Total Pageviews

Wednesday, 28 September 2011

పర్యాటక, చారిత్రక వైభోగం భాగ్యనగరం

నాలుగు వందలకు పైగా చరిత్ర కలిగిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ దేశ,విదేశాల్లో పర్యాటక ప్రాంతాలున్న నగరంగా ఎంతో పేరు,ప్రఖ్యాతులు సంపాదించింది. నగరంలోని వివిధ చారిత్రక కట్టడాలు నేడు ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక ేకంద్రాలుగా ప్రత్యేక గుర్తింపును సాధించారుు. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక పటంలో హైదరాబాద్‌కు ప్రముఖ స్థానం ఉంది.నగరంలోని చార్మినార్‌, గోల్కొండ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు ప్రతిరోజు దేశ,విదేశీ పర్యాటకులతో సందడిగా కనిపిస్తుంటారు.ఈ కట్టడాలు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌ సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తారుు. ఇవన్నీ నేడు హైదరాబాద్‌ వారసత్వ సంపదగా పేరుగాంచారుు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఈ చారిత్రక కట్టడాల గురించి తెలుసుకుందామా...

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

చార్మినార్‌...
హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌షాహి రాజవంశస్థుల్లో అరుుదవ చక్రవర్తి అరుున సుల్తాన్‌ మహ్మద్‌ కులీకుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో హైదరాబాద్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది. దీంతో మహ్మద్‌ కులీకుతుబ్‌షా తన హైదరాబాద్‌ సామ్రాజ్యంలోని ప్రజలను ప్లేగు వ్యాధి బారినుంచి రక్షించేందుకు చార్మినార్‌ను నిర్మించారు.

charminarనాలుగు మినార్‌లతో నిర్మించిన అందమైన కట్టడమే చార్మినార్‌. హైదరాబాద్‌ అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది చారిత్రక చార్మినారే. క్రీ.శ.1591లో చార్మినార్‌ను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ అందమైన కట్టడం నేడు దేశంలోని ప్రముఖ చారిత్రక కట్టడంగా పేరుగాంచింది. హైదరాబాద్‌ పాతబస్తీలోని మూసీ నదికి తూర్పున ఈ కట్టడాన్ని నిర్మించారు. చార్మినార్‌కు ఉత్తరంవైపున తళుకులీనే గాజులు లభించే లాడ్‌బజార్‌ను ఏర్పాటుచేశారు. ఈ బజార్‌ ఎల్లప్పుడు దేశ,విదేశాల పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. చార్మినార్‌కు పశ్చిమం వైపున ముస్లింలకు పవిత్రమైన మక్కా మజీద్‌ను నిర్మించారు. హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌సాహి రాజవంశస్థుల్లో అయిదవ చక్రవర్తి అయిన సుల్తాన్‌ మహ్మద్‌ కులీకుతుబ్‌షా చార్మినార్‌ను నిర్మించారు. ఆ కాలంలో హైదరాబాద్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది.

దీంతో మహ్మద్‌ కులీకుతుబ్‌షా తన హైదరాబాద్‌ సామ్రాజ్యంలోని ప్రజలను ప్లేగు వ్యాధి బారినుంచి రక్షించేందుకు చార్మినార్‌ను నిర్మించారు. తాను ప్రార్థనలు జరిపే చోట మజీద్‌లాంటి చార్మినార్‌ను రూపొందించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ భారీ కట్టడానికి శంకుస్థాపన చేసేటప్పుడు కులీకుతుబ్‌షా అల్లాను ప్రార్థిస్తూ హైదరాబాద్‌ నగరం శాంతి, సౌఖ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. నీటిలో చేపల మాదిరిగా తన నగరంలో లక్షలాది ప్రజలు జీవించాలని కోరుకున్నారు. ఇక సనంవెంకట బాలయ్య ‚అనే వ్యక్తికి చార్మినార్‌ను నిర్మించే బాధ్యతలను అప్పగించారు. నాలుగు మినార్‌లతో నిర్మించిన ఈ కట్టడానికి చార్మినార్‌ను అనే పేరును పెట్టారు మహ్మద్‌ కులీకుతుబ్‌షా. ఈ అద్భుత కట్టడం ప్రపంచంలోనే అపురూప కట్టడంగా పేరొందింది.

గోల్కొండ...
గోల్కొండ కోట ప్రధానగేటు వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగాన300 అడుగుల ఎత్తునఉన్న పోర్టికో కట్టడంలో శబ్దం వినిపిస్తుంది.ప్రపంచంలోఎక్కడా లేనివిధంగాఈ కోటలోఇటువంటిఅద్భుతాన్నిచూడవచ్చు.
ఇదే గోల్కొండ కోట ప్రత్యేకత.


golcondaఅద్భుతమైన కోట గోల్కొండ. గోల్కొండ చక్రవర్తులకు రాజధాని కేంద్రంగా ఆ కాలంలో ఈ కోట విలసిల్లింది. హైదరాబాద్‌కు పశ్చిమాన 11 కి.మీ.ల దూరంలో దీన్ని నిర్మించారు. గోల్కోండ సామ్రాజ్యం 1364 నుంచి 1512 వరకు కొనసాగింది. కాకతీయ సామ్రాజ్య కాలంలోనే ఈ కోటను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 13వ శతాబ్దంలో గోల్కొండ కోటను హిందూ కాకతీయ రాజులు నిర్మించారు. మొగల్‌ సామ్రాజ్యాధీశుల దాడుల నుంచి రక్షించుకునేందుకు మధ్యలో ఈ కోటను తూర్పున వైపున పునర్నిర్మించి మరింత ధృడంగా మార్చారు. ఇక గోల్కొండ కోట ప్రధాన గేటు వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగాన 300 అడుగుల ఎత్తున ఉన్న పోర్టికో కట్టడంలో శబ్దం విని
పిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈ కోటలో ఇటువంటి అద్భుతాన్ని చూడవచ్చు. ఇదే గోల్కొండ కోట ప్రత్యేకత. నాడు ఈ కోట వద్ద వజ్రాల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. వజ్రాలను వీధులలో పోసి అమ్మేవారని చరిత్ర చెబుతుంది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్‌ వజ్రం గోల్కొండ కోటకు చెందినదే. హోప్‌ డైమండ్‌ కూడా ఇక్కడిది కావడం విశేషం. గోల్కొండకు వాయువ్య దిశలోని కుల్లూరు గనులలో నాడు వజ్రాలు లభించేవి. ఇక ఈ కోటను 120 మీటర్ల కొండపైన నిర్మించారు. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు 1687లో ఈ కోటను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాడు. తొమ్మిది నెలల పాటు గోల్కొండ కోటను శత్రువులకు దక్కకుండా కుతుబ్‌షాహి చక్రవర్తి పోరాడాడు. చివరికి ఈ కోట మొగల్‌ చక్రవర్తి వశమైంది. తానీషా కాలంలో భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న చక్రవర్తికి చెప్పకుండా రాజ్యానికి చెందిన డబ్బులతో భద్రాచలాన్ని నిర్మించాడు. ఇది తెలిసిన చక్రవర్తి రామదాసును గోల్కొండ కోటలోని ఓ జైలులో బంధించాడు. ఈ జైలు నేటికీ గోల్కొండ కోటలో చూడవచ్చు.

సాలార్‌జంగ్‌ మ్యూజియం..
సాలార్‌జంగ్‌ మ్యూజియంలో అద్భుతమైన కళాఖండాలు, పెరుంటింగ్స్‌, కార్వింగ్స్‌, ఆకర్షణీయమైన రాచరిక వస్త్రాలు, తాళపత్ర గ్రంథాలు, సెరామిక్‌ వస్తువులు, మెటల్‌ కళాకృతులు, కార్పెట్లు, గడియారాలు, దేశ, విదేశాలకు చెందిన అందమైన ఫర్నీచర్‌ను పొందుపరిచారు. మనదేశంతో పాటు జపాన్‌, చైనా, బర్మా,నేపాల్‌,పర్షియా,ఈజిప్ట్‌,యూరప్‌, అమెరికాలకు చెందిన ఆకర్షణీయమైన ఫర్నీచర్‌ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

salrjung-musium-చారిత్రక హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటైంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాలార్‌జంగ్‌ మ్యూజియం. మూసీ నదికి దక్షిణాన నాడు దీన్ని నిర్మించారు. ప్రస్తుతం దేశానికి చెందిన నేషనల్‌ మ్యూజియంలలో ఇది ఒకటి. అద్భుతమైన కళాఖండాలు, పెయింటింగ్స్‌, కార్వింగ్స్‌, ఆకర్షణీయమైన రాచరిక వస్త్రాలు, తాళపత్ర గ్రంథాలు, సెరామిక్‌ వస్తువులు, మెటల్‌ కళాకృతులు, కార్పెట్లు, గడియారాలు, దేశ, విదేశాలకు చెందిన అందమైన ఫర్నీచర్‌ను ఈ మ్యూజియంలో పొందుపరిచారు. మ్యూజియంలో ఒకటవ శతాబ్దానికి చెందిన కళాఖండాలు కూడా ఉండడం విశేషం. హైదరాబాద్‌ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏడవ నిజాం వద్ద ప్రధానమంత్రిగా చేసిన మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ సాలార్‌జంగ్‌-3 సాలార్‌జంగ్‌ మ్యూజియం నెలకొల్పాడు. 35 సంవత్సరాల పాటు దేశ,విదేశాలకు చెందిన కళాఖండాలను ఆయన సేకరించి వాటితో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు.

ఇసాలార్‌జంగ్‌ సేకరించిన కళాఖండాల్లో కేవలం సగం మాత్రమే నేడు సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఉన్నాయని అంటారు. ఇక ముందుగా దివాన్‌దేవ్డీలో కొనసాగిన ఈ మ్యూజియాన్ని మదీనాకు సమీపంలోని మూసీనది తీరంలో నిర్మించిన కొత్త భవనానికి తరలించారు. ఈ సందర్భంగా పలు కళాఖండాలు చోరీకి గురయ్యాయి. 1968లో మ్యూజియాన్ని తరలించారు. ప్రస్తుతం ఈ మ్యూజియం నిర్వహణను ట్రస్టీలతో కూడిన బోర్డు చూసుకుంటుండగా రాష్ట్ర గవర్నర్‌ బోర్డు ఎక్స్‌-అఫియో చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. రాజారవివర్మకు చెందిన అరుదైన పెయింటింగ్స్‌, ఔరంగాజేబు ఉపయోగించిన ఖడ్గం, జహంగీర్‌, నూర్జహాన్‌, షాజహాన్‌ వంటి మొగల్‌లకు చెందిన డాగర్లు, టిప్పు సుల్తాన్‌కు చెందిన ఆయుధాలు, వస్తువులు, బంగారం, వజ్రాలతో తయారైన టిఫిక్‌ బాక్స్‌ వంటివి సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

చౌమహల్లా ప్యాలెస్‌..
1750లో ఐదవ నిజాం నవాబ్‌ సలాబత్‌ జంగ్‌ చౌమహల్లా ప్యాలెస్‌ నిర్మాణాన్ని ్ర పారంభించారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం నిర్మాణం 1869లో ముగిసింది. టెహ్రాన్‌లోని ఇరాన్‌ షా ప్యాలెస్‌ నమూనాలో దీన్ని నిర్మించినట్టు ప్రతీతి.

chowmahalla-palace-హైదరాబాద్‌ సామ్రాజాన్ని పరిపాలించిన నిజాం నవాబుల అధికారిక నివాసం చౌమొహల్లా ప్యాలెస్‌. చారిత్రక చార్మినార్‌కు కొంత దూరంలో ఈ అందమైన ప్యాలెస్‌ను నిర్మించారు. పర్షియాలో చహర్‌ అంటే నాలుగు అని, అరబిక్‌లో మహలత్‌ అంటే ప్రాంతాలని అర్థం. దీంతో చౌమహల్లా అంటే నాలుగు ప్రాంతాలు లేదా నాలుగు ప్యాలెస్‌ల సమూహమని అర్థం. నిజాంకు సంబంధించిన అన్ని అధికార కార్యక్రమాలు, వేడుకలను ఈ ప్యాలెస్‌లోనే జరిపేవారు. ఇక ఈ చారిత్రక కట్టడానికి గత ఏడాది మార్చి 15న కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌కు గాను యునెస్కో ఏషియా పసిఫిక్‌ మెరిట్‌ అవార్డును ప్రదానం చేసింది. యునెస్కో అధికార ప్రతినిధి తకహికో మకినొ ఈ అవార్డును నిజాం నవాబు అయిన ప్రిన్స్‌ ముకరంజా బహదూర్‌ మాజీ సతీమణి, ఆయన జిపిఎ హోల్డర్‌ ప్రిన్సెస్‌ ఎస్రాకు అందజేశారు.

