పేదవాడి కాశ్మీరం... ఆంధ్ర ఊటిగా ప్రస్థిది చెందిన హర్సిలీ హిల్స్ ప్రకృతి అందాలతో పులకిస్తోంది. సముద్ర మట్టానికి తిరుమల క్షేత్రం కంటే ఎతె్తైన ప్రదేశంలో వుండడంతో ‘చల్లని వాతావరణం’ తన సొంత చేసుకొన్న హార్సిలీ కొండ ప్రముఖ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన ‘రిషివ్యాలి’కి ఆనుకొని వుండడం మరో ప్రత్యేకం. ఆంధ్రప్రదేశ్ , కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గవర్నర్ వేసవి విడిది కేంద్రంగా హార్సిలీ హిల్స్ గుర్తింపు పొందింది. ఆంధ్రరాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన ఏకైక వేసవి విడిదిగా ప్రత్యేక గుర్తింపు పొంది, నిత్యం హిరిత శోభితంగా హార్సీలీహిల్స్ ప్రఖ్యాతి గాంచింది.
హిల్స్ రూట్ మ్యాప్...
చెనై్న నుండి చిత్తూరు మీదుగా మదనపల్లెకు చేరి హార్సిలీహిల్స్ చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి మదనపల్లె మీదుగా హార్సిలీ హిల్స్ చేరుకోవచ్చు. హైదరాబాదు నుంచి కదిరి మీదుగా నేషనల్ హైవేలోని అమరనారాయణపురం క్రాస్‌కు వచ్చి అక్కడి నుంచి పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణించి హిల్స్ చేరవచ్చు.
ఇదీ కథ...
హార్సిలీహిల్స్‌ను గతంలో ఇక్కడి ప్రజలు ఏనుగు మల్లమ్మగా పిలిచేవారు. బ్రిటీష్ దొరల పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్ రావత్ హార్సిలీ మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి గుర్రంపై వెళుతూ మార్గమధ్యంలో ఈ కొండపైకి చేరుకున్నాడు. ఇక్కడి వాతారణానికి ముగ్దుడై అమితంగా అకర్షితుడయ్యాడు. కొండపై బంగ్లా నిర్మించి బస చేయడంతో ఆయన పేరు మీద ఏగుగు మల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవడం ఆరంభించారు. హిల్స్‌లో సర్ హార్సిలీకి ఒక కొడుకు జన్మించి ఆదే రోజు మృతి చెందడంతో అక్కడ జూనియర్ హార్సిలీ పేరిట సమాధిని, అలాగే తన పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో కుక్క సమాధిని నిర్మించారు.
సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో వున్న హార్సిలీహిల్స్ ప్రకృతి ప్రసాదించిన అందాలకు మెరుగులు దిద్దుతూ తమిళనాడులోని ఊటిని మైమరిపించే విధంగా వుంటుంది. ఇలాంటి ప్రకృతి అందచందాలు కలిగిన హార్సిలీహిల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ అభివృద్ధి పనులను చేపట్టింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కర్నాటక, తమిళనాడు పర్యాటకులు ఇక్కడికి విశేషంగా వస్తుంటారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజం శాఖ కోట్లాది రూపాయల ఖర్చుతో ఆధునాతన సౌకర్యాలు కల్పించింది. అతిథి గృహాలు, భోజన ప్రియుల కోసం పున్నమి రెస్టారెంట్, మద్యం ప్రియుల కోసం బార్, పిల్లలు కోసం విశాలమైన ఆటస్థలం తదితర వసుతులు ఇక్కడ వున్నాయి. దేశంలోనే ఏ ప్రదేశం నుండైనా హిల్స్‌లోని అతిథి గృహాలను బుకింగ్ చేసుకొనుటకు ఆన్‌లైన్ సౌకర్యం వుంది.
ఏన్నో ఆకర్షణలు...
హిల్స్‌లోని చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిలరావాలు, దట్టమైన అడవుల సోయగాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్, స్విమ్మింగ్ సెంటర్, మసాజ్ సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ వారు ఇక్కడ జంతు ప్రదర్శనశాలలో వివిధ రకాల కోతులు, ఆఫ్రికన్ పక్షులు, చిలుకలు, గిన్యా పందులు, గుడ్డగూబలు తదితర లైబ్రరీ, వివిధ జంతువుల బొమ్మలు, వాటిపైన డాక్యుమెంటరీలు వున్నాయి. ట్రైక్కింగ్ సదుపాయం కలదు. హార్సిలీహిల్స్ గల గాలికొండ, మైక్రోవేవ్ రెసివర్ స్థలాలు, ప్యూవ్ పాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
అతిథి గృహాలు...
ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అధికారులకు మాత్రమే వసతి కల్పించి, మిల్క్ హౌస్‌లతో పాటు హార్సిలీ, పింఛా, కౌండిన్యా, మాండవి, బహుదా, కళ్యాణి తదితర అతిథి గృహాలు కలవు. అద్దె రోజుకు రూ. 300 వసూలు చేస్తారు. పర్యాటక శాఖ అతిథిగృహాలు ఒక్కొక్కరికి రూ. 100లతో డెర్మెటరీ వసతి, స్పెషల్ కాటేజీ రూ. 600, డబుల్ కాటేజి రూ. 1000, ఎన్‌జిఓ బ్లాక్ రూ. 840, ఎబాక్ల్ 1. రూ. 2000. అలాగే హాలిడే హోమ్‌లో 12 అతిథి గృహాలున్నాయి. అద్దె రోజుకు రూ. 300 నుండి రూ. 700 వరకు పరిస్థితులను బట్టి వసూలు చేస్తారు. ఇవికాక పోలీసు, రైల్వే, రెవెన్యూ, కర్నాటక గెస్ట్‌హోస్, అభిరామ్ రిసార్ట్స్ తదితర అతిథి గృహాలు కలవు.
No comments:
Post a Comment