Total Pageviews

Monday, 19 September 2011

విశ్వ విజ్ఞాన ‘తొలి’ వేదిక..

ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్త్రాలు ఎనలేని ఆదరణ చూరగొన్నాయి. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞాన ఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. బీహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దే శంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్నాయి.

nalanda-university-complexనేటి ఆధునిక గణిత, వైద్యశాస్త్ర పరిశోధనాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడే.. నలంద విశ్వవిద్యాలయం శస్త్ర విద్యలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంటి పొరలు, గర్భకోశం నుంచి మృతపిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. మానవులతోపాటు ఇక్కడ జంతువు లకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది. ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాలనుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు. 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు. బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరం లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం.

నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అ ని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టిం దే ‘నలంద’. అనగా జ్ఞానప్రదా యిని అని అర్థం. చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్‌ త్సాంగ్‌ నలంద పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్‌ త్సాంగ్‌ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే ‘నలంద’ అన్న పేరు వచ్చిందని వివరించాడు.

గౌతమ బుద్ధుని కాలములో నలంద...
Nalanda-sariputtaనలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం నలందను బారాగావ్‌ గ్రామంగా గుర్తించాడు. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట.

అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు. కేవత్త, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలం ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ సింహగర్జన చేశాడు. రాజగృహ నుండి నలందకు వెళ్ళే మార్గం అంబలత్తికా గుండా వెలుతుంది. అక్కడి నుండి ఆ మార్గం పాతాలీగామా వరకు వెళ్ళేది. రాజగృహకు, నలందకు మధ్యన బహుపుత్త చేతియ ఉన్నది.

Nalanda_Universityకేవత్త సుత్త ప్రకారం... బుద్ధుని కాలానికే నలంద ప్రాముఖ్యత కలిగి నిండు జ నాభాతో వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలాకాలానికి గానీ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. సమ్యుత్త నికాయలోని, ఒక రికార్డులో న లంద బుద్ధునికాలంలో తీవ్ర క్షామానికి గురైనదని నమోదు చేయబడినది. బు ద్ధుని కుడిభుజం వంటి ఆయన శిష్యుడైన సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు. నలంద, సొన్నదిన్న యొక్క నివాసస్థలం.

ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలం ద లో మహావీరుడు అనేక పర్యాయములు బసచే సి నాడని పేర్కొనబడినది. మహావీరుడు నలం దలో ఉన్నపవపురిలో మోక్షాన్ని పొం దినట్టుగా భావిస్తారు. (అదేకాక జైనమ తంలోని ఒక తెగ ప్రకారం, మహా వీరుడు నలంద సమీపాన ఉన్న కుందల్‌పూర్‌లో జన్మించాడు). అ శోకుడు క్రీస్తుపూర్వం 250లో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించా డని చెబుతారు. టిబెట్‌ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలంద వి శ్వవిద్యాలయములో బో దించాడు. చరిత్రకారుల ప్రకారం ఈ విశ్వవిద్యా లయం క్రీశ 1193 వరకు ఉన్నతస్థా యిలో వర్థిల్లింది. దీనికి ప్రధాన కారణం బౌద్ధచక్రవర్తులైన హర్షవర్ధనుడు వంటివారు. పాలివంశానికి చెందిన రాజుల ఆదరణే కారణం.

విశ్వవిద్యాలయ చరిత్ర...
Nalanda_Universitచారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది. నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది.

నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలంద విద్యార్ధులను, బొధకులను కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కి వంటి దేశాల నుండి ఆకర్షించింది. తాంగ్‌ వంశానికిచెందిన చైనా తీర్థ యత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ 7వ శతాబ్ధపు నలంద విశ్వ విద్యాలయం గురించి వివరాలు సంగ్రహపరిచాడు.

బౌద్ధమతంపై నలంద ప్రభావం...
9 - 12 వ శతాబ్దం మధ్యకాలంలో ప్రజ్వరిల్లిన టిబెటన్‌ బౌద్ధత్వం (వజ్రాయన) నలంద బోధకుల నుండి, సంప్రదాయాల నుండే ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, మరియు జపాన్‌లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. థెరవాడ బౌద్ధం కూడా నలందలో బోధించబడినది. కానీ థెరవాడ బౌద్ధానికి నలంద గట్టి కేంద్రం కాకపొవడం వల్ల, తరవాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.