ఇక 1750లో ఐదవ నిజాం నవాబ్‌ సలాబత్‌ జంగ్‌ చౌమహల్లా ప్యాలెస్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం నిర్మాణం 1869లో ముగిసింది. టెహ్రాన్‌లోని ఇరాన్‌ షా ప్యాలెస్‌ నమూనాలో దీన్ని నిర్మించినట్టు ప్రతీతి. ఈ ప్యాలెస్‌లో రెండు కోర్టు యార్డ్‌లు ఉన్నాయి. నాలుగు అందమైన ప్యాలెస్‌ల సమాహారంగా దీన్ని నిర్మించారు. దర్బార్‌ గ్రాండ్‌ ఖిల్వత్‌ను అత్యద్భుతంగా రూపొందించారు. అందమైన ఫౌంటేన్‌లు, గార్డెన్‌లతో 45 ఎకరాల సువిశాల స్థలంలో నిజాం నవాబులు తన అధికారిక నివాసాన్ని నిర్మించారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌...
fuluknuma-palaceదేశంలోని అందమైన ప్యాలెస్‌లలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ ఒకటి. పైగా వంశస్థులు నిర్మించిన ఈ ప్యాలెస్‌ను ఆ తర్వాత నిజాం నవాబులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. చార్మినార్‌కు 5 కి.మీ.ల దూరంలో 32 ఎకరాల స్థలంలో ఈ కట్టడాన్ని అందం గా నిర్మించారు. హైదరాబాద్‌ ప్రధానమంత్రి నవాబ్‌ వికార్‌-ఉల్‌-ఉమ్రా దీన్ని రూపొం దించారు. ఆయన ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ బహదూర్‌కు సమీప బంధు వు. ఇక ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ఆకాశం వంటిందని, ఆకాశానికి అద్దం వంటిదని అర్థం. ఇంగ్లీష్‌ ఆర్కిటెక్ట్‌  డిజైన్‌ చేసిన ఈ ప్యాలెస్‌ నిర్మాణం పూర్తి కావడానికి 9 సంవత్స రాల సమయం పట్టింది. ఈ ప్యాలెస్‌ను తేలు ఆకారంలో నిర్మించారు. ప్యాలెస్‌కు ఉత్తర దిశన రెండు రెక్కల వంటి నిర్మాణాలను చేపట్టారు. మధ్య భాగంలో ప్యాలెస్‌ ప్రధాన భవనం, గోల్‌ బంగ్లా, జెనానా మహల్‌ వంటి వాటిని రూపొందించారు. ఇటాలియన్‌, ట్యుడర్‌ ఆర్కిటెక్చర్‌లో ప్యాలెస్‌ అందంగా రూపుదిద్దుకుంది. రంగు,రంగుల అద్దాలతో కూడిన కిటికీలు ప్యాలెస్‌కు ప్రత్యేక ఆకర్షణను చేకూరుస్తున్నాయి.

భక్తుల పాలిట కల్పవల్లి... జొన్నవాడ కామాక్షితాయి

templeపార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి. శ్రీ పొట్టిశ్రీ రాము లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చు తూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది.

ఆలయ ప్రాశస్థ్యం..
ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు.పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, ఆహావనియాగ్ని, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు. శ్యపు ని యజ్ఞయాగానికి పర్వశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించి నట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది.

బిందుబింబంగా అమ్మవారు
priestస్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శి లారూపం దాల్చింది. అనంత కాలంలో జాల ర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించా రు. నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి కామాక్షితాయిగాను భక్తకో టి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురా ణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది.

పినాకిని తీర్థం సర్వపాపహరణం
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వారపయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరినఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు.

త్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించి నట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది. 1969 ఏఫ్రిల్‌ మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖ రేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మ వారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడక్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది.

శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి. 9 రోజుల పాటు నిర్వ హించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు. ఆలయ కార్య నిర్వా హణాధికారి వేగూరు రవీంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు వారణాసి వెంకట శివగంగా ప్రసాద్‌ లు కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్ప దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక.

భక్తుల పాలిట పెన్నిధి నరసింహుని సన్నిధి

నెల్లూరు జిల్లాలోని రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రములో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు తమ పాలిట పెన్నిధిగా ఆరాధిస్తారు. ఇక్కడ దేవదేవేరులు భక్తాభీష్ట ఫలప్రభుదులై కోరిన వరాలు ఇస్తారన్నది భక్తుల విశ్వాసం. కృతయుగమున అవతరించిన విష్ణుమూర్తి నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారంలో స్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేసేందుకు భూమిపై నవనారసింహులుగా అవతరించినట్లు పురాణ కథనం.

alyamsశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రములో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు తమ పాలిట పెన్నిధిగా ఆరాధిస్తారు. శ్రీస్వామి వారు లోక కళ్యాణార్ధం కోసం కోన క్షేత్రంలో స్వయంభువుగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతోంది. భక్తుల పాలిట ఇలవేల్పు ఆరాధ్యదైవంగా స్వామివారు వెలుగొందుతూ దినదిన వ్రపర్ధమానం చెందుతున్నారు. ఇక్కడ శ్రీస్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభవుగా వెలసి ఉన్నారు. అల్లంత దూరమున ఆదిలక్ష్మి అమ్మవారున్నూ స్వయంభువుగా వెలసింది. ఈ దేవదేవేరులు భక్తాభీష్ట ఫలప్రభుదులై కోరిన వరాలు ఇస్తారన్నది భక్తుల విశ్వాసం.

pujaayamదశావతారంలో మేటిగా నరసింహావతారం అంటారు. కృతయుగమున అవతరించిన విష్ణుమూర్తి నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారంలో శ్రీస్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేసి ముక్త జీవులను తరింపచేయుటకు భూమిపై నవనారసింహులుగా అవతరించినట్లు పురాణ కథనం. ఈ క్షేత్రం చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో పెనవేసుకొని శిలారూపమున ఇక్కడ వెలసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ స్వయంభువు వెనుక భాగమున మహా శిల ఉన్నది. ఈ గిరిశిఖరముల నుండి జాలువారు వర్షపునీటి ధార వెండి కరిగించి మూసలో పోయురీతిన స్వచ్ఛంగా ప్రవహించి దిగువ గ్రామాలకు వరప్రసాదియై కండలేరు జలాశయమున కలుస్తున్నది.

ఈ స్వామి చెంచు వనితైన లక్ష్మీదేవిని పెనవేసుకొని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుశిల క్షేత్రమని పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఆ పేరు రూపాంతరం చెంది పెంచలకోనగా మారిపోయిందని చెబుతారు. ఈ ప్రాంతం వారు నేటికీ తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ అని స్వామివారి పేరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈ ఛత్రవటి నారసింహుడు గొల్లబోయను శిలారూపమున అనుగ్రహంచినాడని చెబుతారు.

hanumansఈ గొల్లపోయిన ఆలయము గోనుపల్లి గ్రామ సమీపాన ఉన్నది. శకుంతలా దుష్యంత చవ్రర్తుల పరిణయం, భరతుని బాల్యక్రీడలతో ఈ పవిత్ర క్షేత్రం పునీతమైందని చెబుతారు. ప్రతి శనివారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి. శ్రీవారికి జరుగు బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమవుతాయి. శుద్ధ చతుర్ధశి నాడుగరుడసేవ నిర్వహిస్తారు. పూజలు పాంచరాత్ర అగనానుసారం పంచాహ్నికముగా జరుగుతాయి. శ్రీవారి మహోత్సవ పూర్వోత్తర కాలమందు సుమారు ఒక నెల స్వామివారు స్నానాద్యష్టానములను కావించుకొందురని ఈ సమయాన నప్తరుషులు స్వామివారికి దివ్యఛత్రము పట్టెదరని నానుడి. ఈ కారణం చేత స్వామివారికి ఛత్రవటి నారసింహస్వామికి ఆ పేరు సార్థకమైంది

Tuesday, 27 September 2011

ఊటీని మరిపించే రెడ్‌హిల్స్‌

దేవుడే గనుక చిత్రకారుడైతే కాన్వాస్‌పై చిత్రించే ప్రకృతి దృశ్యాలు భూమిపై నిజంగా ఎలా ఉంటాయో చూడా లనుకుంటే రెడ్గహిల్స్‌కు వెళ్ళాల్సిందే. ఊటిని మరిపించే అందాలెన్నో ఇక్కడ ఉన్నారుు. చల్లటి వాతావరణం, రమణీయ పరిసరాలు. ప్రకృతి ఆరాధకులకు అంతకు మించి కావాల్సింది మరేమిటి? అందుేక అలాంటి వారంతా ఎంచుకునేది రెడ్గహిల్స్‌నే. ఊటీకి చేరువలోనే ఇది ఉండడం విశేషం. ఊటీకి వెళ్ళితే దీన్ని చూడడం మరువకండి.

vaguఈ ప్రాంతం ఊటికి 24 కి.మీ. దూరంలో ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా వున్న ప్రదేశం. ఇది బెంగుళూరుకు 325 కి.మీ. దూరంలో వుంది. బెంగుళూరు నుంచి రాష్ట్ర రహదారి 17 బండిపూర్‌, వయా మాండ్య మైసూర్‌ మంజన్‌ రోడ్డుల మీదుగా చేరవచ్చు. తమిళనాడు రాష్ట్ర రహదారి ఊటికి వయా తెప్పకాడు, గండలూరు జిల్లా రహదారి రెడ్‌హిల్స్‌కు వయా పలాడ ఐతలార్‌, ఎమరాల్డ్‌ మీదగా చేరవచ్చు.

Red+Hill+Nature+Resortఅతి సన్నని ముతరామ్‌ రోడ్డు ఊటీ గ్రామాలయిన పలాడ ఉతలార్‌, ఎమరాల్డ్‌ గ్రామాల మీదుగా క్యారెట్‌, క్యాబేజ్‌, పంట పొలాల మధ్యగా రెడ్‌హిల్స్‌ చేరవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం వెనుకకు జరిగి ఆలోచిస్తే బ్రిటిషు వారు ఈ ప్రాంతాన్ని ఎందుకు ఆదరించారో తెలుస్తుంది. ఈ రెడ్‌హిల్స్‌ అడవులు విశాలమైనవి దట్టమైనవి. ఇక్క వున్న ఆకుపచ్చని దృశ్యాలు ఈ ప్రాంతం అంతా మనలను జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి. మధుమలై, కూనురు మనల్ని ఊటినా అన్నట్లుగా భ్రమింపజేస్తాయి. దీనికి దగ్గరలోనే భవాని శాంక్చ్యువరి వుంది. ఈ కొండలు ఇందులో వున్న ఆకు పచ్చని పచ్చికబయళ్ళు నిరంతరం ఒకేలాగా వుంటాయి. ఇది బ్రిటిషువారు ఇదే పేరున్న ప్రదేశాన్ని గుర్తుకు తెస్తుంది. రెడ్‌హిల్స్‌కు 25 కి.మీ. వ్యాసార్థంలో నడిచి చూస్తే పక్షుల కిలకిలారావాలతో మధ్యాహాన్ని అతి తేలికగా గడపవచ్చు. రెడ్‌హిల్స్‌లో ఉన్న దారులు అన్ని కూడా చాలా సన్నగా వుంటాయి.

selayeru లేక్‌ డిస్ట్రిక్ట్‌...
ఇక్కడ 8 సరస్సులున్నాయి. ఇవి ఎమరాల్డ్‌ ఎవలాంచి అప్పర్‌ భవాని, పార్శన్‌ వాలి లేక్‌, పార్టిమండ్‌, వెస్ట్రన్‌ క్యాచ్‌మండ్‌ కూడా అద్దాలువలె కనిపిస్తూ మబ్బులను ప్రతిబింబింపజేస్తాయి. ఇక్కడ జూన్‌ నుంచి ఆగస్టులో 100 అంగుళాల వర్షపాతం నమోదువుతుంది.

