ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఇటలీలోని డోలోమైట్స్ పర్వతాలు. అందమైన ఆల్ప్స్ పర్వతాలలో భాగమే ఈ డోలోమైట్స్. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేరి అరుదైన ఘనతను సంపాదించుకున్న డోలోమైట్స్... ప్రపంచంలోనే ఎంతో అందమైన పర్వతాలుగా దేశవిదేశ పర్యాటకులను అలరిస్తున్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధానికి మూగ సాక్షులు...
మొదటి ప్రపంచ యుద్ధా నికి మూగ సాక్షులైన ఈ డోలోమైట్స్ పర్వతాల్లో.. 1915 మే నుంచి 1917 అక్టో బర్ వరకూ ఇటలీ, ఆస్ట్రియా దేశా ల సైనికులు 20 నెలలపాటు తలపడ్డా రు. ఈ యుద్ధంలో ఇరు పక్షాలు ప్రయోగించిన బాంబుల వల్ల కూడా ఈ పర్వతాలు రకరకాల ఆకారాల్లో ఏర్పడిన మార్పులు చూపరులను ఆకర్షించడం మరో విశేషం. ఇప్పటికీ అక్కడ కనిపించే యుద్ధ గుర్తుల కోసం ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.
సముద్రం నుండి ఉద్భవించి...
డోలోమ్యూ అనే ఫ్రెంచ్ ఖనిజ శాస్తజ్ఞ్రుడు ఈ పర్వతాల శిలలపై పరిశోధనలు చేసి, ఇవి ప్రత్యేకమైన కర్బన పదార్థంతో కూడిన డోలోమైట్ అనే రాయితో ఏర్పడ్డాయని కనుగొన్నాడు. దీంతో ఈ పర్వతాలకు డోలోమైట్స్ పర్వతాలు అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ డోలోమైట్స్ పర్వతాలలో చెప్పుకోవాల్సిన విచిత్రం మరో టుంది. అదేంటంటే.. 25 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పర్వ తాలు సముద్రంలోంచి పొడుచుకొచ్చాయి. అందువల్లనే నీరు, మంచు, గాలుల కారణంగా చిత్రమైన ఆకారాలను ఇవి సంతరిం చుకుని చూపు మరల్చుకోనీయకుండా చేస్తాయి.
యూనెస్కో వారసత్వ సంపద...
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచం లోని 13 దేశాలలోని కొన్ని ప్రదేశాలను కొత్తగా వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. వీటిలో డోలోమైట్స్ పర్వతాలు చేరాయి. స్పెయిన్ కేం ద్రంగా పనిచేసే యునెస్కో వివిధ దేశాల్లోని ప్ర కృతి, సాంస్కృతికపరమైన అద్భుత ప్రదేశాలు గుర్తించి, వాటి రక్షణకు కృషి చేస్తోంది.
No comments:
Post a Comment