పతనావస్థ...
Nalanda_seal1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్‌ ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు. 1235లో టిబెట్‌ అనువాదకుడు ఛాగ్‌ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. దండయాత్రల ప్రధాన మార్గంలో ఉన్న ఇక్కడి సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గంలో లేకపోవడం నలంద, బుద్ధగయ మిగిలాయని చెబుతారు. ప్రధాన మార్గంలో లేని, ఉత్తర బెంగాల్‌ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రం హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.

భారత విజ్ఞాన వినాశనం...
పర్షియన్‌ చరిత్రకారుడు మిన్నాజ్‌-ఈ-సిరాజ్‌ తన తబాకత్‌ - ఇ - నసిరీన్‌ అనే రచనలో నలంద విశ్వవిద్యాలయ నాశనాన్ని ఇలా వర్ణించాడు. ‘‘విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాదిమంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సజీవదహనం చేయబడ్డారు. మరికొన్ని వేలమంది తలలు తెగ నరకబడ్డాయి. బ్రహ్మాండమైన గ్రంథాలయం తగలబెట్టబడింది. అది కొన్ని నెలలు పాటు తగలబడింది. తగలబడుతున్న పుస్తకాల నుండి చెలరేగిన పొగ ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా కమ్ముకుంది’’ అని వివరించాడు. సందంట్లో సడేమియా అన్నట్లుగా ఈ విశ్వవిద్యాలయం వినాశనంలో హిందూ మతోన్మాదులు కూడా ఒక చేయి వేశారు.

శర్మ స్వామి అనే టిబెట్‌ యాత్రికుడు భక్తియార్‌ ఖిల్‌జీ దాడి తర్వాత మూడు దశాబ్దాలకు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగిన దుర్మార్గాన్ని వర్ణించాడు. దీని ప్రకారం ఖిల్‌జీ దాడి అనంతరం నెలకొని ఉన్న అరాచక వాతావరణంలో కొందరు హిందూ సన్యాసులు ఒక యజ్ఞాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తర్వాత యజ్ఞం తాలూకు నిప్పుల కట్టెలను వారు అన్నిచోట్లా విసిరేశారు. అవి మంటలను సృష్టించాయి. ఆ మంటల్లో అప్పటికీ మిగిలి ఉన్న రత్నబోధిలోని గ్రంథాలన్నీ తగలబడ్డాయి. ఆ తొమ్మిది అంతస్థుల భవనంలోని విజ్ఞాన భాండాగారం నాశనమైపోయింది. దీనితో నలంద విశ్వవిద్యాలయం, దానిలో విజ్ఞానశాస్త్ర భాండాగారం చరిత్రగర్భంలో కలిసిపోయాయి. ‘అహి’ అనే చరిత్రకారుని ప్రకారం, ‘‘నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా ప్రదేశాలు, గ్రంథాలయాల వినాశనం, ఖగోళశాస్త్రం, లెక్కలు, రసాయనిక శాస్త్ర, వైద్యశాస్త్రంలో భారతీయ శాస్ర్తీయ ఆలోచనా విధానం యొక్క వినాశనానికి మూలమని అంగీకరించక తప్పదు.

అవశేషాలే.. నేటి పర్యాటక కేంద్రాలు...
జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు.. ఆనాటి విజ్ఞానపు తాలూకు వాసనలు వెదజల్లుతూ.. ఇంకా మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉన్నది. పురాతత్వ శాఖ లెక్కల ప్రకారం.. అవశేషాలు 150,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్నవి. హువాన్‌ త్సాంగ్‌ యొక్క వర్ణన ప్రకారం నలంద విస్తృతిని, ఇప్పటి వరకు త్రవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పోల్చి అంచనా వేస్తే, ఇంకా 90% శాతం దాకా అవశేషాలు బయల్పడనట్టే. నలంద ఇప్పుడు నిర్వాసితము. ప్రస్తుతం ఇక్కడికి అతి చేరువలోని జనవాస ప్రదేశం బార్‌గాఁవ్‌ అనే గ్రామం. 1951లో నవ నలంద మహావిహార అనే ఒక ఆధునిక పాళీ, థెరవాడ బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడినది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్‌ ఇమేజింగ్‌ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలంద మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు, త్రవ్వకాలలో దొరికిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

పునరుద్ధరణ...
డిసెంబర్‌ 9, 2006న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 1 బిలయన్‌ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్న చోటను పునరుద్ధరించటానికి ఓ ప్రణాళికను వివరించింది. సింగపూర్‌ నేతృత్వంలో భారత్‌, జపాన్‌, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్‌ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్‌ డాలర్లు దానికి అవసరమయ్యే సదుపాలను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది

No comments:

Post a Comment