అవలాంచి...
ఇది ఎమరాల్డ్‌కు 13 కి.మీ. దూరంలో వుంటుంది. ఈ గ్రామం పేరు అవలాంచి. ఇక్కడ నీలగిరిలోని ప్రాచీనమైన ఆటవిక తోడ తెగవారు వున్నారు. వారు పశుపోషకులు. ప్రాచీన కాలంలో వారు నెయ్యి, వెన్న వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జీవించేవారు. అవలాంచి 100 సం వయస్సు కలది. ఈ పచ్చిక బయళ్ళు పార్శ్వన్‌ వాలి లేక్‌ ఒక స్వతంత్య్ర వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వచ్చాయి. ఎమరాల్డ్‌ అవలాంచిలో 1980లో హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టేషన్‌ నిలిపారు.

ఎడుంబన్‌ కావడిలో ‘పళని‘ కుమారస్వామి

ఈ ఆలయంలోని విగ్రహం, కుమారస్వామి నెమలి సింహాసనం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న చిన్న బాలుడి రూపంలో ఉంటుంది. కనుకనే ఈ స్వామిని బాల సుబ్రహ్మణ్యం అని ఉదహరిస్తుంటారు. కుమార స్వామి ఎడుంబన్‌ను ఒక దండంతో చంపాడు గనుక ఆయనకు దండాయుధపాణి అని కూడా పేరు.

కుమారస్వామి ఆరు అంశలకు సంబంధించి ఆరు దేవాలయాలలోనూ పళని దేవాలయమే ప్రధానమైందని సుబ్రహ్మణ్యేశ్వరుని భక్తుల విశ్వాసం. కుమార స్వామి దేవాలయాలలోనే గాకుండా, తమిళనాడులోని దేవాలయాన్నింటిలోనూ భాగ్యవంతమైన ఆలయాల్లో ఈ పళని దేవాలయం ప్రముఖమైంది.
పళని దేవాలయం ఒక కొండ మీద ఉంది. పైకి ఎక్కడానికి మెట్ల దారి ఉంది. మెట్ల దారిని అనుకునే చదునైన రోడ్డు దారి కూడా ఉంది. మెట్ల దారికి కొంత దూరంలో రోప్‌ వే సదుపాయం కూడా ఉంది.

palani-3ఆలయం సుమారు 450 అడుగుల ఎత్తున ఉన్న కొండమీద ఉంది. ఈ కొండను ఎడుంబన్‌ కొండ అంటారు. ఒకానొకప్పుడు అగస్త్యుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఎందుకో రెండు కొండలను సృష్టించాడు. అందులో ఒక కొండ పేరు పగిరి. అగస్త్యుడు తన శిష్యులలో ఒకడైన ఎడుంబన్‌ అనే రాక్షసుడిని పిలిచి ఆ రెండు కొండలను ఒక కావడిలో చెరో పక్కన ఉంచి తన వెనుకే మోసుకురమ్మని చెప్పి కొంత దూరం పోయాక, తను బ్రహ్మలోకం పోయాడట.

కావడి మోసుకుంటూ వెళ్తూ ఉన్న ఎడుంబన్‌ కొంత దూరం పోయిన తరువాత, కావడి లోని ఒకవైపు కిందకు వంగిపోయి, బరువుగా ఉన్నట్లు అన్పించగా, కావడి కిందకు దించి చూశాడట. కావడిలో శివగిరి ఉన్నవైపు కిందకు దిగి ఉందట. ఆ కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక చిన్న బాలుడి ఆకారంలో కూర్చొని ఉన్నాడట. అతనిని దిగిపొమ్మని ఎడుంబన్‌ గద్దించాడు. వెంటనే స్వామి ఒక గదతో ఎడుంబన్‌ను కొట్టి చంపేశాడు.

palani_templeఇంతలో అక్కడికి తిరిగి వచ్చిన అగస్త్యుడు విషయం తెలుసుకొని శాంతించాల్సిందిగా స్వామిని ప్రార్థించాడు. అంతట స్వామి శాంతించి ఎడుంబన్‌ను తిరిగి బ్రతికించడమే గాకుండా, ఇక ముందు ఆ రెండవ కొండ మీదే ఉంటానని, తనను దర్శించడానికి వచ్చే వారు ముందుగా ఎడుంబన్‌ దర్శనం చేసుకున్న తరువాతనే తనను దర్శిస్తారని వరం ఇచ్చాడట. పళనిలో కొండమీదకు వెళ్ళే మార్గం పక్కనే ఈ ఎడుంబన్‌ విగ్రహం ఉన్న మందిరం లాంటి ఆలయం ఉంది. దాన్ని ఎడుంబన్‌ కొండ అని అంటారు.

palani-1కుమార స్వామి మొదట శివగిరి కొండ మీదకు చేరడానికి ఒక ఇతిహాసం ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసం వచ్చాడు. ఆయన చేతిలో ఒక పండు ఉంది. అతి అపురూపమైన బ్రహ్మజ్ఞానంతో నిండిన ఫలం అని చెప్పి పరమశివుడి చేతిలో పెట్టాడట. ఆ సమయానికి అక్కడే ఉన్న ఇద్దరు పుత్రులలో ఎవరికి ఆ ఫలం ఇవ్వాలో అర్థం గాక, ఈ సమస్త విశ్వాన్ని ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ ఫలం ఇస్తానని చెప్పాడట. కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనంఎక్కి బయలుదేరాడు. తన మరుగుజ్జు రూపంతో వేగంగా ప్రయాణించలేని వినాయకుడు తన తండ్రి చుట్టూ ప్రదక్షిణం చేసి, సమస్త విశ్వమూ పరమేశ్వరుడి ప్రతిరూపమే గనుక, తను విశ్వ ప్రదక్షిణం చేసి వచ్చినట్లేనని అన్నాడట.

palani-6అతని మాటలకు మెచ్చి ఆ ఫలం వినాయకుడికి ఇవ్వగా, ఆయన దానిని తినివేశాడట. కొంతసేపటికి విశ్వప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చిన కుమారస్వామి జరిగిన విషయం తెలుసుకొని, కోపంతో ఒక మూలకు పోయి కూర్చున్నాడట. అప్పుడు పరమేశ్వరుడు కుమారుడిని బుజ్జగించి, సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం మొత్తమూ నీలోనే ఇమిడి ఉంది. కనుక నీకు జ్ఞానం చేకూర్చే మరో ఫలం ఎందుకు అని సర్ది చెప్పాడట. అతా పరమేశ్వరుడు కుమారునితో ‘బ్రహ్మజ్ఞాన ఫలానివి సాక్షాత్తూ నీవే’ అన్న మాటలను క్లుప్తంగా, ఫలానివి నీవే అని ఉదహరించడంగా మారి, కాలక్రమేణా ‘పళని’ అయిందని అంటారు.

భక్తులు ఈ స్వామివారికి పాలతో అభిషేకం చేయడం సంప్రదాయంగా వస్తున్న పద్ధతి. అందువల్ల చుట్టపక్కల వారు ఇంటి నుంచే పాలు తెచ్చుకుంటారు. లేదంటే గుడి ఎక్కే మెట్ల మొదటనే ఉన్న దుకాణాల్లో పాలు అమ్ముతారు.

ఎలా వెళ్ళాలి...
దిండిగల్లు నుంచి కోయంబత్తూరు వరకు ఉన్న రైలు మార్గంలో మధ్యలో ఉంది పళని. రైలులో వెళ్ళితే దిండిగల్లు నుంచి 49 కి.మీ. సుమారు గంటన్నర ప్రయాణం

ప్రకృతి రమణీయతకు మారుపేరు కార్గిల్‌

జమ్మూకాశ్మీర్‌ లోని కార్గిల్‌ అనగానే అందరికీ భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం గుర్తుకు వస్తుంది. నిజానికి పర్యటన స్థలంగా ఇదెంతో పేరుగాంచింది. కార్గిల్‌ శ్రీనగర్‌ నుంచి 204 కి.మీ దూరంలో ఉంది. లెహ్‌ జాతీయ రహదారిపై నుంచి లేదా లడఖ్‌ నుంచి కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.

ఆసక్తిదాయక ప్రదేశాలు
డ్రెస్‌: ఇది ఓ చిన్న పట్టణం. కార్గిల్‌కు దగ్గరగా 57 కి.మీ దూరంలో శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారి మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు. ఇది ప్రపంచంలో అతి చల్లని ప్రదేశాల్లో ఒకటిగా పేరొందింది. ఇక్కడి ప్రజలు డర్డ్‌స్టాక్‌, ఇండోఆర్యన్‌ జాతివారు. వీరి పూర్వీకులు సెంట్రల్‌ ఆసియా నుంచి ఇక్కడకు వచ్చారని చెబుతారు.

సరూలోయ: ఇది సారవంతమైన అందమైన భూమి. ఇక్కడ టిబెట్‌-డార్‌ ప్రజలు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతమంతా కూడా ప్రకృతి రమణీయ దృ శ్యాలకు పేరుగాంచింది. 7135 మీటర్ల ఎత్తున ఉండే ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉంటుంది. పర్వతారోహకులు ఎంతో ఇష్టపడే ప్రాంతం ఇది.
kargil-4రాన్‌గ్‌ డ్యామ్‌: ఏకాంత వాతావరణం ఉండే లోయ ఇది. ఇది కార్గిల్‌కు 130 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 17వ శతాబ్దం నాటి విహారం ఉంది.

మలక్‌బేఖ్‌: ఇది కార్గిల్‌కు తూర్పున 35 కి.మీ. దూరంలో లేహ్‌ దారిలో ఉంది. ఇక్కడ కూడా 9 అడుగుల మైత్రేయి విగ్రహం ఉంది. ఇక్కడ ముల్‌ బేఖ్‌ విహార కేంద్రం ఉంది.

జాన్స్‌కార్‌: చాలా లోపలికి ఏకాంతంగా ఉండే లడక్‌ లోయ. ఇక్కడ అనేక ఆసక్తిదాయక విహారాలు, స్మారకస్థూపాలు ఉన్నాయి. ఈ లోయ మనాలి, క్రిస్ట్‌వార్‌, లేహ్‌, ఇండస్‌ లోయలను కలుపుతుంది.

Kargil_townకర్ష: ఇక్కడ 16 శతాబ్దపు పూర్వపు విహారాలు కూడా ఉన్నాయి.
బర్‌దాన్‌: విహార స్థలం. ఎన్నో రకాల విగ్రహాలు, స్థూపాలు ఉన్నాయి.
ఫగ్‌తాల్‌: ఇది జన్స్‌కార్‌ లోని రెండు అపురూప
విహారాలు ఉన్న ప్రాంతం.
జంగ్‌ముల్‌: ఇక్కడ గుహ విహారం ఉంది. ఇది రెండు గుహలకు విస్తరించి ఉంది.

అందాలోలికే.. కుంటాల

Kuntala-Water-Falls1ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రకృతి రమణీయత కలిగిన జలపాతం కుంటాల. ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకోవడంలో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. దక్షణ భారతదేశంలోనే అతిపెద్దదైన గోదావరి నదికి ఉప నదిఅయిన కడెం నదిపై అలరారుతున్న ఈ జలపాతం రాష్ట్రానికే తలమానికంగా ఉంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచూర్యాన్ని పొందిన ఈ జలపాతం రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జలపాతం కూడా కావడం విశేషం.

రాష్ట్రంలోనే అత్యంత ఎతె్తైన కొండల నుంచి అడవులను చీల్చుకుంటూ ప్రకృతి రమణీయతనంతా తనలో ఇముడ్చుకొని.. కొండ కోనల నుంచి జాలు వారుతున్న అందాల జలపాతం కుంటాల. సహాజ సిద్దమైన.. దట్టమైన అడవులు, ఎతె్తైన రాళ్లను చీల్చుకుంటు దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి భీకర శబ్దంతో కిందికి జాలువారుతూ పర్యటకులను మంత్ర ముగ్దులను చేస్తుంటుంది కుంటాల జలపాతం. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరడిగొండ మండల కేంద్రం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం కుడివైపు వెళ్తే అందమైన కుంటాల జలపాతం కనిపిస్తుంది.

