చరిత్రలో ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడ బౌద్ధం, బ్రాహ్మణం, వైష్ణవం, జైన, ఇస్లాం, క్రైస్తవ మతాలు
ఇక్కడ విలసిల్లాయి. ఐరోపాకు చెందిన డచ్, బ్రిటీష్, ఫ్రెంచ్, ఆర్మేనియన్లు ముర్షీదాబాద్‌లో నివశించారు.
బ్రిటీష్ వారి హయాంలో 1717లో బెంగాల్ ప్రావిన్స్‌కు రాజధానిగా ముర్షీదాబాద్ ఉండేది. ప్లాసీ యుద్ధం తర్వాత అంటే 1773లో రాజధానిని కోల్‌కతాకు బ్రిటీష్ వారు మార్చారు.
చూడవలసిన ప్రాంతాలు హజార్‌దువారీ
శాస్ర్తీయమైన వాస్తుకళతో హజార్‌దువారీని నిర్మించారు. హజార్‌దువారీ అంటే వేయి తలపులు భవంతి. ఈ భవంతిని నవాబ్ నజీమ్ కోసం 1837లో డంకన్ మెక్‌లాడ్ నిర్మించారు. హజార్‌దువారీ భవంతిలో ప్రస్తుతం వస్తు ప్రద ర్శన శాల ఉంది. ఇందులో అనేక కళాఖండాలను భద్రపరిచారు. హజార్‌దువారీ భవంతిలో 114 గదులు ఉన్నాయి. ఈ భవంతిని 41 ఎక రాల సువిశాల స్థలంలో నిర్మించారు. ఇదే భవంతిలో గ్రంధాలయం కూడా ఉంది. ఈ భవంతి పరిసరాల్లో మదీనా అనే మసీదు, వాసెఫ్ మంజిల్, త్రిపోలియా గేట్, దక్షిణ దర్వాజా, ఛాక్ దర్వాజాలు ఉన్నాయి.
ఇమాంబారా
వసతి: పశ్చిమ బెంగాల్ పర్యాటక సంస్థకు చెందగిన హోటళ్లతో పాటుగా ఇతర వసతి సదుపాయం ఉంది.
ఎలా చేరుకోవాలి:
విమాన మార్గం: కోల్‌కతా (221 కి.మీ.) సమీపంలో విమానాశ్రయం.
రైలు మార్గం: కోల్‌కతాలోని హౌరా, సీల్డాల నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది.
రహదారి మార్గం: కోల్‌కతా నుంచి 221 కి.మీ. దూరంలో ముర్షీదాబాద్ ఉంది.
No comments:
Post a Comment