Total Pageviews

Monday 19 September 2011

అందాల హరితవనం విల్లుపురం...

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో విల్లుపురం ఒకటి. ఇక్కడ దట్టమైన అడవిలో పచ్చ దనంతో పరుచుకున్న విల్లుపురం దగ్గరలోని కల్రా యన్‌ పర్వతశ్రేణుల్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. పర్వత శ్రేణుల నడుమ వయ్యారంగా ప్ర వహించే గోముఖీ నది, అడవి మధ్యలో సెలయేటి చప్పుళ్ళు, ఆహ్లాదాన్నిచ్చే పెరియార్‌, మేఘం జలపా తాలు, నిటారుగా దర్శనమిచ్చే కల్రాయన్‌ పర్వత శిఖరాలు, అడుగడుగునా ఆహ్లాదపరిచే ప్రాంతాలు, పురాతనమైన కట్టడాల శోభతో... పర్యాటకులకు విశేషంగా ఆర్షిస్తున్న విల్లుపురంలో ఊటీని మించిన అందాలున్నాయంటే అతిశయోక్తి కాదు.

Kalrayan-Hills1ప్రకృతి సౌందర్యాదిదేవత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుం దా..?! అన్నట్లుండే విల్లుపురం సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. తమిళనాడు రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లా అయిన విల్లుపురం.. తిరుచ్చి-చెన్నై హైవేలో జిల్లా కేంద్రం గా విరాజిల్లుతోంది. కనువిందు చేసే పచ్చటి కొండలు, చారిత్రా త్మకమైన ప్రాచీన నిర్మాణాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, కోటలు, రాజమందిరాలు.. ఇలా ఒకటేమిటి, అనేక పర్యాటక ప్రదేశాలను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి బస్సు, రైలు సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి.

చూడాల్సినవివే...
కల్రాయన్‌ కొండలు ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం, కళ్లకుర్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కల్రా యన్‌ కొండల అందాలను చూసి తరించేందుకు కళ్లకుర్చి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. సముద్రమట్టం నుంచి 3,500 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో కొలువు దీరిన కల్రాయన్‌ కొండలు ఊటీని తలపించే చల్లటి వాతావరణం తో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దట్టమైన అడవి, సెలయేళ్ల పరు గులు, వనమూలికావనం, గోముఖీ నది పర్యాటకులను పరవశిం పజేస్తున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన ఎకో టూరి జం స్పాట్లు కూడా పర్యాటకులకు ప్రకృతి మధ్య సేదదీర్చే కేంద్రా లుగా ఉన్నాయి. కల్రాయన్‌ కొండల్లో పలు జలపాతా లున్నప్ప టికీ, కొన్నింటిలో మాత్రమే స్నానాలు చేసేందుకు వీలవుతుంది.

పెరియార్‌ జలపాతం:
గోముఖీ డ్యాం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరియార్‌ జలపాతం పర్యాటకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. గోముఖీ డ్యాం-కరియలూర్‌కు బస్సుమార్గంలో వెళితో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. రోడ్డుపక్కనే ఉన్న ఈ జలపాతంలో జలకాలాడవచ్చు కూడా. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కరియలూర్‌ ఉంటుంది. పెరియార్‌ జలపాతం నుంచి కరియలూరుకు వెళ్లే మార్గంలో పచ్చని కొండ ప్రాంతాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటకుల కోసం విడిది గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పెరియార్‌ జలపాతం నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వెల్లిమలైకి చేరుకోవచ్చు. అక్కడినుంచి మరో ఐదు కిలోమీటర్ల దూరం వెళితే సంవత్సరమంతా పుష్కళంగా నీరు లభించే మేఘం జలపాతం దర్శించవచ్చు.

జింజికోట:
Megam-Waterfallsవిజయనగర పాలకులు నెల్లూరును పరిపాలించిన కాలంలో మూడు కొండలపై నిర్మితమైన ఈ జింజికోటను... రాజధానిగా చేసుకుని పాలించారు. కృష్ణగిరి, చక్కిలిదుర్గ, రాజగిరి అనే కొండలు ముక్కోణం ఆకారంలో వెలిశాయి. వాటిపై జింజికోటను అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ కోటలో ఇండో-ఇస్లామిక్‌ రీతిలో నిర్మించిన కళ్యాణ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం వద్ద నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం నేటికీ పూజలందుకుంటోంది. హనుమాన్‌ ఆలయం, రంగనాథ్‌ దేవాలయం, ఉల్లాఖాన్‌ మసీదు, కమలకన్ని ఆలయాలను మొగల్‌ చక్రవర్తులు, విజయనగరరాజులు ఇక్కడ నిర్మించారు.

1012లో రాజేంద్రచోళుడు నిర్మించిన రామనాథ ఈశ్వరాలయం, బ్రహ్మ ఇస్లాం ఆలయంగా ప్రసిద్ధి చెందింది. విల్లుపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువాక్కరైలోని నేషనల్‌ జియోలాజికల్‌ పార్క్‌ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. ఈ పార్కు వేలాది రకాల చెట్లతో అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి దగ్గర్లోనే చోళ చక్రవర్తుల పాలనలో సెంబియాన్‌ మహదేవర్‌ అనే మహారాణి శివాలయాన్ని నిర్మించారు.

రాయలవారు దానమిచ్చారట..!
విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్త రించిన కల్రాయన్‌ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రా జ్యాధిపతి శ్రీకృష్ణ్ణదేవరాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన కర్లర్‌ అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయలవారి హయాంలో నిర్మించిన కట్టడాలు అనేకం నేటికీ విల్లుపురంలో దర్శనమిస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

No comments:

Post a Comment