Kuntala-Water-Falls కడెం నది పరివాహాక ప్రాంతంలో ఉండే ఈ జలపాతం ప్రతి యేట వర్షకాలంలో భీకర శభ్దంతో భయంకరంగా కనిపిస్తూ పర్యటకుల గుండెల్లో గుబులు రేపుతుండగా.. జనవరి తర్వాత చల్లటి సెలయేర్లు, తెల్లటి నురగలతో కొండ కోనలపై నుంచి జాలువారుతు ఆదిలాబాద్‌ మనిహారంగా నిలుస్తున్నది. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూడడానికి జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉండే నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ెహదరాబాద్‌తో పాటు మహారాష్టల్రోని నాందేడ్‌, యవత్‌మల్‌, చంద్రాపూర్‌ లాంటి జిల్లాల నుంచి పర్యటకులు భారీగా తరలి వస్తుంటారు. సెలవు దినాలతో పాటు వేసవిలో సైతం పర్యటకులు ఇక్కడి ప్రకృతి కమనీయతను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుంచి వాహానాలలో తరలివచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వంట వార్పు చేసుకొని వన భోజనాలు చేసి వెళ్తుంటారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పూర్వ పరాలను పరిశీలిస్తే అప్పటి శకుంతల దుష్యంతులకు విహార వెడిది కేంద్రంగా ఉండేదని శకుంతల జలపాతంగా మొదట దీనిని పిలువగా ఆతర్వాత ‘కుంతల’ జలపాతంగాను పిలువబడి కాల క్రమేనా ‘కుంటాల’ జలపాతంగా మారింది.

సోమేశ్వరాలయం...
ఈ జలపాతానికి అతి దగ్గరలో సోమేశ్వరాయం ఉంది. మహ శివరాత్రి రోజున ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. కుంటాల జలపాతంలోని ఎతె్తైన.. నీళ్లు జాలువారే ప్రదేశ సమీపంలోనే ఉన్న గుహలో సోమేశ్వరుడు కొలువై భక్తుల మొక్కులు చెల్లిస్తున్నాడు. ప్రతియేట మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో వందలాది మంది శివభక్తులు వచ్చి.. అతి ప్రమాదమని తెలిసి కూడా గుహలో పూజలు చేసి తరించడం గమనార్హం. ఈ గుహ నుంచి ఇచ్చోడ ప్రాంతంలోని సిరిచెల్మ మల్లేశ్వర స్వామి ఆలయం వరకు సోరంగ మార్గం ఉందనే వాదన కూడా ఉంది. ఈ గుహను ప్రజలు సోమన్న గుహగా కూడా చెప్పుకుంటారు. ప్రకృతి సహాజ సిద్దమైన జలపాతంగా ఉన్న కుంటాలను రాష్ట్రప్రభుత్వం మరింత అభివృద్ధి పరచాల్సి ఉంది. రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్‌ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది.

చారిత్రక విశేషం...
03ADB22 భార్య శకుంతల నుంచి పేరుతో ఈ జపాతాన్ని ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని స్థానికుల అభిప్రాయం.. ఈ జలపాతం పరిసర ప్రాంతాలను వీక్షించి మైమరిచిపోయిన శకుంతల తరుచుగా ఈ జలపాతంలో జలకాలాడేదని ఇక్కడి ప్రలు నమ్ముతారు. ఈ ప్రాంతం.. మూడు జలపాతాలు, గుండాలుగా ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా పిలుస్తారు. ఈ జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటం వలన ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను సందర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. దీనినే ఇక్క డ సోమన్న జాతరగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ రెండు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా. ఇదే జిల్లాలో... చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువై ఉన్న బాసర దేవాలయాన్ని సందర్శించే భక్తుల టూర్‌ షెడ్యూల్లో కుంటాల జలపాతం కూడా ఉంటుంది. జపాతానికి చుట్టూ ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కిలిగి అధికంగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు, పక్షులు ఉన్నాయి.

ఇలా వెళ్ళాలి...
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉన్న నేరేడిగొండ అనే గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి బస్సు, రైలు సౌకర్యం కలదు. బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంటే హైదరాబాద్‌ - నాగపూర్‌ జాతీయ రహదారి మీదుగా నగర శివారులోని మేడ్చైఉ నుండి బయలుదేరి కామారెడ్డి, ఆర్మూర్‌, నిర్మైఉ (నిజామాబాద్‌ జిల్లా)ల మీదుగా కుంటా చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోంది. రైలు మార్గం గుండా వెళ్తే సికింద్రాబాద్‌ నుండి ఆదిలాబాద్‌ చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా కుంటాలా చేరుకోవచ్చు.

స్విమ్మింగ్‌ నిషేధం...
45 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే నీళ్ళు,ఆ చప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత పంక్తుల్లో గోదావరికి ఉపనది ఆయన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. జలపాతం దిగువభాగంలో సమతలంగా ఉన్న బండరాళ్ళు ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తున్నాయి. జలపాతం వద్ద ఉన్న లోయలు కూడా చాలా లోతుగా ఉండి నీళ్ళు సుళ్ళు తిరిగే దృశ్యం ముచ్చటగొలుపుతుంది. ఇక్కడ నీటిలో స్విమ్మింగ్‌ చేయడం నిషేధం. ఎందుకంటే ఎంతో లోతైన ఈ జలపాతంలో ఈదటం చాలా ప్రమాదకరం.

Monday, 19 September 2011

విశ్వ విజ్ఞాన ‘తొలి’ వేదిక..

ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్త్రాలు ఎనలేని ఆదరణ చూరగొన్నాయి. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞాన ఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. బీహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దే శంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్నాయి.

nalanda-university-complexనేటి ఆధునిక గణిత, వైద్యశాస్త్ర పరిశోధనాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడే.. నలంద విశ్వవిద్యాలయం శస్త్ర విద్యలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంటి పొరలు, గర్భకోశం నుంచి మృతపిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. మానవులతోపాటు ఇక్కడ జంతువు లకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది. ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాలనుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు. 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు. బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరం లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం.

నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అ ని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టిం దే ‘నలంద’. అనగా జ్ఞానప్రదా యిని అని అర్థం. చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్‌ త్సాంగ్‌ నలంద పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్‌ త్సాంగ్‌ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే ‘నలంద’ అన్న పేరు వచ్చిందని వివరించాడు.

గౌతమ బుద్ధుని కాలములో నలంద...
Nalanda-sariputtaనలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం నలందను బారాగావ్‌ గ్రామంగా గుర్తించాడు. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట.

అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు. కేవత్త, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలం ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ సింహగర్జన చేశాడు. రాజగృహ నుండి నలందకు వెళ్ళే మార్గం అంబలత్తికా గుండా వెలుతుంది. అక్కడి నుండి ఆ మార్గం పాతాలీగామా వరకు వెళ్ళేది. రాజగృహకు, నలందకు మధ్యన బహుపుత్త చేతియ ఉన్నది.

Nalanda_Universityకేవత్త సుత్త ప్రకారం... బుద్ధుని కాలానికే నలంద ప్రాముఖ్యత కలిగి నిండు జ నాభాతో వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలాకాలానికి గానీ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. సమ్యుత్త నికాయలోని, ఒక రికార్డులో న లంద బుద్ధునికాలంలో తీవ్ర క్షామానికి గురైనదని నమోదు చేయబడినది. బు ద్ధుని కుడిభుజం వంటి ఆయన శిష్యుడైన సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు. నలంద, సొన్నదిన్న యొక్క నివాసస్థలం.

ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలం ద లో మహావీరుడు అనేక పర్యాయములు బసచే సి నాడని పేర్కొనబడినది. మహావీరుడు నలం దలో ఉన్నపవపురిలో మోక్షాన్ని పొం దినట్టుగా భావిస్తారు. (అదేకాక జైనమ తంలోని ఒక తెగ ప్రకారం, మహా వీరుడు నలంద సమీపాన ఉన్న కుందల్‌పూర్‌లో జన్మించాడు). అ శోకుడు క్రీస్తుపూర్వం 250లో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించా డని చెబుతారు. టిబెట్‌ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలంద వి శ్వవిద్యాలయములో బో దించాడు. చరిత్రకారుల ప్రకారం ఈ విశ్వవిద్యా లయం క్రీశ 1193 వరకు ఉన్నతస్థా యిలో వర్థిల్లింది. దీనికి ప్రధాన కారణం బౌద్ధచక్రవర్తులైన హర్షవర్ధనుడు వంటివారు. పాలివంశానికి చెందిన రాజుల ఆదరణే కారణం.

విశ్వవిద్యాలయ చరిత్ర...
Nalanda_Universitచారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది. నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది.

నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలంద విద్యార్ధులను, బొధకులను కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కి వంటి దేశాల నుండి ఆకర్షించింది. తాంగ్‌ వంశానికిచెందిన చైనా తీర్థ యత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ 7వ శతాబ్ధపు నలంద విశ్వ విద్యాలయం గురించి వివరాలు సంగ్రహపరిచాడు.

బౌద్ధమతంపై నలంద ప్రభావం...
9 - 12 వ శతాబ్దం మధ్యకాలంలో ప్రజ్వరిల్లిన టిబెటన్‌ బౌద్ధత్వం (వజ్రాయన) నలంద బోధకుల నుండి, సంప్రదాయాల నుండే ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, మరియు జపాన్‌లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. థెరవాడ బౌద్ధం కూడా నలందలో బోధించబడినది. కానీ థెరవాడ బౌద్ధానికి నలంద గట్టి కేంద్రం కాకపొవడం వల్ల, తరవాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.

పతనావస్థ...
Nalanda_seal1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్‌ ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు. 1235లో టిబెట్‌ అనువాదకుడు ఛాగ్‌ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. దండయాత్రల ప్రధాన మార్గంలో ఉన్న ఇక్కడి సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గంలో లేకపోవడం నలంద, బుద్ధగయ మిగిలాయని చెబుతారు. ప్రధాన మార్గంలో లేని, ఉత్తర బెంగాల్‌ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రం హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.

భారత విజ్ఞాన వినాశనం...
పర్షియన్‌ చరిత్రకారుడు మిన్నాజ్‌-ఈ-సిరాజ్‌ తన తబాకత్‌ - ఇ - నసిరీన్‌ అనే రచనలో నలంద విశ్వవిద్యాలయ నాశనాన్ని ఇలా వర్ణించాడు. ‘‘విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాదిమంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సజీవదహనం చేయబడ్డారు. మరికొన్ని వేలమంది తలలు తెగ నరకబడ్డాయి. బ్రహ్మాండమైన గ్రంథాలయం తగలబెట్టబడింది. అది కొన్ని నెలలు పాటు తగలబడింది. తగలబడుతున్న పుస్తకాల నుండి చెలరేగిన పొగ ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా కమ్ముకుంది’’ అని వివరించాడు. సందంట్లో సడేమియా అన్నట్లుగా ఈ విశ్వవిద్యాలయం వినాశనంలో హిందూ మతోన్మాదులు కూడా ఒక చేయి వేశారు.

శర్మ స్వామి అనే టిబెట్‌ యాత్రికుడు భక్తియార్‌ ఖిల్‌జీ దాడి తర్వాత మూడు దశాబ్దాలకు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగిన దుర్మార్గాన్ని వర్ణించాడు. దీని ప్రకారం ఖిల్‌జీ దాడి అనంతరం నెలకొని ఉన్న అరాచక వాతావరణంలో కొందరు హిందూ సన్యాసులు ఒక యజ్ఞాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తర్వాత యజ్ఞం తాలూకు నిప్పుల కట్టెలను వారు అన్నిచోట్లా విసిరేశారు. అవి మంటలను సృష్టించాయి. ఆ మంటల్లో అప్పటికీ మిగిలి ఉన్న రత్నబోధిలోని గ్రంథాలన్నీ తగలబడ్డాయి. ఆ తొమ్మిది అంతస్థుల భవనంలోని విజ్ఞాన భాండాగారం నాశనమైపోయింది. దీనితో నలంద విశ్వవిద్యాలయం, దానిలో విజ్ఞానశాస్త్ర భాండాగారం చరిత్రగర్భంలో కలిసిపోయాయి. ‘అహి’ అనే చరిత్రకారుని ప్రకారం, ‘‘నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా ప్రదేశాలు, గ్రంథాలయాల వినాశనం, ఖగోళశాస్త్రం, లెక్కలు, రసాయనిక శాస్త్ర, వైద్యశాస్త్రంలో భారతీయ శాస్ర్తీయ ఆలోచనా విధానం యొక్క వినాశనానికి మూలమని అంగీకరించక తప్పదు.

