Total Pageviews

Thursday, 31 May 2012

కరిగిపోయిన కాలం



గతం తలుపులు తెరుచుకుని జ్ఞాపకాల వీధుల్లో
ఒంటరి పక్షి లా తిరుగుతున్నాను.....

అప్పటి స్నేహితులని కలసుకోవాలని రేపటి లోకి ఆశ గా ఎదురు చూస్తున్నా...
నిజానికి..రేపటి పై ఆశ లేదు ..నిన్నటి ని చేరాలని ఆరాటం తప్ప...

నేటి గురించి ఆలోచన లేదు .. అప్పటి అనుభూతుల నెమరివేత తప్ప....

స్నేహం తోడుగా....,కాలం సాక్షిగా....

కరిగిపోయిన గతాన్ని అప్పుడప్పుడు గుండె గుప్పిళ్ళ నుండి
జారవిడిచి అపురూపం గా తరచి చూసుకుంటూ....

నిన్నని నేడుగా భావిస్తున్నాను...నేడు నిన్నలో జీవిస్తున్నాను

అయినా ఎందుకో మిత్రులారా .....
ఇప్పుడిలా మరణించి...అప్పటి నాలా...మళ్ళా జన్మించాలనివుంది!!!