Total Pageviews

Saturday, 26 May 2012

దినచర్య

మనుమడి దినచర్య :::


చిన్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో తాతయ్య వాళ్ళ ఊరు వెళ్లి ఎన్నో ప్రశ్నలు అడిగి అన్ని తెలుసుకొని ఇప్పుడు జీవితంలో ఒక మనిషిగా స్తిరపడ్డాను ..

కాని ఈ ఉత్తరాల డబ్బాలు చూసినప్పుడల్లా తాతయ్య నాకు రాసిన ఉత్తరాలు గుర్తొస్తాయి ...
చాలా మంది అన్నారు ఒక్కసారి కనులు మూసుకుని జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!

కాని

కనులు మూస్తే తాతయ్య రూపం మాత్రమే కనిపిస్తుంది !!
అదే ఉత్తరాలు తెరిస్తే తాతయ్య మనసుని చూపిస్తాయి !!
అక్షరాల్లో దాగిన అనుభూతులని కళ్ళతో ఏరుకుంటూ.......
పాత అనుభవాలను కొత్తగా పరిచయం చేసుకుంటూ........
మడిచిన ఉత్తరాల్లో దాగిన ఎన్నో తీయని స్మృతులని
నెమరువేసుకుంటూ .........

ప్రతి ఉదయం ఒకొక్క కొత్త కలను సాకారం చేసుకునేందుకు ధైర్యం రావడానికి ఒక్కొక్క ఉత్తరం చదువుతాను ....

మిత్రులారా ...
కొత్త కలలను సాకారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ కొత్త ఉదయానికి స్వాగతం పలుకుదాం ..

No comments:

Post a Comment