అవశేషాలే.. నేటి పర్యాటక కేంద్రాలు...
జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు.. ఆనాటి విజ్ఞానపు తాలూకు వాసనలు వెదజల్లుతూ.. ఇంకా మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉన్నది. పురాతత్వ శాఖ లెక్కల ప్రకారం.. అవశేషాలు 150,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్నవి. హువాన్‌ త్సాంగ్‌ యొక్క వర్ణన ప్రకారం నలంద విస్తృతిని, ఇప్పటి వరకు త్రవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పోల్చి అంచనా వేస్తే, ఇంకా 90% శాతం దాకా అవశేషాలు బయల్పడనట్టే. నలంద ఇప్పుడు నిర్వాసితము. ప్రస్తుతం ఇక్కడికి అతి చేరువలోని జనవాస ప్రదేశం బార్‌గాఁవ్‌ అనే గ్రామం. 1951లో నవ నలంద మహావిహార అనే ఒక ఆధునిక పాళీ, థెరవాడ బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడినది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్‌ ఇమేజింగ్‌ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలంద మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు, త్రవ్వకాలలో దొరికిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

పునరుద్ధరణ...
డిసెంబర్‌ 9, 2006న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 1 బిలయన్‌ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్న చోటను పునరుద్ధరించటానికి ఓ ప్రణాళికను వివరించింది. సింగపూర్‌ నేతృత్వంలో భారత్‌, జపాన్‌, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్‌ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్‌ డాలర్లు దానికి అవసరమయ్యే సదుపాలను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది

సర్వమత సంగమం... గోరఖ్‌పూర్‌

Gorakhnath_Temple_Gorakhpur
ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ ప్రాంతమైన గోరఖ్‌పూర్‌ సర్వమతాలకు నిలయం. నేపాల్‌ సరిహద్దు ప్రాంతం లో ఉండటంవల్ల ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించిన రప్తి నది ఒడ్డున ఉంది గోరఖ్‌పూర్‌. భారత స్వాతంత్య్రోద్యమ సమయంలో వివిధ ఘట్టాలకు నిలయం గోరఖ్‌పూర్‌.గోరఖ్‌పూర్‌ ప్రాంతాన్ని సూర్యవంశ రాజులు పరిపాలించారు. వీరి రాజధాని అయోధ్య. ఆ తర్వాత కాలంలో ఇది కోసల సామ్రాజ్యంగా పిలిచేవారు. క్రీస్తు పూర్వం ఆరో దశాబ్దంలోని 16 మహాజనపదాల్లో ఒకటి కోశల. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు, జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఇక్కడే తిరగాడని అంటారు. మౌర్యులు, శుంగ, కుషాణ, గుప్త, హర్ష సామ్రాజ్యా కాలంలో విరాజిల్లింది గోరఖ్‌పూర్‌.

గోరఖ్‌నాథ్‌ దేవాలయం...
గోరఖ్‌నాథ్‌ 12వ శతాబ్ది నాటి శైవ మత యోగి. ఈయన పేరు మీద నిర్మించినది గోరఖ్‌నాథ్‌ దేవాలయం. సంక్రాం తికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. నేపాల్‌ రాజు కూడా ఈ సమయంలో ఇక్కడి వచ్చి వెళతారని స్థానికులు అంటుంటారు. గోరఖ్‌పూర్‌ నుంచి 4కి.మీ. దూరంలో నేపాల్‌ రోడ్‌లో గోపాల్‌నాథ్‌ దేవాలయం ఉంది.

విష్ణు దేవాలయం...
శ్రీ మహావిష్ణువు నల్లరాతి స్వరూపం ఉన్న దేవాలయం ఇది. 12వ శతాబ్దానికి చెందిన పాల రాజులు ఈ దేవా లయాన్ని కట్టించారని అంటారు. దసరా సమయంలో రామలీలా ఉత్సవాలు ఎంతో ఆర్భాటంగా జరుగుతాయి.

గీతా ప్రెస్‌...
గోరఖ్‌పూర్‌లోని రెట్టీ చౌక్‌లో హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను ముద్రించే గీతా ప్రెస్‌ ఉంది. ఇక్కడ శ్రీమద్‌ భాగ వతాన్ని పాలరాతి రాళ్లపై చెక్కారు. సాకేత రాముడు, శ్రీకృష్ణ లీలల చిత్రాలు ఉన్నాయి. రసూల్‌ పూర్‌, గోరఖ్‌ నాథ్‌ లోని జామా మసీదు, రేతి రోడ్‌లో మదీనా మసీదు, బుద్ధుని మ్యూజియం ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: గోరఖ్‌పూర్‌ 6కి.మీ. దూరంలో విమానా శ్రయం ఉంది. జెట్‌లైట్‌ విమానంలో వెళ్ళవచ్చు.

రైలు మార్గం: గోరఖ్‌పూర్‌ ప్రధాన రైల్వే జంక్షన్‌. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్ళు వెళ్తాయి.

రోడ్డుమార్గం: గోరఖ్‌పూర్‌ మీదుగా జాతీయ రహదారి నెం. 28,29 వెళుతున్నాయి. లక్నో 276కి.మీ. వారణాసి 23 1 కి.మీ., అలహాబాద్‌339 కి.మీ. దూరంలో ఉన్నాయి.

అబ్బురపరిచే... డోలోమైట్స్‌ ఆల్ప్స్‌

ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఇటలీలోని డోలోమైట్స్‌ పర్వతాలు. అందమైన ఆల్ప్స్‌ పర్వతాలలో భాగమే ఈ డోలోమైట్స్‌. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేరి అరుదైన ఘనతను సంపాదించుకున్న డోలోమైట్స్‌... ప్రపంచంలోనే ఎంతో అందమైన పర్వతాలుగా దేశవిదేశ పర్యాటకులను అలరిస్తున్నాయి.

The_Dolomites_Alps_Italyనిట్టనిలువుగా, కొనదేలిన శిఖరాలతో, చాలా ఇరుకైన లోయ లతో కూడిన పర్వత శ్రేణులు ఈ డోలోమైట్స్‌లో కనిపిస్తా యి. వీటిమధ్యలో కనువిందు చేసే అద్భు తమైన దృశ్యాలెన్నో ఉంటాయి. వీటిలో కొన్నింటిపై పేరుకున్న మంచు.. హిమానీ నదాలుగా మారుతుంది.

మొదటి ప్రపంచ యుద్ధానికి మూగ సాక్షులు...
మొదటి ప్రపంచ యుద్ధా నికి మూగ సాక్షులైన ఈ డోలోమైట్స్‌ పర్వతాల్లో.. 1915 మే నుంచి 1917 అక్టో బర్‌ వరకూ ఇటలీ, ఆస్ట్రియా దేశా ల సైనికులు 20 నెలలపాటు తలపడ్డా రు. ఈ యుద్ధంలో ఇరు పక్షాలు ప్రయోగించిన బాంబుల వల్ల కూడా ఈ పర్వతాలు రకరకాల ఆకారాల్లో ఏర్పడిన మార్పులు చూపరులను ఆకర్షించడం మరో విశేషం. ఇప్పటికీ అక్కడ కనిపించే యుద్ధ గుర్తుల కోసం ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.

Dolomitesఈ పర్వతాలలో వీరికోసం దాదాపు 500 స్కైలిఫ్ట్‌లు ఉన్నాయంటే, వీటికి ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. డోలోమైట్స్‌లో దాదాపు 18 శిఖరాలు 3 వేల మీటర్లు అంటే సుమారు పదివేల అడుగుల ఎత్తుగా నిలబడి అబ్బురపరుస్తుంటాయి. పెద్ద పెట్టెలాంటి దాంట్లో పర్యాటకులు కూర్చుంటే, యాంత్రిక కప్పీల సహాయంతో నిలువుగా లిఫ్ట్‌ లాగా ఇవి పైకి వెళ్తుంటే.. చుట్టూ ఉండే దృశ్యా లను చూస్తూ సందర్శకులు మైమరచిపోతుం టారంటే అతిశయోక్తి కాదు. ఈ స్కై లిఫ్ట్‌లు సుమారు 750 మైళ్లు అంటే 12 వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.


సముద్రం నుండి ఉద్భవించి...
డోలోమ్యూ అనే ఫ్రెంచ్‌ ఖనిజ శాస్తజ్ఞ్రుడు ఈ పర్వతాల శిలలపై పరిశోధనలు చేసి, ఇవి ప్రత్యేకమైన కర్బన పదార్థంతో కూడిన డోలోమైట్‌ అనే రాయితో ఏర్పడ్డాయని కనుగొన్నాడు. దీంతో ఈ పర్వతాలకు డోలోమైట్స్‌ పర్వతాలు అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ డోలోమైట్స్‌ పర్వతాలలో చెప్పుకోవాల్సిన విచిత్రం మరో టుంది. అదేంటంటే.. 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పర్వ తాలు సముద్రంలోంచి పొడుచుకొచ్చాయి. అందువల్లనే నీరు, మంచు, గాలుల కారణంగా చిత్రమైన ఆకారాలను ఇవి సంతరిం చుకుని చూపు మరల్చుకోనీయకుండా చేస్తాయి.

Dolomites-Italyరకరకాల రంగుల్లో ఉండే వాటిని చూసేందుకు రెండుకళ్లూ సరిపోవు. బూడిద రంగు, మట్టిరంగు, తెలుపు, నీలం రంగుల్లో ఉండే ఈ పర్వతాలు మన కళ్లను ఏ మాత్రం పక్కకు తిప్పనీవు, దృష్టిని మరల్చనీవు. అంత అందంగా, సుమనోహరంగా ఉంటాయవి. అందుకే ఎంత కష్టసాధ్యమయినా సరే ఈ పర్వతాలను ఎక్కేం దుకు పర్వతారోహకులు బారులు తీరుతుంటారు. ఇక పర్యాట కుల సంగతయితే చెప్పనవసరం లేదు. వీరు ఆయా మార్గాలు, సౌకర్యాల ద్వారా డోలోమైట్స్‌ పర్వాతాలను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుండి తరలివస్తుంటారు.

యూనెస్కో వారసత్వ సంపద...
యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ప్రపంచం లోని 13 దేశాలలోని కొన్ని ప్రదేశాలను కొత్తగా వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. వీటిలో డోలోమైట్స్‌ పర్వతాలు చేరాయి. స్పెయిన్‌ కేం ద్రంగా పనిచేసే యునెస్కో వివిధ దేశాల్లోని ప్ర కృతి, సాంస్కృతికపరమైన అద్భుత ప్రదేశాలు గుర్తించి, వాటి రక్షణకు కృషి చేస్తోంది.

నర్మదమ్మకు పుట్టినిల్లు

యమునా నదిలో ఏడుసార్లు, సరస్వతిలో మూడుసార్లు, గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పవిత్రులవుతారని ఓ నమ్మకం. అత్యంత పవిత్రమైన నర్మదానదిని చూస్తేనే.. అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. అలాంటి పవిత్ర నదీమతల్లి నర్మద జన్మస్థానమే అమర్‌ కంటక్‌. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రదేశం.. అపురూపమైన జలపాతాలు.. శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలతో, ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్‌ కంటక్‌ విశేషాలు..
Narmadaఎటుచూసినా.. దేవదారు, సాల్‌, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద. పేర్లు కూడా సరిగా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. కటిక చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే.. కనుచూపు మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఇంకేముంది మీరు పడ్డ శ్రమనంతా.. అతి తేలిగ్గా మరిచిపోతారు. ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్‌ కంటక్‌. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌ జిల్లాలో ఉంది. నర్మదానది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే... దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్‌ కంటక్‌ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది.

పురూరవుడి తపోఫలితంగా..
పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై ‘నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర’ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్‌ కంటక్‌ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ. నర్మదా నది స్థానిక మైకల్‌ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

పుట్టినచోటే గుడి...
Narmada-Udgam-Mandirనర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. అన్నింటికంటే, శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది. అమర్‌ కంటక్‌ మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు జాతరలు సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రినాడు నర్మదానదిలో స్నానం చేసి, ముందుగా శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

నర్మద పుట్టుకపై ఎన్నో పురాణాలు..
నర్మదామాత ఆలయం గురించి అనేక పురాణ కథలు వినిపిస్తుంటాయి. క్రీశ 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే, దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివినుంచి భువికి దిగివచ్చింది నర్మద.
అలా అమర్‌ కంటక్‌ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట...!

