రాష్ట్రంలోనే అత్యంత ఎతె్తైన కొండల నుంచి అడవులను చీల్చుకుంటూ ప్రకృతి రమణీయతనంతా తనలో ఇముడ్చుకొని.. కొండ కోనల నుంచి జాలు వారుతున్న అందాల జలపాతం కుంటాల. సహాజ సిద్దమైన.. దట్టమైన అడవులు, ఎతె్తైన రాళ్లను చీల్చుకుంటు దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి భీకర శబ్దంతో కిందికి జాలువారుతూ పర్యటకులను మంత్ర ముగ్దులను చేస్తుంటుంది కుంటాల జలపాతం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరడిగొండ మండల కేంద్రం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం కుడివైపు వెళ్తే అందమైన కుంటాల జలపాతం కనిపిస్తుంది.
సోమేశ్వరాలయం...
ఈ జలపాతానికి అతి దగ్గరలో సోమేశ్వరాయం ఉంది. మహ శివరాత్రి రోజున ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. కుంటాల జలపాతంలోని ఎతె్తైన.. నీళ్లు జాలువారే ప్రదేశ సమీపంలోనే ఉన్న గుహలో సోమేశ్వరుడు కొలువై భక్తుల మొక్కులు చెల్లిస్తున్నాడు. ప్రతియేట మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో వందలాది మంది శివభక్తులు వచ్చి.. అతి ప్రమాదమని తెలిసి కూడా గుహలో పూజలు చేసి తరించడం గమనార్హం. ఈ గుహ నుంచి ఇచ్చోడ ప్రాంతంలోని సిరిచెల్మ మల్లేశ్వర స్వామి ఆలయం వరకు సోరంగ మార్గం ఉందనే వాదన కూడా ఉంది. ఈ గుహను ప్రజలు సోమన్న గుహగా కూడా చెప్పుకుంటారు. ప్రకృతి సహాజ సిద్దమైన జలపాతంగా ఉన్న కుంటాలను రాష్ట్రప్రభుత్వం మరింత అభివృద్ధి పరచాల్సి ఉంది. రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది.
చారిత్రక విశేషం...
ఇలా వెళ్ళాలి...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉన్న నేరేడిగొండ అనే గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి బస్సు, రైలు సౌకర్యం కలదు. బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంటే హైదరాబాద్ - నాగపూర్ జాతీయ రహదారి మీదుగా నగర శివారులోని మేడ్చైఉ నుండి బయలుదేరి కామారెడ్డి, ఆర్మూర్, నిర్మైఉ (నిజామాబాద్ జిల్లా)ల మీదుగా కుంటా చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోంది. రైలు మార్గం గుండా వెళ్తే సికింద్రాబాద్ నుండి ఆదిలాబాద్ చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా కుంటాలా చేరుకోవచ్చు.
స్విమ్మింగ్ నిషేధం...
45 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే నీళ్ళు,ఆ చప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత పంక్తుల్లో గోదావరికి ఉపనది ఆయన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. జలపాతం దిగువభాగంలో సమతలంగా ఉన్న బండరాళ్ళు ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తున్నాయి. జలపాతం వద్ద ఉన్న లోయలు కూడా చాలా లోతుగా ఉండి నీళ్ళు సుళ్ళు తిరిగే దృశ్యం ముచ్చటగొలుపుతుంది. ఇక్కడ నీటిలో స్విమ్మింగ్ చేయడం నిషేధం. ఎందుకంటే ఎంతో లోతైన ఈ జలపాతంలో ఈదటం చాలా ప్రమాదకరం.
No comments:
Post a Comment