సిద్ధిబుద్ధి వినాయకుడు, ఏకదంతుడు, లక్ష్మీగణపతిగా అందరికీ తెలిసిన వినాయకుడు సంపదలు కూడా ఇస్తానని చెప్పేందుకు వెలసిన అవతారమే సంపత్ వినాయగర్. విశాఖపట్నం జనమేగాక అనునిత్యం చుట్టుపక్కల ప్రాంతాలనుంచి అశేషంగా భక్తజనం వచ్చి స్వామివారిని కొలుచుకుంటుంటారు. అభిషేక ప్రియుడైన ఆ గజాననుడికి కోరిలు తెలియజేసు కుంటుంటారు. భక్తుల కొంగుబంగారంగా స్వామి విరాజిల్లుతున్నారు.
విశాఖ నగర నడిబొడ్డున వెలసిన శ్రీసంపత్ వినాయగర్ స్వామి భక్తుల నుండి అశేష పూజులందు కుంటున్నారు. ధూప దీప నైవేద్యాలతో, నిత్యపూజల తో ఆలయం కళకళలాడుతోంది. అభిషేక, అలంకారాలకు శ్రీసంపత్ వినా యగర్ స్వామి దేవాలయం ఏకైక ప్రత్యేకత. నగరంలో గణనాధుని ఆలయల్లో ప్రత్యేకత చాటుకున్న దేవాలయం శ్రీసంపత్ వినాయగర్ దేవాలయం. భక్తుల పాప ప్రక్షాళనతో పాటు కొర్కేలు తీర్చే ప్రభువుగా గణనాధుడు ప్రసిద్ధికెక్కారు.
చరిత్ర ఎంతో ఘనం...
నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ (ఆశీలుమెట్ట) సమీపంలో... 1962లో ‘మెసర్స్ ఎస్‌జి సంబంధన్ అండ్ కో’ ఆవరణంలో స్వర్గీయ ఎస్‌జి సంబంధన్, టిఎస్ సెల్వగణేశన్, టి.ఎస్ రాజేశ్వరన్ కుటుంబ సభ్యులు శ్రీ సంప త్ వినాయగర్ స్వామివారి దేవాలయాన్ని స్థాపించారు. దేవాలయం స్థాపించిన కొత్తలో సమీప జాలర్లు ప్రతిరోజు స్వామిని అర్చించి, నమస్కరించి వారి వృత్తిని మొదలుపెట్టేవా రు. ఐదు సంవత్సరాలు తరు వాత కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వహస్తాలతో ‘గణపతి యంత్రం’ స్థాపించారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో విశాఖను రక్షించమని శ్రీసంపత్ వినాయగర్ స్వామిని వేడుకున్నట్టు చరిత్ర చెబుతోంది.
సముద్రంలో ఘాజి అనే వారు సబ్‌మెరైన్‌పై విజయం సాధించిన సమయంలో విశాఖను రక్షించినందుకు ఈస్ట్రన్ నేవల్ కమాండర్ అడ్మిరల్ క్రిష్ణన్ 1001 కొబ్బరికాయలు కొట్టి స్వామిని వేడుకున్నారు. అప్పటి నుంచి దేవాలయం మరింత ప్రసిద్ధి చెందినట్టు పూర్వీకులు చెబుతుంటారు. భక్తులు కొనుగోలు చేసే నూతన వాహనాలు స్వామి ముందు వుంచి పూజలు చేయించుకుంటే, భవిష్యత్ ఎటువంటి ప్రమాదాలు సంభవించవని భక్తుల విశ్వాసం. ఈ సెంట్‌మెంటు గత 50 ఏళ్ళగా కొనసాగుతోందని ఆలయం అసిస్టెంట్ కమిషనర్ బి.మంజువాణి వివరించారు.
దత్తత దేవాలయం అభివృద్ధి...
శ్రీసంపత్ వినాయగర్ దేవాలయం నిధులతో అనుబంధంగా ఆనందపురం మండలం శోంఠ్యాంకు వెళ్లే మార్గంలో గండిగుండం గ్రామంలో శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయాన్ని స్థాపించారు. ఈ దేవాయలంలో కూడా ధూప దీప నైవేధ్యాలతో నిత్యపూ జలతో కళకళలాడుతోంది. ఆ దేవాలయం పరిధిలో ఆరు ఎకరాల స్థలంలో మూడు కోట్ల రూపాయలతో మొదటి విడతగా మూడు ఎకరాల స్థలంలో ‘వానప్రస్థ ఆశ్రమం’ (వృద్ధాశ్ర మం) నిర్మించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నామమాత్రపు రుసుంతో వానప్రస్థ ఆశ్రమం ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైంది.
No comments:
Post a Comment