Total Pageviews

Saturday, 26 May 2012

ఉగ్రవాది ఆవేదన

ఉగ్రవాది ఆవేదన ;;;
*************************


ఆమాయకుడైన నాపైన అభాండాలు వేసి సమాజం నన్ను కటకటాల వెనకకు పంపించింది.

దేశభక్తుడు అని అందరూ నన్ను అనాలని అనుకున్నా .. కాని దేశద్రోహిని అయ్యాను ...

దీపావళి పండగకు మా ఇంటి పెరట్లో సీమ టపాకాయలు కాల్చేవాన్ని --ఇప్పుడు ప్రపంచమంతటా బాంబులు పెడుతున్నా....
చిన్నప్పుడు తాతయ్య కళ్ళజోడు పగలగొట్టి తలుపు చాటు దాక్కునే వాడ్ని ...ఇప్పుడు బస్సుల అద్దాలు పగలగొడుతున్నా కటకటాల వెనక ఉంటున్నా ....

ఈ రంగుల లోకంలో నావన్నీ నల్లని అనుభవాలు......
కనుల కాగితం పై కలల కావ్యాలకి బదులు కన్నీటి చిత్రాలు...
వదిలి పోయిన సున్నిత త్వం...చేతులు కలిపిన కర్కశత్వం.....
నేను కాదనుకున్న కలివిడితనం....నన్ను కాదనుకున్న ఆనందం ....
నాలొని నన్ను చంపుకుంటూ ...నన్ను నేను మార్చుకుంటూ....
వెళ్ళాల్సిన తీరం కనిపించని దూరం లో గమ్యం........
నేనంటూ మిగిలి లేని,,,నాదంటూ ఏమిలేని..నాకంటూ ఎవరూ వుండకూడని జీవితం .....

మిత్రులారా ........
Crime research reports లో తెలిసినదేమంటే ఉగ్రవాదులుగా మారిన 85 శాతం వరకు మొదట అమాయకంగా వున్నవారెనటా .. ఎవరో చేసిన హత్యలు ,దొంగతనాలు డబ్బుల కొరకు ఆశపడి తమ తలపై వేసుకొని ఆ తరువాత అదే వృత్తిలో కొనసాగిపోయారట .... కాని తప్పు తప్పే .. శిక్ష పడాల్సిందే అనుకోండి ..

No comments:

Post a Comment