మనుమడికి ఎన్నో నీతి కథలు చెప్పి ఒక మంచి మనిషిగా తీర్చిదిద్ది ఇతర రాష్ట్రానికి పంపాను.
ఇప్పుడు ఒక్కడినే మిగిలాను. నా అరుపులు వినడానికి ఆమె కూడా లేదు .... ఏదో తెలియని వేదన ... అనవసరంగా పిలవని పేరంటానికి వచ్చినట్టుగా వస్తున్నకన్నీరు ....
ఎందుకిలా నాకు అని ఆలోచిస్తే తెలిసింది ...
చూపుల ప్రశ్నలకి, మాటల సమాధానం లేనపుడు....
తన్నుకొస్తున్న భావాలు వెక్కిరిస్తున్నప్పుడు.....
ఎండమావి-దాహానికి 'సాయంత్రం' తోడైనపుడు .........
మజిలీ తెలీని ప్రయాణం లో చివరి దారి అంతమైనపుడు.... ....
ప్రతి ఒక్కరి కి కలిగే ఒకే ఒక భావన " నేను ఒంటరిని" !!!
yes నేను ఒంటరిని ......
ఈ నిప్పులాంటి నిజాన్ని దిగమింగుకొని నా శేష జీవితాన్ని ఈ పశు పక్షాదుల సమక్షములో గడిపేస్తాను .. అని తాతయ్య డిసైడ్ చేసాడు ..
No comments:
Post a Comment