సప్తనదీ సంగమ ప్రాంతం... గోదావరీ తీరం... పచ్చని కొబ్బరిచెట్లు, వరిపొలాలు సోయగాల మధ్య అలరారే కోనసీమలో వెలిసిన అరుునవిల్లి శ్రీసిద్ధివినాయక ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత పొందింది. ప్రతీ శుభకార్యానికి ముందు అరుునవిల్లి సిద్ధివినాయకుని పూజిస్తే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అయినవిల్లి వినాయకునికి విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రసిద్ధి చెందారు. కోనసీమలో ఉద్యానవనాల మధ్య గౌతమీ, వృద్ధగౌతమీ గోదావరి పాయల సమీపంలో అయినవిల్లి సిద్ధివినాయకుని ఆలయం నెలకొంది.
ఆలయ చరిత్ర...
దక్షప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్ననాయకు డైన ఈ వినాయకుడిని పూజించి పునీతుడైనట్లు క్షేత్ర పురాణం తెలుపుతోంది. వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడైన వినాయకుని ప్రతిష్టించాడని మరొక కథ వ్యాప్తిలో ఉంది. స్వయంభు అయిన ఈ సిద్ధి ప్రి యుడు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే సిద్ధివినాయకుడిగా పేరొందారు. దక్షప్రజా పతి తలపెట్టిన యాగానికి కుమార్తె అయిన శచీదేవిని పిలువలేదు. అయినా శచీదేవి దక్షుడు తనను పిలవడం మరచెనని తలచి, పరమశివుడు వారించినా దక్షవాటికకు వెళ్లెను.
అక్కడ శచీదేవి తండ్రైన దక్షప్రజాపతి అవమానించగా, ఆమె శతీయాగం చేసెను. దీనితో శివుడు కాల ఉగ్రుడై జఠాధారి అయిన వీరభ ద్రునిచే దక్షయజ్ఞం నాశనం చేసెను. ‘ఆదో పూజ్యో గణాధిపా’ ముందుగా పూ జింపదగ్గ గణపతిని దక్షుడు పూజించకపోవడంతో దక్షయజ్ఞం భగ్నమైందని దక్షుడు తప్పు తెలుసుకుని, మరలా తిరిగి దక్షడు యజ్ఞానికి ముందు అయినవి ల్లి సిద్ధివినాయకున్ని పూజించి దక్షయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాడని ప్రతీతి.
అయినవిల్లి దేవస్థాన ప్రత్యేకత...
సువిశాలమైన ఆవరణలో, ఎతె్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాల యంలో క్షేత్రస్వామి శ్రీవిఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమి స్తాడు. సాధారణంగా ప్రతీ దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. అయి తే అయినవిల్లిలో సిద్ధివినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండ డం విశేషం. అంతేగాక ఈ గ్రామంలో దక్షిణ సింహాద్వారంతో నిర్మించిన గృహా లకు ఎటువంటి విఘ్నాలు కలుగవని, గృహాలు వృద్ధికరంగా ఉంటాయని స్థాని కుల ప్రగాఢ విశ్వాసం. రెండు గోపురాలు చూపరులను ఆకట్టుకునే సింహద్వా రాలతో అలరాడే విఘ్నేశ్వర దేవాలయ దర్శనం సందర్శకులను కట్టిపడేస్తుంది. క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవస్వామి ఆలయం, శివాలయం, శ్రీఅన్నపూర్ణాదేవి, శ్రీకాలభైరవస్వామి ఆలయాలు ఆలయప్రాంగణంలో నెలకొన్నాయి. శివకేశవులకు తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని పెద్దలు చెబుతారు.
పూజలు, పర్వదినాలు...
ఈ ఆలయంలో ప్రతీనెలా ఉభయ చవితి తిధులు, దశమి, ఏకాదశులలో, వినాయకచవితి పర్వదినాలలో సిద్ధివినాయకునికి విశేషార్చనలు జరుపుతారు. ప్రతి నిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం సమప్రాధికములుగా కొబ్బరికా యలు, పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఇక్కడకు వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మ్రొక్కుబడులు తీర్చుకొ నడం విశేషం. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని పెద్దల మాట. అయినవిల్లి సిద్ధివినాయకుని భక్తిశ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతోపాటు బుద్ధి వికసిస్తుందని ఉపవాచ.
ఎలా వెళ్లాలి?
ఈ క్షేత్రాన్ని సందర్శించాలంటే కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం నుండి 26 కి.మీ. ఉంటుంది. రాజమండ్రి నుండి వానపల్లి మీదుగా అయినవిల్లి 60 కి.మీ., కాకినాడ నుండి 65 కి.మీ., కాకినాడ నుండి కోటిపల్లి రేవు మీదుగా 45 కి.మీలు ఉంటుంది. భక్తులు రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రాన్ని సందర్శించవచ్చు.
No comments:
Post a Comment