Total Pageviews

Saturday, 26 May 2012

అడవి పాట

అడవి పాట;;
*************


అడవికి పోయి చెట్లు పుట్టలు చూస్కుంట కమ్మని పాట పాడుకో బిడ్డా అని మా తాత చెప్పిండు.
సరే అని జెప్పి జంగలికి పోయి చెట్టు కింద కూసున్న . కాని చెట్టు చాటు నుంచి వచ్చిండ్రు అన్నల గుంపు.

ఏమిజేస్తున్నావు అన్నారు. గిట్ల కమ్మని పాట పాడమని ఇటు వచ్చిన అంటే .......చల్ మా ఎంబడి నీకు మా పెద్దన్న అడవి పాట నేర్పుతడన్రు.

ఇక ఆ పెద్దన్న నేర్పిన పాట

ఊళ్ళను నిద్రలేపే గొంగళి కప్పుకున్న పాట....
డప్పుమోతలు, ఏల పాటలు, వాగు ఉరవడులు
కలిసి కరిగిన జానపదుడి గజ్జెల పాట........
కొండకోనల్ని, రేల పాటలతో హోరెత్తించే అడవిపాట.....
గోరింక గొంతులో నల్లగా ఉరిమే చల్లటి వెన్నెల పాట ....

గొంగళి కప్పుకున్న ఓ అన్నా.... నీవు ఎంతైనా ముఖద్దర్ కా సికందర్ అన్నా ......

దోస్తుల్లారా .....

పెద్దన్న కప్పుకున్న గొంగళి సాక్షిగా చెబుతున్నా ....
నేను నేర్సుకున్న అడవి పాట కల్మషము లేని పాట ....
కళ్ళు మూసి పాడే పాట ...యుద్ధ శిబిరంలో ఒంటరి సైనికుడు చేసుకునే ఆత్మావలోకనం.
ప్రపంచపు బాధ ఎంచుకుని పంపిన రాయబారి ఆ పాట!

No comments:

Post a Comment