ఏనుగు కాళ్ళ నుండి దూరితే పుణ్యం..!
Narmada_River_at_Malsar_Disనర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుం ది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్ర్తీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్‌ జైన్‌ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతా లనూ వీక్షించవచ్చు.

కపిలధార...
Kapil_Dharaఅమర్‌ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే ప్రాంతం ముఖ్యమైనది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. నూరు అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేం దుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

ఎలా వెళ్లాలంటే...
విజయనగరం నుంచి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బిలా స్‌పూర్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో రైల్లో పిండ్రా వరకు వెళ్లి అద్దె వాహనాల్లో అమర్‌ కం టక్‌ వెళ్లవచ్చు. లేదా బిలాస్‌పూర్‌ నుంచే నేరుగా ట్యాక్సీలలో 120 కిలోమీటర్ల దూరం లోని అమర్‌ కంటక్‌ వెళ్ళవచ్చు.

మరుపురాని జ్ఞాపకం.. మౌంట్‌ అబూ విహారం...

బ్రహ్మకుమారీలకు చెందిన ఆద్యాత్మిక కేంద్రం నెలకొనివున్న మౌంట్‌ అబూ రాజస్థాన్‌లో, ఉదయ్‌పూర్‌కు 156 కి.మీల దూరంలో ఉంది. మౌంట్‌ అబూకు దిల్వారా దేవాలయాలు, నక్కి తలవ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ అలాగే అక్టోబర్‌, నవంబర్‌ మాసాలు మౌంట్‌ అబూను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. రాజస్థాన్‌లోని ఏకైక పర్వత పర్యాటక కేంద్రం మౌంట్‌ అబూ. అరావళి పర్వతాలకు చివరగా నైఋతి దిశలో 1220 మీటర్ల ఎత్తున గ్రానైట్‌ పలకలతో నిండిన పర్వత సమూహల మధ్య మౌంట్‌ అబూ ఉంది.

The-Ranakpur-templeదట్టమైన అడవులతో నిండిన పర్వతాలు చుట్టూ ఉండగా ఒక సరస్సుకు ఆవృతమై మౌంట్‌ అబూ నిర్మితమైంది. పురాణేతిహాసాలను అనుసరించి శివుని వాహనమైన నందీశ్వరుని కాపా డేందుకు ఆర్బుద పేరుగల సర్పము ఇక్కడకు వచ్చిందని కనుక ఈ ప్రాంతానికి సర్పం పేరు స్థిరపడి పోయిందని ఒక విశ్వాసం. ప్రఖ్యాతి గాంచిన దిల్వారా దేవాలయాలతో పాటు అనేక పురావస్తు శిథిలాలకు చిహ్నంగా మౌంట్‌ అబూ వాసికెక్కుతున్నది.

అంతేకాక అనేక విహార కేంద్రాలు, అలనాటి రాజుల సౌందర్య దృష్టికి, శృంగార కాంక్షకు తార్కాణంగా నిలిచే పలు ప్రాంతాలు మౌంట్‌ అబూలో పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి. ఠీవిగా నిల్చున్న మానవుల వలే గంభీరాకృతిని పుణికిపుచ్చుకున్న శిలాపర్వతాలతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరమైన భావనతో మనసులను రంజింప చేస్తున్నది. దీనికి తోడు అకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే మహావృక్షాలు, విరుల గుభాళింపులు, అందమైన సరస్సులు, చల్లదనాన్ని పంచే శీతల పవనాలు సందర్శకులను అక్కడినుంచి కదలనివ్వవు.

ఆహ్లాదకర ప్రకృతి నడుమ... ఉబ్బలమడగు

పెద్దగా పేరు లేకున్నా రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఎన్నో సుందర జలపాతాలున్నాయి. మిగిలిన జిల్లాల మాట అటుంచి ఒక్క చిత్తూరు జిల్లాలోనే జలపాతాలతో కూడిన ఎన్నో సుందర పర్వతప్రాంతాలు పర్యాటకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. కొంచెం శ్రమ, కాస్త ఓపికను వెచ్చించగల్గితే ఈ సుందర ప్రదేశాలను దర్శించి ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఇలా చెప్పుకుంటే చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సుందర జలపాతం గురించి చెప్పవచ్చు. శ్రీకాళహస్తి-చెన్నై మార్గమధ్యంలోని మండల కేంద్రమైన వరదయ్యపాళెం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండలనడుమ ఉన్న ఈ జలపాతం పేరు ఉబ్బలమడుగు. ఈ జలపాతాన్నే తడ జలపాతం అని కూడా అంటారు. ఈ జలపాతాన్ని సందర్శించడానికి పలు మార్గాలు ఉన్నా వరదయ్యపాళెం మీదనుంచి మాత్రమే వాహనాలు వెళ్లగలిగే రోడ్డు సౌకర్యం ఉంది. అందుకే పర్యాటకులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

Ubbalamadugu_Waterfallsఎత్తైన పర్వతశ్రేణిలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే కొండల పాదప్రాంత ప్రదేశం నుంచి కొంచెం దూరం గుట్టలమీదుగా నడవాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న అడవి, పైన ఉన్న జలపాతం నుంచే పారే సెలయేటి గలగ లలు, పక్షుల కిలకిలారావాలు, నగర కాలుష్యానికి దూరంగా నిర్మలమైన ప్రశాంతత వెరసి ప్రకృతిమాత ఒడిలో ఓ రోజంతా సేద తీరడానికి ఇదో చక్కని ప్రదేశంగా చెప్పవచ్చు. ఉబ్బలమడగు ప్రదేశంలో అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న సరసు పర్యాటకులకు దర్శనమిస్తుంది. ఈ సరస్సు దగ్గరినుంచే దట్టమైన అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. కొండల మీదుగా జలపాతం దగ్గరకు వెళ్లలేని పర్యటకులు ఈ సరస్సు వద్దే జలకాలాడి ఇక్కడే సేదతీరుతారు.

అయితే జలపాతాన్ని సందర్శించాలంటే మాత్రం గుట్టలమీదుగా దాదాపురెండు, మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ఈ దారిలో ప్రయాణం కాస్త శ్రమతో కూడుకున్నదే. ఎందుకంటే పెద్దవిగా ఉన్న ఈ బండలమీదకు గెంతుతూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా శ్రమకోర్చి కొండ సగభాగానికి చేరుకుంటే అక్కడ గలగల శబ్ధంతో జాలువారే సుందర జలపాతం మనకు దర్శనమిస్తుంది. ఈ జలపాతం కింద పర్యాటకులు తనివితీరా జలకాలాడవచ్చు. ఈ జలపాతానికి చేరుకునే మార్గంలో మరో రెండు చోట్ల చిన్న తటాకాలు ఉన్నాయి. వీటిలో కూడా పర్యాటకులు చక్కగా జలకాలాడవచ్చు. దట్టమైన అడవిగుండా సాగే ఈ మార్గంలో జట్టుగా ప్రయాణించడం ఓ మర్చిపోలేని అనుభూతి.

వసతిసౌకర్యాలు...
ఉబ్బలమడుగు పూర్తిగా అటవీప్రాంతం కాబట్టి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. కొండలపీఠ భాగం దగ్గర ఓ శివుని విగ్రహాం ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ స్వామికి పూజలు చేస్తారు. పర్యాటకులకు ఏమి కావాలనుకున్నా వరదయ్యపాళెంలోనే తీసుకుని వెళ్లాల్సిందే. వరదయ్యపాళెం లోని ఆటోలులాంటి కొన్ని రకాల వాహనదారులు ఉబ్బలమడుగు వరకు రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్దంగా ఉంటారు.
అలాగే మరికొందరు పర్యాటకులు ద్విచక్ర వాహనాల్లో ఇక్కడకు చేరుకుంటారు. అయితే ఏ వాహనమైన కొండ పీఠభాగం వరకు మాత్రమే రాగలుగుతాయి.

Ubbalamaduguకాబట్టి జలపాతాన్ని చూడాలంటే మాత్రం అక్కడినుంచి కాలినడక తప్పదు. సాధారణ రోజుల్లో ఈ పరిస్ధితి ఉంటే శివరాత్రి పర్వదినాన దాదాపునాలుగురోజులు ఇక్కడ స్థానికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనివల్ల తాత్కాలికంగా కరెంటు సౌకర్యంతోపాటు కొన్ని అంగళ్లు సైతం ఇక్కడ వెలుస్తాయి. శివరాత్రికి రెండురోజులముందు కుటుంబంతో సహా ఇక్కడకు చేరుకునే స్థానికులు మూడురోజులు ఇక్కడే వంటావార్పు చేసుకుని ఉండడం ఈ ప్రాంత ప్రత్యేకత. అయితే సాధారణ దినాల్లో ఉబ్బలమడుగును సందర్శించే పర్యాటకులు చీకటిపడే సమయానికి వరదయ్యపాళెంకు చేరుకుంటారు. ఎందుకంటే దట్టమైన అటవీప్రాంతం కాబట్టి రాత్రిపూట ఇక్కడ ఉండడం కొంచెం ప్రమాదకరమే.

రవాణా సౌకర్యాలు...
ముందే చెప్పుకున్నట్టు వరదయ్యపాళెం చేరుకుంటే అక్కడినుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు చక్కని తారు రోడ్డు, ఆపై మరో నాలుగు కిలోమీటర్లు మేర మట్టిరోడ్డు ఉంది. దాదాపు అన్ని రకాల వాహనాలు ఈ మార్గం గుండా కొండల పీఠభాగాన ఉండే సరస్సు వరకు సులభంగా చేరుకుంటాయి. వారాంతాల్లో ఈ ప్రదేశానికి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ప్రదేశానికి బృందాలుగా వెళ్లడమే క్షేమకరం.

పోఖారా పోదాం.. సాహసాలు చేద్దాం

Davys-FallPokharaనేపాల్‌ వెళ్లినవారికి ఎప్పు డెప్పుడు వెళ్లి చూద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్నపూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది పోఖారా. ఇక్కడి మత్స్యపుత్స పర్వతం చూడటం ఒక వింతైన అనుభవం. చేపతోక రూపంలో ఆ శిఖరాలు కనిపిస్తాయి. వేకువ ఝామునే లేచి సూర్యోదయ కిరణాల వెలుగులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకించడం జీవితంలో మరువలేని అనుభవం.

సూర్యుని తొలికిరణాలకు వెలుగులు ప్రారంభించి, సమయంతో పెరిగే సూర్య కిరణాలకు తగిన రీతిలో వెలుగులను విరజిమ్మే ఆ శిఖరాలను దర్శించి అన్నపూర్ణ మాతకు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ ప్రదేశంలోని మిగిలిన ఆకర్షణలవైపు కళ్లు తిప్పగలం.ఇక్కడికి సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవల్లో విహరించ వచ్చు. ఎవరికివారు నడుపు కుంటూ వెళ్లేందుకు వీలున్న పడవలున్నాయి. పర్వతాల మధ్య ఉన్న ఆ సరస్సులో ప్రశాంత జలాలమీద నెమ్మదిగా సాగే పడవ ప్రయాణం ఎంతో బావుంటుంది. సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ పర్వత సముదాయాన్ని తిలకించిన వారికి సూర్యాస్తమయ సమయంలో ఆ పర్వతాలు ఎలా కనిపిస్తాయో కదా అనే సందేహం కలుగుతుంది. ఆ మధురమైన అనుభవం కోసం శాంతి శిఖరం మీదికి వెళ్లి తీరాల్సిందే.

