Total Pageviews

Tuesday, 5 June 2012

మా స్నేహం

పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం....
ఎగుడు దిగుడు రహదారుల్లో అలుపు లేకుండా సాగిన పయనం....

పిల్లకాలువలో ప్రతిబింబాలు చూస్తూ...
గట్టు మీది గడ్డి పూలు కోస్తూ మైమరచిన క్షణాలు......
అపార్ధాలు,అలుకలతో మూతి ముడుచుకున్న వైనాలు....

బుజ్జగింపులు,రాయబారాలు.......
వెనువెంటనే నవ్వులు,పువ్వులు...గంటలతరబడి కబుర్లు.....

ఒక మనసు బాధపడితే చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో.....
ఒక పాదం తడబడితే ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో .....

 

No comments:

Post a Comment