప......
మౌనంగ వుండడం తెలీదు.సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప......
మరి ఈరోజేమిటి..?
నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి......
అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో భాషగా మారిపోతున్నాయి.....
మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి..........
వీడుకోలు చెప్పడం అంత కష్టమా?అరే...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి..మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?
కాని వీడ్కోలు చెప్పడం తప్పదు..
ఎందుకంటే మిత్రులారా .....
The show must go on . And new game ahead కాబట్టి .
so ఈ రోజుకి గుడ్ bye చెప్పి రేపటి ఉదయం కొరకు వేచి చూద్దాం ..
No comments:
Post a Comment