నీటి నురుగులా నా ఆలోచనలు తీరం చేరినట్టే చేరి
పట్టుకొనే లోపే మాయమైపోతున్నాయి......
అలల ఆటకు అలుపు లేదు....
నా కలల బాటకు గమ్యం లేదు........
మనసులో ఉన్న భావాలెన్నోఏ రూపం లేకుండా అలానే గతిస్తున్నాయి......
నా అక్షరాలు అజ్ఞాతవాసం చేస్తున్నాయి ......
ఎందుకంటే మిత్రులారా ........
భావానికి రూపాన్నిచ్చే భాష మా అమ్మ తీపి పలుకులు వింటూ లిపిని మరచిపోయింది....
No comments:
Post a Comment