Total Pageviews

Monday 19 September 2011

రాయులును తిప్పలు పెట్టిన రాజుల కోట

కృష్ణాజిల్లా విజయవాడకు సమీపంలో అలనాటి వైభవానికి చిహ్నంగా చిత్రంగా నిలుస్తోంది కొండపల్లి కోట. ఘనచరిత్రను చాటిచెబుతున్న ఆ ఆనవాళ్లను చూద్దామని బయల్దేరిన మేము ఐదవనెంబరు జాతీయ రహదారినుంచి కొండకు వెళ్లే మార్గంలోకి వచ్చాం. రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు. మధ్యలో పూచిన లతలు. సన్ననిగాలి. నగరంలో నలిగిపోతున్న మాకు ఇవన్నీ మరోలోకంలో విహరించేలా చేశారుు. పుంజుకున్న శక్తితో కొండ ఎక్కాం. చరిత్రలో మలుపులు మాదిరిగానే కొండ ఎక్కడానికి కూడా ఎన్నో మలుపులున్నారుు. పైకి చేరుకున్నాక.....నీలిరంగు చీర కట్టుకున్నట్లుగా విజయవాడ నగరం నిగనిగలాడుతూంటే చూడముచ్చటేసింది. కనుచూపు మేర ఎవరు వచ్చినా కొండపైనుంచి చూడొచ్చు. అలనాటి రాజుల వైభవం, అక్కడి ఏర్పాట్లు చూస్తే మతిపోరుుంది. సముద్రమట్టానికి అంత ఎత్తున ఇన్ని ఏర్పాట్లు ఎలా చేశారా అనిపిస్తుంది.అలనాటి రాజులదీక్షాదక్షతలకు ఈ కోట ఓ సాక్ష్యంగా నిలిచింది.

Copy-of-VJAఎవరక్కడ...చప్పట్ల శబ్దం...
పరుగున వచ్చిన పరిచారకులు...
ఆ వెనుకే సైనికుల కవాతు...
ఠీవిగా వచ్చిన రాజు....
ప్రజల సమస్యలపై చర్చ...
పరిష్కార సూచన....
ఇది....ప్రజాదర్బారులోని సన్నివేశం
.....
రాణివాసం.... పూలపరిమళం...
పూదోటలు.... జలకాలాటలు....
కొలనులు...పిల్లగాలులు....
కత్తులు దూయండి....చురకత్తులుగా మారండి...
కఠోర శిక్షణతో రాటుదేలండి.
మందుగుండు దట్టించండి...
శత్రువుల గుండెల్లో ఫిరంగిగుండు పేల్చండి...
ఇది ఒక సుశిక్షిత సైని కేంద్రంలో
బ్రిటిష్‌ సైనికుల కదలికల కథ....
చిమ్మచీకటి....
ఏకశిలాగృహం...
VJA-23సన్నని రంధ్రం....
అందులోంచి పోటీపడుతూ వచ్చే గాలి....వెలుతురు....
లోపల బందీలు....
తప్పించుకునే వీలులేని బందిఖానా..
నేరగాళ్లకు వణుకు పుట్టించే చెరసాల...
గజ, అశ్వ, పదాతి దళాల కవాతుకు
ప్రత్యేక రహదార్లు....
సంపదతో తులతూగే ఖజనా...
శత్రువులను దూరం నుంచే గమనించేందుకు బురుజులు...
ఇవన్నీ....ఒకేచోట....
సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తున....
ఠీవిగా నిలబడిన ఓ కొండపై...
కొలువైనాయి.
అదే...కొండపల్లి....కోట.
ఈ కోటను కైవశం చేసుకునేందుకు శ్రీకృష్ణదేవరాయలంతటి యోధుడికి రెండునెలలు పట్టిందంటే... తమాషాకాదు.
అందుకే....
దానిగొప్పదనం
తెలుసుకోవాల్సిందే.

చరిత్ర
VJA-12క్రీశ1360వ సంవత్సరంలో రెడ్డి రాజైన అన వేమారెడ్డి ఈ కోట నిర్మాణం చేపట్టారు. రెడ్డి రాజుల అనంతరం గజపతి రాజులు ఇక్కడినుంచి పరిపాలన సాగించారు.తరువాత మహ్మదీయ రాజైన నిజాం ఉల్‌ ముల్మ్‌ పాలనలో మంత్రి గవాన్‌ ఆధ్వర్యంలో ఈ కోటకు క్రీశ 1471లో మరమ్మతులు జరి గాయి. ఆ తరువాత మహ్మద్‌ షా కాలం లో పురుషోత్తమ గజపతిని ఈ కోటకు అధిపతిని చేశాడు. క్రీశ 1516 సంలో విజయనగర రాజైన శ్రీ కృష్ణదే వరాయులు ఈ కోటను ముట్టడించి తిరిగి గజపతి రాజులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

