అంతా యథాతధం ::(Everything is Normal)
************************** *****
మిగతా అంతా యథాతధం.
ఇక మిగిలింది నిన్ను నీవు వెతుక్కోవడమే............
నువ్వో అంకెగా మారకముందే -....
చిక్కుకున్నది 'సునామి'లోనో ,
తప్పిపోయింది ఏ సిద్ధాంతంలోనో,
తిరుగాడుతున్నది అభద్రపు ప్రేమలోనో,
అసలు నువ్వు ఎక్కడున్నావో నిన్నునీవు వెతుక్కో!........
వెతికి వెతికి చిట్టచివరన
ఏది దొరుకుతుందో అదే నువ్వు!-
ఇక చుట్టూతా పేరుకుపోయింది ఇప్పటిదాకా
వెంటేసుకు తిరుగుతున్న అబద్దం........
మిత్రమా ......
ఇది తప్ప మిగతా అంతా యధాతదం...
కొంత నిజం,చాలా అబద్దం ; కొంచెం నీవు, చాలా వరకు "నీవే కాని నువ్వు"!
**************************

No comments:
Post a Comment