Total Pageviews

Wednesday 28 September 2011

భక్తుల పాలిట పెన్నిధి నరసింహుని సన్నిధి

నెల్లూరు జిల్లాలోని రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రములో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు తమ పాలిట పెన్నిధిగా ఆరాధిస్తారు. ఇక్కడ దేవదేవేరులు భక్తాభీష్ట ఫలప్రభుదులై కోరిన వరాలు ఇస్తారన్నది భక్తుల విశ్వాసం. కృతయుగమున అవతరించిన విష్ణుమూర్తి నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారంలో స్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేసేందుకు భూమిపై నవనారసింహులుగా అవతరించినట్లు పురాణ కథనం.

alyamsశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని పెంచలకోన క్షేత్రములో స్వయంభువుగా వెలసి ఉన్న శ్రీలక్ష్మీసమేత నరసింహస్వామిని భక్తులు తమ పాలిట పెన్నిధిగా ఆరాధిస్తారు. శ్రీస్వామి వారు లోక కళ్యాణార్ధం కోసం కోన క్షేత్రంలో స్వయంభువుగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతోంది. భక్తుల పాలిట ఇలవేల్పు ఆరాధ్యదైవంగా స్వామివారు వెలుగొందుతూ దినదిన వ్రపర్ధమానం చెందుతున్నారు. ఇక్కడ శ్రీస్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభవుగా వెలసి ఉన్నారు. అల్లంత దూరమున ఆదిలక్ష్మి అమ్మవారున్నూ స్వయంభువుగా వెలసింది. ఈ దేవదేవేరులు భక్తాభీష్ట ఫలప్రభుదులై కోరిన వరాలు ఇస్తారన్నది భక్తుల విశ్వాసం.

pujaayamదశావతారంలో మేటిగా నరసింహావతారం అంటారు. కృతయుగమున అవతరించిన విష్ణుమూర్తి నాల్గవ అవతారమే నరసింహ అవతారం. ఈ అవతారంలో శ్రీస్వామి వారు దుష్టశిక్షణ, శిష్టరక్షణలు చేసి ముక్త జీవులను తరింపచేయుటకు భూమిపై నవనారసింహులుగా అవతరించినట్లు పురాణ కథనం. ఈ క్షేత్రం చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో పెనవేసుకొని శిలారూపమున ఇక్కడ వెలసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ స్వయంభువు వెనుక భాగమున మహా శిల ఉన్నది. ఈ గిరిశిఖరముల నుండి జాలువారు వర్షపునీటి ధార వెండి కరిగించి మూసలో పోయురీతిన స్వచ్ఛంగా ప్రవహించి దిగువ గ్రామాలకు వరప్రసాదియై కండలేరు జలాశయమున కలుస్తున్నది.

ఈ స్వామి చెంచు వనితైన లక్ష్మీదేవిని పెనవేసుకొని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుశిల క్షేత్రమని పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఆ పేరు రూపాంతరం చెంది పెంచలకోనగా మారిపోయిందని చెబుతారు. ఈ ప్రాంతం వారు నేటికీ తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ అని స్వామివారి పేరు పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈ ఛత్రవటి నారసింహుడు గొల్లబోయను శిలారూపమున అనుగ్రహంచినాడని చెబుతారు.

hanumansఈ గొల్లపోయిన ఆలయము గోనుపల్లి గ్రామ సమీపాన ఉన్నది. శకుంతలా దుష్యంత చవ్రర్తుల పరిణయం, భరతుని బాల్యక్రీడలతో ఈ పవిత్ర క్షేత్రం పునీతమైందని చెబుతారు. ప్రతి శనివారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి. శ్రీవారికి జరుగు బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమవుతాయి. శుద్ధ చతుర్ధశి నాడుగరుడసేవ నిర్వహిస్తారు. పూజలు పాంచరాత్ర అగనానుసారం పంచాహ్నికముగా జరుగుతాయి. శ్రీవారి మహోత్సవ పూర్వోత్తర కాలమందు సుమారు ఒక నెల స్వామివారు స్నానాద్యష్టానములను కావించుకొందురని ఈ సమయాన నప్తరుషులు స్వామివారికి దివ్యఛత్రము పట్టెదరని నానుడి. ఈ కారణం చేత స్వామివారికి ఛత్రవటి నారసింహస్వామికి ఆ పేరు సార్థకమైంది

No comments:

Post a Comment