Total Pageviews

Monday, 19 September 2011

సర్వమత సంగమం... గోరఖ్‌పూర్‌

Gorakhnath_Temple_Gorakhpur
ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ ప్రాంతమైన గోరఖ్‌పూర్‌ సర్వమతాలకు నిలయం. నేపాల్‌ సరిహద్దు ప్రాంతం లో ఉండటంవల్ల ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించిన రప్తి నది ఒడ్డున ఉంది గోరఖ్‌పూర్‌. భారత స్వాతంత్య్రోద్యమ సమయంలో వివిధ ఘట్టాలకు నిలయం గోరఖ్‌పూర్‌.గోరఖ్‌పూర్‌ ప్రాంతాన్ని సూర్యవంశ రాజులు పరిపాలించారు. వీరి రాజధాని అయోధ్య. ఆ తర్వాత కాలంలో ఇది కోసల సామ్రాజ్యంగా పిలిచేవారు. క్రీస్తు పూర్వం ఆరో దశాబ్దంలోని 16 మహాజనపదాల్లో ఒకటి కోశల. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు, జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఇక్కడే తిరగాడని అంటారు. మౌర్యులు, శుంగ, కుషాణ, గుప్త, హర్ష సామ్రాజ్యా కాలంలో విరాజిల్లింది గోరఖ్‌పూర్‌.

గోరఖ్‌నాథ్‌ దేవాలయం...
గోరఖ్‌నాథ్‌ 12వ శతాబ్ది నాటి శైవ మత యోగి. ఈయన పేరు మీద నిర్మించినది గోరఖ్‌నాథ్‌ దేవాలయం. సంక్రాం తికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. నేపాల్‌ రాజు కూడా ఈ సమయంలో ఇక్కడి వచ్చి వెళతారని స్థానికులు అంటుంటారు. గోరఖ్‌పూర్‌ నుంచి 4కి.మీ. దూరంలో నేపాల్‌ రోడ్‌లో గోపాల్‌నాథ్‌ దేవాలయం ఉంది.

విష్ణు దేవాలయం...
శ్రీ మహావిష్ణువు నల్లరాతి స్వరూపం ఉన్న దేవాలయం ఇది. 12వ శతాబ్దానికి చెందిన పాల రాజులు ఈ దేవా లయాన్ని కట్టించారని అంటారు. దసరా సమయంలో రామలీలా ఉత్సవాలు ఎంతో ఆర్భాటంగా జరుగుతాయి.

గీతా ప్రెస్‌...
గోరఖ్‌పూర్‌లోని రెట్టీ చౌక్‌లో హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలను ముద్రించే గీతా ప్రెస్‌ ఉంది. ఇక్కడ శ్రీమద్‌ భాగ వతాన్ని పాలరాతి రాళ్లపై చెక్కారు. సాకేత రాముడు, శ్రీకృష్ణ లీలల చిత్రాలు ఉన్నాయి. రసూల్‌ పూర్‌, గోరఖ్‌ నాథ్‌ లోని జామా మసీదు, రేతి రోడ్‌లో మదీనా మసీదు, బుద్ధుని మ్యూజియం ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: గోరఖ్‌పూర్‌ 6కి.మీ. దూరంలో విమానా శ్రయం ఉంది. జెట్‌లైట్‌ విమానంలో వెళ్ళవచ్చు.

రైలు మార్గం: గోరఖ్‌పూర్‌ ప్రధాన రైల్వే జంక్షన్‌. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్ళు వెళ్తాయి.

రోడ్డుమార్గం: గోరఖ్‌పూర్‌ మీదుగా జాతీయ రహదారి నెం. 28,29 వెళుతున్నాయి. లక్నో 276కి.మీ. వారణాసి 23 1 కి.మీ., అలహాబాద్‌339 కి.మీ. దూరంలో ఉన్నాయి.

No comments:

Post a Comment