Total Pageviews

Tuesday 27 September 2011

ప్రకృతి రమణీయతకు మారుపేరు కార్గిల్‌

జమ్మూకాశ్మీర్‌ లోని కార్గిల్‌ అనగానే అందరికీ భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం గుర్తుకు వస్తుంది. నిజానికి పర్యటన స్థలంగా ఇదెంతో పేరుగాంచింది. కార్గిల్‌ శ్రీనగర్‌ నుంచి 204 కి.మీ దూరంలో ఉంది. లెహ్‌ జాతీయ రహదారిపై నుంచి లేదా లడఖ్‌ నుంచి కూడా ఇక్కడకు చేరుకోవచ్చు.

ఆసక్తిదాయక ప్రదేశాలు
డ్రెస్‌: ఇది ఓ చిన్న పట్టణం. కార్గిల్‌కు దగ్గరగా 57 కి.మీ దూరంలో శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారి మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు. ఇది ప్రపంచంలో అతి చల్లని ప్రదేశాల్లో ఒకటిగా పేరొందింది. ఇక్కడి ప్రజలు డర్డ్‌స్టాక్‌, ఇండోఆర్యన్‌ జాతివారు. వీరి పూర్వీకులు సెంట్రల్‌ ఆసియా నుంచి ఇక్కడకు వచ్చారని చెబుతారు.

సరూలోయ: ఇది సారవంతమైన అందమైన భూమి. ఇక్కడ టిబెట్‌-డార్‌ ప్రజలు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతమంతా కూడా ప్రకృతి రమణీయ దృ శ్యాలకు పేరుగాంచింది. 7135 మీటర్ల ఎత్తున ఉండే ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉంటుంది. పర్వతారోహకులు ఎంతో ఇష్టపడే ప్రాంతం ఇది.
kargil-4రాన్‌గ్‌ డ్యామ్‌: ఏకాంత వాతావరణం ఉండే లోయ ఇది. ఇది కార్గిల్‌కు 130 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 17వ శతాబ్దం నాటి విహారం ఉంది.

మలక్‌బేఖ్‌: ఇది కార్గిల్‌కు తూర్పున 35 కి.మీ. దూరంలో లేహ్‌ దారిలో ఉంది. ఇక్కడ కూడా 9 అడుగుల మైత్రేయి విగ్రహం ఉంది. ఇక్కడ ముల్‌ బేఖ్‌ విహార కేంద్రం ఉంది.

జాన్స్‌కార్‌: చాలా లోపలికి ఏకాంతంగా ఉండే లడక్‌ లోయ. ఇక్కడ అనేక ఆసక్తిదాయక విహారాలు, స్మారకస్థూపాలు ఉన్నాయి. ఈ లోయ మనాలి, క్రిస్ట్‌వార్‌, లేహ్‌, ఇండస్‌ లోయలను కలుపుతుంది.

Kargil_townకర్ష: ఇక్కడ 16 శతాబ్దపు పూర్వపు విహారాలు కూడా ఉన్నాయి.
బర్‌దాన్‌: విహార స్థలం. ఎన్నో రకాల విగ్రహాలు, స్థూపాలు ఉన్నాయి.
ఫగ్‌తాల్‌: ఇది జన్స్‌కార్‌ లోని రెండు అపురూప
విహారాలు ఉన్న ప్రాంతం.
జంగ్‌ముల్‌: ఇక్కడ గుహ విహారం ఉంది. ఇది రెండు గుహలకు విస్తరించి ఉంది.

No comments:

Post a Comment