అనంతరం గోల్కొండ ప్రభువైన కులీ కుతు బ్‌షా ఈ కోటను ఆక్రమించినట్లు తదు పరి ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కాలంలో ఈ కోటకు మెరుగులు దిద్ది, ఇతర సౌధాలు నిర్మించాడని చెబుతారు. అందుకే కొండ కింద భాగంలో అతని పేరుపై ఇబ్రహీంపట్నం గ్రామం నిర్మిం చినట్లు ఆధారాలున్నాయంటారు. ఆ తరువాత మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా కాలంలో ఈ కోటకు కట్టుదిట్టమైన భద్రత చేపట్టి చెరువులు, బావులు మొదలైనవి తవ్వించి నీటి సదుపా యాలు కల్పించారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్‌ చక్రవర్తి ఔరం గజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్‌జంగ్‌ పరిపాలించారు.

క్రీశ1766లో జనరల్‌ కాలియేడ్‌ కోటను ఆక్రమించి కెప్టెన్‌ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు కలవు. చివరగా కీశ 1767లో బ్రిటీష్‌ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలో కలుపుకుని తమ సిపాయిలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.

కోటలో విశేషాలు
కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజ్‌మహల్‌ గోడలపై ఉన్న కళాఖండాలను, నాటిని తీర్చిదిద్దిన కళాకారుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం... దర్బారు నిర్వహించే రాజమహల్‌, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్‌, అబ్బురపరిచే నర్తనశాల నిర్మాణం, నేటి రైతు బజార్‌లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం... ఇదంతా ఒక కొండపైనే ఉన్నాయి. అప్పటి రాజుల ముందుచూపు, ప్రజల భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం, వ్యూహం....ఇవన్నీ ఆ కోట నిర్మాణం వెనుక రహస్యాలు. వీటిని చూశాక....శ్రమైనా....ఆ కొండపల్లి కొండ ఎక్కాలని, కోటలోని రహస్యాలను చూడాలని తెలిసినవారికి చెప్పాలనిపించింది. అందుకే మీముందుకు ఈ కథనం.

ఇలా వెళ్లాలి
vihariకోల్‌కతా-చెనై్న 5వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడనుంచి 8 కి.మీ.లు ప్రయాణిస్తే కొండపల్లివస్తుంది.విజయవాడ నుంచి వచ్చేవారు ఇబ్రహీంపట్నం దాటాక నిమ్రా కాలేజీ స్టాప్‌ దిగి.. అక్కడి నుంచి 8 కి.మీ. ఆటోలో వెళ్లాలి.హైదరాబాద్‌ నుంచి వచ్చేవారు కంచికచర్ల దాటాక నిమ్రా కాలేజీ స్టాప్‌వద్ద దిగి వెళ్లవచ్చు.

టిక్కెట్‌ ధర
కోటను సందర్శించాలనుకునే వారు పెద్దలైతే రూ.5, పిల్లలకు రూ.3
ఫొటోలు తీసుకోదలచిన వారికి రూ.20
వీడియో తీసుకోవాల్సివారు రూ.100 పురావస్తుశాఖకు చెల్లించి
టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది.
సందర్శన వేళలు : ఉ.10.30 నుంచి సా.5గం. వరకు

వైఎస్‌ హయాంలో....
ఏళ్లతరబడి ఎవరూ పట్టించుకోకపోవడం, పురావస్తుశాఖలో శ్రద్ధ లేకపోవడంతో కొండపల్లి ఘనత పెద్దగా వెలుగులోకి రాలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2009లో డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ కొండపల్లికి కొత్తకళ వచ్చింది. వైఎస్‌ నిధులు విడుదల చేయడ‚ంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్‌, ఆయా ప్రాంతాలను తెలిపే సూచికలు, బోర్డులను ఏర్పాటు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు విస్తారంగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్య రంగంలో వివిధ రోగాలను తగ్గించేందుకు తయారు చేస్తున్న మందుల్లో ఈ ప్రాంతంలో ఔషధ మొక్కలు ప్రధానపాత్ర వహిస్తాయి. కొండపల్లి కోట, అక్కడి నిర్మాణాలు దెబ్బతినకుండా, వాటి ప్రాశస్త్యం చెక్కుచెదరకుండా, పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దేపనిలో ‘ఉడా’ ప్రస్తుతం నిమగ్నమైంది.

No comments:

Post a Comment