ప్రపంచశాంతి కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచులో ఉంటుంది. అక్కడ నిలబడి పడమరగా తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లుగా ఉండదు. ఈ అందమైన ప్రకృతిని పగలంతా కాంచినా తనివితీరని సూర్యుడు దిగాలుగా వెళ్లలేక వెళుతున్నాడా అనిపిస్తుంది. నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి దిగుతుంటే పర్వత చాయలు లోయలంతా కప్పుతాయి. అంతవరకు ఒక వెలుగు వెలిగిన ఆ ప్రాంతమంతా హఠాత్తుగా మేఘాలు కమ్మినట్టయి చీకటిగా అవుతుంది. పక్షులు అరుపులు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ మార్పును చూస్తూ పర్యాటకులు మౌనంలోకి వెళతారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.

fewa-lake-pokhara-nepalపోఖరాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. అది గుప్తేశ్వర మహాదేవుని నిలయం. దాదాపుగా 140 మీటర్ల పొడవున్న గుహ అది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆ గుహగుండా ప్రయాణం చేసి ఆవలకు చేరుకునేసరికి సరిగా ఎదురుగా పాల రంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. అది దేవీజలపాతం. హిమాలయాల నుండి జారిపడే అనేక జలపాతాలలో ఇది అందమైనది. సాహసకృత్యాలు చేయాలనుకునేవారికి పోఖారాన్‌ తగిన ప్రదేశం. ఇక్కడ అనేక రకాల సాహస క్రీడలు ఉన్నాయి. ఒకటి వేగంగా ప్రవహించే నది మధ్యలో రబ్బరు పడవ ప్రయాణం. దీనిని రివర్‌ రాఫ్టింగ్‌ అంటారు. సమీపంలోని తులసి నదిలో ఈ సౌకర్యం ఉంది. ఇది సాహసయాత్ర. రబ్బరు పడవను తెడ్డు వేసుకుంటూ, మునిగిపోకుండా నెట్టుకు రావడం సాహసం.

పేదవాడి కాశ్మీరం... హార్సిలీహిల్స్‌

పేదవాడి కాశ్మీరం... ఆంధ్ర ఊటిగా ప్రస్థిది చెందిన హర్సిలీ హిల్స్‌ ప్రకృతి అందాలతో పులకిస్తోంది. సముద్ర మట్టానికి తిరుమల క్షేత్రం కంటే ఎతె్తైన ప్రదేశంలో వుండడంతో ‘చల్లని వాతావరణం’ తన సొంత చేసుకొన్న హార్సిలీ కొండ ప్రముఖ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన ‘రిషివ్యాలి’కి ఆనుకొని వుండడం మరో ప్రత్యేకం. ఆంధ్రప్రదేశ్‌ , కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గవర్నర్‌ వేసవి విడిది కేంద్రంగా హార్సిలీ హిల్స్‌ గుర్తింపు పొందింది. ఆంధ్రరాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన ఏకైక వేసవి విడిదిగా ప్రత్యేక గుర్తింపు పొంది, నిత్యం హిరిత శోభితంగా హార్సీలీహిల్స్‌ ప్రఖ్యాతి గాంచింది.


roadsహార్సిలీహిల్స్‌ చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా, బి.కొత్తకోట మండలంలో వుంది. ఈ ప్రాంతం ప్రకృతి శోభను సంతరించుకొని, ప్రకృతిలోని కొత్తకొత్త అందాలతో మేఘాలతో సంతరించే అనుభూతితో, చల్లటి వాతవరణం, పచ్చదనంతో నిండి వుంటుంది. హార్సిలీహిల్స్‌ మదనపల్లె నుండి కదిరి వెళ్ళే ప్రధాన రహదారిలో కాండ్లమడుగు క్రాస్‌కు పది కొలోమీటర్ల దూరంలో వుంది. ఈ హిల్స్‌ పశ్చిమ కనుమల్లోని ఎతైన మూడో శిఖరంగా, తిరమల గిరుల కంటే 1200 అడుగుల ఎత్తున 4312 అడుగుల ఎత్తులో ఉన్నందున ఇక్కడ వాతావరణం అతి తక్కువ ఉష్ణోగ్రతతో కూడి వుంటుంది.

హిల్స్‌ రూట్‌ మ్యాప్‌...
చెనై్న నుండి చిత్తూరు మీదుగా మదనపల్లెకు చేరి హార్సిలీహిల్స్‌ చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి మదనపల్లె మీదుగా హార్సిలీ హిల్స్‌ చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి కదిరి మీదుగా నేషనల్‌ హైవేలోని అమరనారాయణపురం క్రాస్‌కు వచ్చి అక్కడి నుంచి పది కిలోమీటర్లు ఘాట్‌ రోడ్డులో ప్రయాణించి హిల్స్‌ చేరవచ్చు.

The-Viewబ్రిటీష్‌ దొరల పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్‌ రావత్‌ హార్సిలీ మదనపల్లిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి గుర్రంపై వెళుతూ మార్గమధ్యంలో ఈ కొండపైకి చేరుకున్నాడు. ఇక్కడి వాతారణానికి ముగ్దుడై అమితంగా అకర్షితుడయ్యాడు. కొండపై బంగ్లా నిర్మించి బస చేయడంతో ఆయన పేరు మీద ఏగుగు మల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవడం ఆరంభించారు.

ఇదీ కథ...
హార్సిలీహిల్స్‌ను గతంలో ఇక్కడి ప్రజలు ఏనుగు మల్లమ్మగా పిలిచేవారు. బ్రిటీష్‌ దొరల పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్‌ రావత్‌ హార్సిలీ మదనపల్లిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి గుర్రంపై వెళుతూ మార్గమధ్యంలో ఈ కొండపైకి చేరుకున్నాడు. ఇక్కడి వాతారణానికి ముగ్దుడై అమితంగా అకర్షితుడయ్యాడు. కొండపై బంగ్లా నిర్మించి బస చేయడంతో ఆయన పేరు మీద ఏగుగు మల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవడం ఆరంభించారు. హిల్స్‌లో సర్‌ హార్సిలీకి ఒక కొడుకు జన్మించి ఆదే రోజు మృతి చెందడంతో అక్కడ జూనియర్‌ హార్సిలీ పేరిట సమాధిని, అలాగే తన పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో కుక్క సమాధిని నిర్మించారు.

సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో వున్న హార్సిలీహిల్స్‌ ప్రకృతి ప్రసాదించిన అందాలకు మెరుగులు దిద్దుతూ తమిళనాడులోని ఊటిని మైమరిపించే విధంగా వుంటుంది. ఇలాంటి ప్రకృతి అందచందాలు కలిగిన హార్సిలీహిల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ అభివృద్ధి పనులను చేపట్టింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కర్నాటక, తమిళనాడు పర్యాటకులు ఇక్కడికి విశేషంగా వస్తుంటారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం శాఖ కోట్లాది రూపాయల ఖర్చుతో ఆధునాతన సౌకర్యాలు కల్పించింది. అతిథి గృహాలు, భోజన ప్రియుల కోసం పున్నమి రెస్టారెంట్‌, మద్యం ప్రియుల కోసం బార్‌, పిల్లలు కోసం విశాలమైన ఆటస్థలం తదితర వసుతులు ఇక్కడ వున్నాయి. దేశంలోనే ఏ ప్రదేశం నుండైనా హిల్స్‌లోని అతిథి గృహాలను బుకింగ్‌ చేసుకొనుటకు ఆన్‌లైన్‌ సౌకర్యం వుంది.

ఏన్నో ఆకర్షణలు...
హిల్స్‌లోని చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిలరావాలు, దట్టమైన అడవుల సోయగాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌ పార్క్‌, స్విమ్మింగ్‌ సెంటర్‌, మసాజ్‌ సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ వారు ఇక్కడ జంతు ప్రదర్శనశాలలో వివిధ రకాల కోతులు, ఆఫ్రికన్‌ పక్షులు, చిలుకలు, గిన్యా పందులు, గుడ్డగూబలు తదితర లైబ్రరీ, వివిధ జంతువుల బొమ్మలు, వాటిపైన డాక్యుమెంటరీలు వున్నాయి. ట్రైక్కింగ్‌ సదుపాయం కలదు. హార్సిలీహిల్స్‌ గల గాలికొండ, మైక్రోవేవ్‌ రెసివర్‌ స్థలాలు, ప్యూవ్‌ పాయింట్‌ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

Swim2వీటితో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యంతో కూడిన ఏనుగుమల్లమ్మ గుడి ప్రశస్త్యమైంది. ఈ గుడిలో ప్రతి యేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. స్థానిక అటవీశాఖ అతిథి గృహం వున్న 176 సంవత్సరాల వయస్సు గల సర్‌రావత్‌ హార్సిలీ నాటిన నీలగిరి చెట్టు నేడు అతిపెద్ద చెట్టుగా ఎదిగి మహావృక్ష పురస్కారాన్ని పొందింది. అలాగే అటవీశాఖ అతిథి గృహం ప్రక్కన ఒక అశ్చర్యకరమైన వింత చోటు చేసుకొని వున్నది. అక్కడ వున్న రెండు ఎర్రపురాయి చెట్లకొమ్మలు పైకి ఎదిగి ఒకే కొమ్మగా రూపాంతరం చెందడం వింతగా చెప్పవచ్చు. చరిత్రలో రావి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మలు కలసిన దాఖాలాలు వున్నాయి. కానీ ఎర్రపురాయి చెట్లు కలవడం ఇదే మొదటిసారి అని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాలినడకన వెళ్ళేదారిలో మానసగంగోత్రి వద్ద నీలిగిరి చెట్లు సైతం రెండు కొమ్మలుగా పైకిపోయి ఒకే కొమ్మగా కలిశాయి. ఇవన్నీ వెరసి ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

అతిథి గృహాలు...
ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ అధికారులకు మాత్రమే వసతి కల్పించి, మిల్క్‌ హౌస్‌లతో పాటు హార్సిలీ, పింఛా, కౌండిన్యా, మాండవి, బహుదా, కళ్యాణి తదితర అతిథి గృహాలు కలవు. అద్దె రోజుకు రూ. 300 వసూలు చేస్తారు. పర్యాటక శాఖ అతిథిగృహాలు ఒక్కొక్కరికి రూ. 100లతో డెర్మెటరీ వసతి, స్పెషల్‌ కాటేజీ రూ. 600, డబుల్‌ కాటేజి రూ. 1000, ఎన్‌జిఓ బ్లాక్‌ రూ. 840, ఎబాక్ల్‌ 1. రూ. 2000. అలాగే హాలిడే హోమ్‌లో 12 అతిథి గృహాలున్నాయి. అద్దె రోజుకు రూ. 300 నుండి రూ. 700 వరకు పరిస్థితులను బట్టి వసూలు చేస్తారు. ఇవికాక పోలీసు, రైల్వే, రెవెన్యూ, కర్నాటక గెస్ట్‌హోస్‌, అభిరామ్‌ రిసార్ట్స్‌ తదితర అతిథి గృహాలు కలవు.

ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్‌

ఆకాశాన్ని తాకే ఎత్తైన శిఖరాగ్రాలు. ఎటు చూసినా కనుచూపు మేర కొండలు, పచ్చదనం. దీని నడుమ బోట్‌ రైడింగ్‌, గుర్రపు స్వారీ... ఊహించుకుంటేనే చాలా బావుంది కదూ. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి సౌందర్యం మనసును లాగుతుంటుంది. అలాంటిదే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌. ఈ రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఉన్న సహ్యాద్రి కొండలలో మహాబలేశ్వర్‌ కొండలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం ఉన్న మహాదేవుని ఆలయ వైభవంతోనే దీనికి ఈ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. పరమ శివుని పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రదేశం వేసవి తాపాన్నుంచి తప్పించుకోవడానికి చక్కని మార్గమని చెప్పవచ్చు.

Pratapgadమన దేశం బ్రిటీష్‌ పాలనలో ఉన్న సమయంలో అప్పటి జనరల్‌ సర్‌ పీటర్‌ లాడ్‌విక్‌ 1824 ఏప్రిల్‌ నెలలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వేసవి వేడిని తట్టుకునేందుకు ఆయన సతారా జిల్లాలో బసచేసినట్టు స్థానికులు చెబుతుంటారు. లాడ్‌విక్‌ ఈ కొండలను ట్రెక్కింగ్‌ ద్వారా అధిరోహించడంతో దీనికి లాడ్‌విక్‌ పాయింట్‌ అని పేరు వచ్చింది. క్రమంగా ఇది మహాబలేశ్వర్‌గా వెలుగులోకి వచ్చింది. దుస్తుల దగ్గర నుంచీ, చెప్పుల వరకు అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. రకరకాల తేనె, జామ్‌లకు మధు సాగర్‌ పేరొందిన సంస్థ కావడంతో ఇక్కడి నుంచి పర్యాటకులు వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తారు. ఈ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండటం చేత అన్ని కాలాల్లోనూ ఇక్కడికి చేరుకోలేము.

ముస్లిం సంసృ్కతికి అద్దంపట్టే... ముర్షీదాబాద్‌

Imambaraఆంగ్లేయులకాలంలో ముస్లిం రాజుల రాజధానిగా వెలుగొందింది ముర్షీదాబాద్‌. బెంగాల్‌ను పాలించిన నవాబు సిరాజుద్దౌలా రాజధాని నగరం ఇది. ముస్లింల పాలనాకాలంలో ఈ ప్రాంతంలో అనేక కట్టడాలను ఇక్కడ నిర్మించారు. భాగీరథి నది ఒడ్డున ముర్షీదాబాద్‌ ఈ నగరం భారత చరిత్రను మలుపుతిప్పిన అనేక అంశాలకు వేదిక. ఈ ప్రాంతం నుంచి అప్పట్లో కోల్‌కతా నౌకాశ్రయం ద్వారా వర్తకం జరిగేది. ముర్షీద్‌ ఖులీ ఖాన్‌ నవాబు పేరిట ఈ నగరానికి ముర్షీదాబాద్‌ అనే పేరు వచ్చింది. సుబే బంగ్లాకు రాజధాని ఈ నగరం. సుబే బంగ్లా అంటే బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సాలతో కూడిన ప్రాంతం. ప్లాసీ యుద్ధం తర్వాత ఆంగ్లేయులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో ఇక్కడ చాలా ఏళ్లు స్థావరాలు ఏర్పాటుచేసుకుని నివశించారు.

చరిత్రలో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడ బౌద్ధం, బ్రాహ్మణం, వైష్ణవం, జైన, ఇస్లాం, క్రైస్తవ మతాలు
ఇక్కడ విలసిల్లాయి. ఐరోపాకు చెందిన డచ్‌, బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, ఆర్మేనియన్లు ముర్షీదాబాద్‌లో నివశించారు.
బ్రిటీష్‌ వారి హయాంలో 1717లో బెంగాల్‌ ప్రావిన్స్‌కు రాజధానిగా ముర్షీదాబాద్‌ ఉండేది. ప్లాసీ యుద్ధం తర్వాత అంటే 1773లో రాజధానిని కోల్‌కతాకు బ్రిటీష్‌ వారు మార్చారు.

చూడవలసిన ప్రాంతాలు హజార్‌దువారీ
శాస్ర్తీయమైన వాస్తుకళతో హజార్‌దువారీని నిర్మించారు. హజార్‌దువారీ అంటే వేయి తలపులు భవంతి. ఈ భవంతిని నవాబ్‌ నజీమ్‌ కోసం 1837లో డంకన్‌ మెక్‌లాడ్‌ నిర్మించారు. హజార్‌దువారీ భవంతిలో ప్రస్తుతం వస్తు ప్రద ర్శన శాల ఉంది. ఇందులో అనేక కళాఖండాలను భద్రపరిచారు. హజార్‌దువారీ భవంతిలో 114 గదులు ఉన్నాయి. ఈ భవంతిని 41 ఎక రాల సువిశాల స్థలంలో నిర్మించారు. ఇదే భవంతిలో గ్రంధాలయం కూడా ఉంది. ఈ భవంతి పరిసరాల్లో మదీనా అనే మసీదు, వాసెఫ్‌ మంజిల్‌, త్రిపోలియా గేట్‌, దక్షిణ దర్వాజా, ఛాక్‌ దర్వాజాలు ఉన్నాయి.

ఇమాంబారా
HazarDuariహజార్‌దువారీ భవంతికి ఉత్తరంగా ఇమాంబారాను 1847లో నవాబు మన్సూర్‌ ఆలీ ఖాన్‌ నిర్మించారు. దీని నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.6 లక్షలు వ్యయం అయిందట. ఆ తర్వాత కాలంలో సిరాజుద్దౌలా దీనిని తగులబెట్టాడు. బెంగాల్‌ ప్రాంతంలో అతిపెద్ద ఇమాంబారా ఇది ఒక్కటే. ముర్షీదాబాద్‌ సమీపంలో కథ్‌గోలా వద్ద జైన్‌ పార్శ్వనాథ్‌ దేవాలయం, బారన్‌గోర్‌ వద్ద 18వ శతాబ్దంలో రాణి భవానిచే నిర్మించిన ఛార్‌ బంగ్లా దేవాలయం, భవానీశ్వర్‌ దేవాలయం ఉన్నాయి.
వసతి: పశ్చిమ బెంగాల్‌ పర్యాటక సంస్థకు చెందగిన హోటళ్లతో పాటుగా ఇతర వసతి సదుపాయం ఉంది.

ఎలా చేరుకోవాలి:
విమాన మార్గం: కోల్‌కతా (221 కి.మీ.) సమీపంలో విమానాశ్రయం.
రైలు మార్గం: కోల్‌కతాలోని హౌరా, సీల్డాల నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది.
రహదారి మార్గం: కోల్‌కతా నుంచి 221 కి.మీ. దూరంలో ముర్షీదాబాద్‌ ఉంది.

రాయులును తిప్పలు పెట్టిన రాజుల కోట

కృష్ణాజిల్లా విజయవాడకు సమీపంలో అలనాటి వైభవానికి చిహ్నంగా చిత్రంగా నిలుస్తోంది కొండపల్లి కోట. ఘనచరిత్రను చాటిచెబుతున్న ఆ ఆనవాళ్లను చూద్దామని బయల్దేరిన మేము ఐదవనెంబరు జాతీయ రహదారినుంచి కొండకు వెళ్లే మార్గంలోకి వచ్చాం. రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు. మధ్యలో పూచిన లతలు. సన్ననిగాలి. నగరంలో నలిగిపోతున్న మాకు ఇవన్నీ మరోలోకంలో విహరించేలా చేశారుు. పుంజుకున్న శక్తితో కొండ ఎక్కాం. చరిత్రలో మలుపులు మాదిరిగానే కొండ ఎక్కడానికి కూడా ఎన్నో మలుపులున్నారుు. పైకి చేరుకున్నాక.....నీలిరంగు చీర కట్టుకున్నట్లుగా విజయవాడ నగరం నిగనిగలాడుతూంటే చూడముచ్చటేసింది. కనుచూపు మేర ఎవరు వచ్చినా కొండపైనుంచి చూడొచ్చు. అలనాటి రాజుల వైభవం, అక్కడి ఏర్పాట్లు చూస్తే మతిపోరుుంది. సముద్రమట్టానికి అంత ఎత్తున ఇన్ని ఏర్పాట్లు ఎలా చేశారా అనిపిస్తుంది.అలనాటి రాజులదీక్షాదక్షతలకు ఈ కోట ఓ సాక్ష్యంగా నిలిచింది.

Copy-of-VJAఎవరక్కడ...చప్పట్ల శబ్దం...
పరుగున వచ్చిన పరిచారకులు...
ఆ వెనుకే సైనికుల కవాతు...
ఠీవిగా వచ్చిన రాజు....
ప్రజల సమస్యలపై చర్చ...
పరిష్కార సూచన....
ఇది....ప్రజాదర్బారులోని సన్నివేశం
.....
రాణివాసం.... పూలపరిమళం...
పూదోటలు.... జలకాలాటలు....
కొలనులు...పిల్లగాలులు....
కత్తులు దూయండి....చురకత్తులుగా మారండి...
కఠోర శిక్షణతో రాటుదేలండి.
మందుగుండు దట్టించండి...
శత్రువుల గుండెల్లో ఫిరంగిగుండు పేల్చండి...
ఇది ఒక సుశిక్షిత సైని కేంద్రంలో
బ్రిటిష్‌ సైనికుల కదలికల కథ....
చిమ్మచీకటి....
ఏకశిలాగృహం...
VJA-23సన్నని రంధ్రం....
అందులోంచి పోటీపడుతూ వచ్చే గాలి....వెలుతురు....
లోపల బందీలు....
తప్పించుకునే వీలులేని బందిఖానా..
నేరగాళ్లకు వణుకు పుట్టించే చెరసాల...
గజ, అశ్వ, పదాతి దళాల కవాతుకు
ప్రత్యేక రహదార్లు....
సంపదతో తులతూగే ఖజనా...
శత్రువులను దూరం నుంచే గమనించేందుకు బురుజులు...
ఇవన్నీ....ఒకేచోట....
సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తున....
ఠీవిగా నిలబడిన ఓ కొండపై...
కొలువైనాయి.
అదే...కొండపల్లి....కోట.
ఈ కోటను కైవశం చేసుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలంతటి యోధుడికి రెండునెలలు పట్టిందంటే... తమాషాకాదు.
అందుకే....
దానిగొప్పదనం
తెలుసుకోవాల్సిందే.

చరిత్ర
VJA-12క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అన వేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టారు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్‌ ముల్మ్‌ పాలనలో మంత్రి గవాన్‌ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్‌ షా కాలం లో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో విజయనగర రాజైన శ్రీ కృష్ణదే వరాయులు ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

అనంతరం గోల్కొండ ప్రభువైన కులీ కుతు బ్‌షా ఈ కోటను ఆక్రమించినట్లు తదు పరి ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై ఇబ్రహీంపట్నం గ్రామం నిర్మిం చినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపా యాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్‌ చక్రవర్తి ఔరం గజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్‌జంగ్‌ పరిపాలించారు.

క్రీశ1766లో జనరల్‌ కాలియేడ్‌ కోటను ఆక్రమించి కెప్టెన్‌ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు కలవు. చివరగా కీశ 1767లో బ్రిటీష్‌ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలో కలుపుకుని తమ సిపాయిలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.

కోటలో విశేషాలు
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజ్‌మహల్‌ గోడలపై ఉన్న కళాఖండాలను, నాటిని తీర్చిదిద్దిన కళాకారుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం... దర్బారు నిర్వహించే రాజమహల్‌, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్‌, అబ్బురపరిచే నర్తనశాల నిర్మాణం, నేటి రైతు బజార్‌లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం... ఇదంతా ఒక కొండపైనే ఉన్నాయి. అప్పటి రాజుల ముందుచూపు, ప్రజల భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం, వ్యూహం....ఇవన్నీ ఆ కోట నిర్మాణం వెనుక రహస్యాలు. వీటిని చూశాక....శ్రమైనా....ఆ కొండపల్లి కొండ ఎక్కాలని, కోటలోని రహస్యాలను చూడాలని తెలిసినవారికి చెప్పాలనిపించింది. అందుకే మీముందుకు ఈ కథనం.

ఇలా వెళ్లాలి
vihariకోల్‌కతా-చెనై్న 5వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడనుంచి 8 కి.మీ.లు ప్రయాణిస్తే కొండపల్లివస్తుంది.విజయవాడ నుంచి వచ్చేవారు ఇబ్రహీంపట్నం దాటాక నిమ్రా కాలేజీ స్టాప్‌ దిగి.. అక్కడి నుంచి 8 కి.మీ. ఆటోలో వెళ్లాలి.హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు కంచికచర్ల దాటాక నిమ్రా కాలేజీ స్టాప్‌వద్ద దిగి వెళ్లవచ్చు.

టిక్కెట్‌ ధర
కోటను సందర్శించాలనుకునే వారు పెద్దలైతే రూ.5, పిల్లలకు రూ.3
ఫొటోలు తీసుకోదలచిన వారికి రూ.20
వీడియో తీసుకోవాల్సివారు రూ.100 పురావస్తుశాఖకు చెల్లించి
టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది.
సందర్శన వేళలు : ఉ.10.30 నుంచి సా.5గం. వరకు

వైఎస్‌ హయాంలో....
ఏళ్లతరబడి ఎవరూ పట్టించుకోకపోవడం, పురావస్తుశాఖలో శ్రద్ధ లేకపోవడంతో కొండపల్లి ఘనత పెద్దగా వెలుగులోకి రాలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2009లో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ కొండపల్లికి కొత్తకళ వచ్చింది. వైఎస్‌ నిధులు విడుదల చేయడ‚ంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్‌, ఆయా ప్రాంతాలను తెలిపే సూచికలు, బోర్డులను ఏర్పాటు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు విస్తారంగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్య రంగంలో వివిధ రోగాలను తగ్గించేందుకు తయారు చేస్తున్న మందుల్లో ఈ ప్రాంతంలో ఔషధ మొక్కలు ప్రధానపాత్ర వహిస్తాయి. కొండపల్లి కోట, అక్కడి నిర్మాణాలు దెబ్బతినకుండా, వాటి ప్రాశస్త్యం చెక్కుచెదరకుండా, పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేపనిలో ‘ఉడా’ ప్రస్తుతం నిమగ్నమైంది.